ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. ఆరంభంనుంచి తీవ్ర ఒడిదుడుకుల మధ్య నడిచిన సూచీలు బలహీనమైన గ్లోబల్ మార్కెట్ల కారణంగా చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. ప్రధానంగా ఇండెక్స్ హెవీవెయిట్ ఆర్‌ఐఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, లుపిన్ బాగా లాభపడడంతో మిడ్ సెషన్‌లో మార్కెట్లు బలపడ్డాయి. నష్టాల నుంచి బయటపడి లాభాల్లోకి ప్రవేశించాయి. చివరికి సెన్సెక్స్9 పాయింట్ల నష్టంతో 31360 వద్ద, నిఫ్టీ 9 పాయింట్ల నష్టంతో 9665 వద్ద క్లోజ్ అయ్యాయి.
ఫార్మా, రియల్టీ లాభపడగా, ఐటీ , మెటల్ ఇండెక్స్ బలహీనంగా ముగిసింది. అరబిందో, డాక్టర్ రెడ్డీస్, సిప్లా ఎయిర్‌టెల్, జీ ఎంటర్‌టైన్మెంట్, ఐషర్, టెక్ మహీంద్రా, బీపీసీఎల్ లాభాల్లో, వేదాంతా, అంబుజా, ఏషియన్ ఫెయింట్స్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ, యాక్సిస్, బజాజ్ ఆటో, హీరోమోటో, ఐటీసీ, నష్టపోయాయి.
అటు డాలర్ మారకంలో రూపాయి 0.12పైసలు ఎగిసి రూ. 64.65 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం పది గ్రా. 96 రూపాయలు బలహీనపడి రూ.28,020వద్ద ఉంది.