నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
Published Wed, Jun 28 2017 3:42 PM | Last Updated on Tue, Sep 5 2017 2:42 PM
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆరంభంలోనే నష్టాలను చవిసూచిన మార్కెట్లు చివరికి సెన్సెక్స్124 పాయింట్ల నష్టంతో 30, 834 వద్ద, నిఫ్టీ 19 పాయింట్ల నష్టంతో 9491 వద్ద ముగిశాయి. గడచిని మూడు సెషన్లుగా నెలకొన్ని సెల్లింగ్ ప్రెజర్ కారణంగా సెన్సెక్స్, నిఫ్టీ సాంకేతిక స్థాయిలకు దిగువనే ముగిశాయి. ముఖ్యంగా 2017 లో మొదటిసారిగా నిఫ్టీ వరసగా ఆరవ సెషన్లో కూడా నష్టాలనే ఎదుర్కొంది. మెటల్ సెక్టార్‌లాభపడగా, ఎనర్జీ, మీడియా,బ్యాంకింగ్ సెక్టార్ నష్టపోయాయి. ఆర్‌ఐఎల్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ, జీ, ఓఎన్‌జీసీ, ఎంఅండ్‌ఎం, స్టేట్‌బ్యాంక్, ఐటీసీ నష్టపోగా, టెక్‌మహీంద్రా, యస్‌బ్యాంక్, అంబుజా, టాటా స్టీల్, వేదాంతా, ఎయిర్‌టెల్, అల్ట్రాటెక్, ఐషర్, ఇన్‌ఫ్రాటెల్, ఎన్‌టీపీసీ లాభపడ్డాయి.
అటు డాలర్ మారకంలో రుపాయి 0.07 పైసల నష్టంతో 64.61 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి పదిగ్రా. రూ. 143 ఎగిసి రూ. 28, 696 వద్ద ఉంది.
Advertisement
Advertisement