భారీ లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ!
భారీ లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ!
Published Tue, Jul 22 2014 1:07 PM | Last Updated on Sat, Sep 2 2017 10:42 AM
హైదరాబాద్: ఆసియా మార్కెట్లలో సానుకూలత, విదేశీ నిధుల ప్రవాహం, కార్పోరేట్ ఫలితాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రధాన సూచీలలో సెన్సెక్స్ 231 పాయింట్ల లాభంతో 25946 పాయింట్ల వద్ద, నిఫ్టీ 59 పాయింట్ల వృద్దితో 7743 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో భారతీ ఎయిర్ టెల్ అత్యధికంగా 4.26 శాతం, రియలన్స్ 3.35, హిండాల్కో 2.96, హెచ్ డీఎఫ్ సీ 2.96, ఏషియన్ పెయింట్స్ 1.88 శాతం లాభాల్ని నమోదు చేసుకున్నాయి.
పవర్ గ్రిడ్ కార్పోరేషన్, లార్సెన్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, గ్రాసీం కంపెనీలు నష్టాల్లో ట్రేడ్ అవున్నాయి.
Advertisement