corporate earnings
-
భారత్ కార్పొరేట్ ఆదాయాలు 12% డౌన్!
ముంబై: భారత్ కార్పొరేట్ ఆదాయాలు గడచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (2022–23, జనవరి–మార్చి) 10 నుంచి 12 శాతం పడిపోతాయని భావిస్తున్నట్లు క్రిసిల్ మార్కిట్ ఇంటిలిజెన్స్ తాజా నివేదిక పేర్కొంది. 2021–22 ఇదే కాలంలో ఆదాయాల వృద్ధి 22.8 శాతంగా ఉంది. కంపెనీలు నాల్గవ త్రైమాసిక ఫలితాలను వెల్లడిస్తున్న నేపథ్యంలో తాజా నివేదిక వెలువడ్డం గమనార్హం. 47 రంగాలకు చెందిన 300 కంపెనీల గణాంకాల విశ్లేణలనకు అనుగుణంగా తాజా నివేదిక వెలువడింది. హై బేస్ కూడా తాజా అంచనాలు ‘తగ్గించడానికి’ కారణమని క్రిసిల్ వర్గాలు వెల్లడించాయి. నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► 2021–22లో కంపెనీల ఆదాయాల వృద్ధి 27 శాతం కాగా, 2022–23లో ఇది 19 నుంచి 21 శాతానికి పరిమితం కానుంది. ► నిర్వహణా లాభాలు కేవలం 3 శాతంగా ఉండనుంది. ► కంపెనీల ఆదాయాలపై ఎగుమతుల మందగమన ప్రభావం పడనుంది. ► వస్తువులు, ఎగుమతి ఆధారిత రంగాలైన టెక్స్టైల్స్, రత్నాలు–ఆభరణాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ–ఎనేబుల్డ్ సర్వీసుల ఆదాయాలు తగ్గుముఖం పట్టాయి. ► 2022లో మేలో ఎగుమతి సుంకాలు విధించడం వల్ల స్టీల్ ఉత్పత్తి సంస్థల ఆదాయాలు 7 నుంచి 9 శాతం వరకూ పడిపోవచ్చు. అంతర్జాతీయ మందగమన పరిస్థితులూ దీనికి కారణం కావచ్చు. ► మందగమనం వల్ల అల్యూమినియం ఇండస్ట్రీ ఆదాయాలు కూడా 17 నుంచి 19 శాతం వరకూ పడిపోవచ్చు. ► ఎయిర్‌లైన్స్, హోటళ్లు, మీడియా, వినోదం, రిటైల్ వంటి వినియోగదారుల విచక్షణ ఉత్పత్తులు ఆదాయ వృద్ధికి దారితీశాయి. అలాగే ఫార్మాస్యూటికల్స్, ఫాస్ట్ మూవింగ్ కన్సూ్యమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) వంటి వినియోగదారులకు డిమాండ్ వృద్ధి కొనసాగుతుంది. ► హోటళ్ల పరిశ్రమల 98 శాతం పురోగమించే వీలుంది. ఎయిర్‌లైన్స్ 67 శాతం శాతం పెరిగితే, టెల్కోల ఆదాయాలు 13 శాతం పెరిగవచ్చు. ► ముడి చమురు, నాన్–కోకింగ్ బొగ్గు వంటి కీలకమైన ఎనర్జీ సంబంధ కమోడిటీల ధరలు వాటి గరిష్ఠ స్థాయిల నుండి దిగివస్తున్నట్లు కనిపిస్తోంది. మందగమన ప్రపంచ డిమాండ్ ప్రభావాన్ని ఈ ‘తగ్గిన ధరలు’ పాక్షికంగా భర్తీ చేస్తాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో (2023–24) కమోడిటీ ధరలు తగ్గుముఖం పట్టడం, వాణిజ్య పరిమాణాలు పెరగడం వల్ల కార్పొరేట్ల లాభదాయకత మెరుగుపడే అవకాశం ఉంది. -
ఆర్బీఐ సమీక్ష, క్యూ3 ఫలితాలే కీలకం..!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గత శుక్రవారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ప్రభావం ఈ వారంలో కూడా స్టాక్ మార్కెట్‌పై ఉండనుందని దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రభావం కొనసాగనున్నప్పటికీ.. ఫిబ్రవరి 7న వెల్లడికానున్న ఆర్బీఐ ఆరవ ద్వైమాసిక పాలసీ సమీక్ష నిర్ణయం దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనుందని భావిస్తున్నారు. ఈ ప్రధాన అంశానికి తోడు అంతర్జాతీయ పరిణామాలు, స్థూల ఆర్థిక అంశాల వెల్లడి, క్యూ3 గణాంకాలపై ఈవారం ఇన్వెస్టర్లు దృష్టిసారించినట్లు ఎస్సెల్ మ్యూచువల్ ఫండ్ సీఐఓ విరల్ బెరవాలా విశ్లేషించారు. విదేశీ నిధుల ప్రవాహం కూడా ఈవారంలో కీలక పాత్ర పోషించనుందని చెప్పారాయన. ‘కేంద్ర ప్రభుత్వ పరిమిత ద్రవ్యోల్బణ వైఖరిని బడ్జెట్ వెల్లడించిన నేపథ్యంలో ప్రత్యేకించి గ్రామీణ వ్యవసాయ రంగం.. రిటైల్, గృహా రుణాల కార్పొరేట్ ఆదాయాలు పెరిగేందుకు అవకాశం ఉంది.’ అని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్థికవేత్త ధనన్జయ్ సిన్హా పేర్కొన్నారు. ఫార్మా ఫలితాలు.. పలు దిగ్గజ ఫార్మా కంపెనీలు ఈవారంలో వెల్లడికానున్నాయి. బుధవారం లుపిన్, సిఫ్లా.. గురువారం అరబిందో ఫార్మా, కాడిలా హెల్త్‌కేర్ క్యూ3 గణాంకాలను ప్రకటించనున్నాయి. ఇతర దిగ్గర కంపెనీల్లో సోమవారం (4న) కోల్ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్, ఐఆర్బీ ఇన్ఫ్రా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఎక్సైడ్ ఫలితాలను ప్రకటించనుండగా.. మంగళవారం (5న) టెక్ మహీంద్రా, గెయిల్, హెచ్‌పీసీఎల్, ఏసీసీ, బీహెచ్ఈఎల్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, డీఎల్ఎఫ్, అపోలో టైర్స్, టాటా గ్లోబల్, డిష్ టీవీ గణాంకాలు వెల్లడికానున్నాయి. బుధవారం (6న) అదానీ పోర్ట్స్, అదానీ పవర్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అలహాబాద్ బ్యాంక్.. గురువారం (7న) టాటా మోటార్స్, బ్రిటానియా, అదానీ ఎంటర్ప్రైజెస్, కాఫీ డే, గ్రాసిమ్ ఫలితాలు వెల్లడికానున్నాయి. శుక్రవారం (8న) మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్‌హెచ్‌పీసీ, బీపీసీఎల్, ఇంజనీర్స్ ఇండియా ఫలితాలను ప్రకటించనున్నాయి. స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి నికాయ్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ జనవరి డేటా మంగళవారం వెల్లడికానుంది. అంతర్జాతీయ అంశాల పరంగా.. అమెరికా ఉద్యోగ గణాంకాలు, జీడీపీ గణాంకాలు, పర్చేజ్ మేనేజర్స్ ఇండెక్స్ ఈవారంలోనే వెల్లడికానున్నాయి. వీటితోపాటు అమెరికా–చైనా వాణిజ్య యుద్ధ అంశం, వెనిజులాలో సంక్షోభం వంటి అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టిసారించినట్లు దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశాలతో ముడిపడి.. ముడిచమురు, రూపాయి కదలికలు ఆధారపడి ఉండగా.. ఈ ప్రభావం మార్కెట్‌పై ఉండనుందని తెలిపారు. గత నెల్లో 30 శాతం పతనాన్ని నమోదుచేసిన బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్.. మళ్లీ ఎగువస్థాయిల వైపు ప్రయాణం కొనసాగిస్తున్నాయి. 62 డాలర్ల సమీపానికి చేరుకున్నాయి. ధరలు మరింత పెరిగితే భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉన్న నేపథ్యంలో ఈ కదలికలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ‘మళ్లీ క్రూడ్ ధరల జోరు కారణంగా డాలరుతో రూపాయి మారకం విలువ 71కి చేరుకుంది. 70.80 వద్దనున్న కీలక నిరోధాన్ని అధిగమించిన నేపథ్యంలో ఆ తరువాత రెసిస్టెన్స్ 72.60 వద్ద ఉంది. సమీపకాలంలో రూపాయి విలువపై ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. కీలక మద్దతు స్థాయి 70.40– 69.90 వద్ద కొనసాగుతోంది.’ అని అబియన్స్ గ్రూప్ చైర్మన్ అభిషేక్ బన్సల్ విశ్లేషించారు. ఎఫ్ఐఐల నికర విక్రయాలు.. గత నెలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.5,300 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.5,264 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.97 కోట్లను జనవరిలో వెనక్కి తీసుకున్నారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా.. ఎఫ్‌పీఐలు వేచిచూసే వైఖరిని ప్రదర్శిస్తున్నారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ వ్యాఖ్యానించారు. -
కార్పొరే ట్ల ఆదాయ వృద్ధి అంతంతే
క్యూ2పై క్రిసిల్ అంచనా న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కార్పొరేట్ల ఆదాయాలు స్వల్పంగా 1.6 శాతమే పెరిగే అవకాశముందని క్రిసిల్ రీసెర్చ్ తెలిపింది. అదే జరిగితే వరుసగా అయిదో క్వార్టర్లోనూ ఒక్క అంకె స్థాయి వృద్ధి మాత్రమే సాధించినట్లవుతుందని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారుల నుంచి డిమాండ్ తక్కువగా ఉండటం, పెట్టుబడుల ఆధారిత రంగాలు బలహీనంగా ఉండటంతో పాటు అంతర్జాతీయంగా కమోడిటీల ధరలు క్షీణించడం తదితర అంశాలు.. ఎగుమతి ఆధారిత రంగ సంస్థల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని క్రిసిల్ రీసెర్చ్ తెలిపింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ క్వార్టర్లో కార్పొరేట్ల ఆదాయం గతేడాది సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే 1.6 శాతం స్థాయిలోనే వృద్ధి చెందవచ్చని పేర్కొంది. నిర్వహణ లాభం వృద్ధి కేవలం 2 శాతం మేర ఉండొచ్చని తెలిపింది. 600 కంపెనీల (ఫైనాన్షియల్, చమురు..గ్యాస్ సంస్థలను మినహాయించి) పనితీరు అధ్యయనం ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు క్రిసిల్ వివరించింది. ఎన్ఎస్ఈ మార్కెట్ విలువలో ఈ కంపెనీల వాటా దాదాపు 70 శాతం పైగా ఉంటుంది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరిమితమే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో మాత్రం కంపెనీల ఆదాయాలు మెరుగుపడొచ్చని క్రిసిల్ అంచనా వేసింది. వినియోగం.. ప్రభుత్వ వ్యయాలు స్వల్పంగా పెరగడం, లో-బేస్ ఎఫెక్ట్ తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని వివరించింది. అయినప్పటికీ.. పూర్తి ఆర్థిక సంవత్సరానికి మాత్రం వృద్ధి ఒక అంకె స్థాయికే పరిమితం కావొచ్చని పేర్కొంది. ఎగుమతి ఆధారిత సంస్థల ఆదాయాలు మాత్రమే కాస్త మెరుగ్గా ఉండగలవని క్రిసిల్ వివరించింది. -
భారీ లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ!
హైదరాబాద్: ఆసియా మార్కెట్లలో సానుకూలత, విదేశీ నిధుల ప్రవాహం, కార్పోరేట్ ఫలితాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రధాన సూచీలలో సెన్సెక్స్ 231 పాయింట్ల లాభంతో 25946 పాయింట్ల వద్ద, నిఫ్టీ 59 పాయింట్ల వృద్దితో 7743 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో భారతీ ఎయిర్ టెల్ అత్యధికంగా 4.26 శాతం, రియలన్స్ 3.35, హిండాల్కో 2.96, హెచ్ డీఎఫ్ సీ 2.96, ఏషియన్ పెయింట్స్ 1.88 శాతం లాభాల్ని నమోదు చేసుకున్నాయి. పవర్ గ్రిడ్ కార్పోరేషన్, లార్సెన్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, గ్రాసీం కంపెనీలు నష్టాల్లో ట్రేడ్ అవున్నాయి.