
ముంబై: భారత్ కార్పొరేట్ ఆదాయాలు గడచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (2022–23, జనవరి–మార్చి) 10 నుంచి 12 శాతం పడిపోతాయని భావిస్తున్నట్లు క్రిసిల్ మార్కిట్ ఇంటిలిజెన్స్ తాజా నివేదిక పేర్కొంది. 2021–22 ఇదే కాలంలో ఆదాయాల వృద్ధి 22.8 శాతంగా ఉంది. కంపెనీలు నాల్గవ త్రైమాసిక ఫలితాలను వెల్లడిస్తున్న నేపథ్యంలో తాజా నివేదిక వెలువడ్డం గమనార్హం. 47 రంగాలకు చెందిన 300 కంపెనీల గణాంకాల విశ్లేణలనకు అనుగుణంగా తాజా నివేదిక వెలువడింది. హై బేస్ కూడా తాజా అంచనాలు ‘తగ్గించడానికి’ కారణమని క్రిసిల్ వర్గాలు వెల్లడించాయి. నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
► 2021–22లో కంపెనీల ఆదాయాల వృద్ధి 27 శాతం కాగా, 2022–23లో ఇది 19 నుంచి 21 శాతానికి పరిమితం కానుంది.
► నిర్వహణా లాభాలు కేవలం 3 శాతంగా ఉండనుంది.
► కంపెనీల ఆదాయాలపై ఎగుమతుల మందగమన ప్రభావం పడనుంది.
► వస్తువులు, ఎగుమతి ఆధారిత రంగాలైన టెక్స్‌టైల్స్, రత్నాలు–ఆభరణాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ–ఎనేబుల్డ్ సర్వీసుల ఆదాయాలు తగ్గుముఖం పట్టాయి.
► 2022లో మేలో ఎగుమతి సుంకాలు విధించడం వల్ల స్టీల్ ఉత్పత్తి సంస్థల ఆదాయాలు 7 నుంచి 9 శాతం వరకూ పడిపోవచ్చు. అంతర్జాతీయ మందగమన పరిస్థితులూ దీనికి కారణం కావచ్చు.
► మందగమనం వల్ల అల్యూమినియం ఇండస్ట్రీ ఆదాయాలు కూడా 17 నుంచి 19 శాతం వరకూ పడిపోవచ్చు.
► ఎయిర్‌లైన్స్, హోటళ్లు, మీడియా, వినోదం, రిటైల్ వంటి వినియోగదారుల విచక్షణ ఉత్పత్తులు ఆదాయ వృద్ధికి దారితీశాయి. అలాగే ఫార్మాస్యూటికల్స్, ఫాస్ట్ మూవింగ్ కన్సూ్యమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ) వంటి వినియోగదారులకు డిమాండ్ వృద్ధి కొనసాగుతుంది.
► హోటళ్ల పరిశ్రమల 98 శాతం పురోగమించే వీలుంది. ఎయిర్‌లైన్స్ 67 శాతం శాతం పెరిగితే, టెల్కోల ఆదాయాలు 13 శాతం పెరిగవచ్చు.
► ముడి చమురు, నాన్–కోకింగ్ బొగ్గు వంటి కీలకమైన ఎనర్జీ సంబంధ కమోడిటీల ధరలు వాటి గరిష్ఠ స్థాయిల నుండి దిగివస్తున్నట్లు కనిపిస్తోంది. మందగమన ప్రపంచ డిమాండ్ ప్రభావాన్ని ఈ ‘తగ్గిన ధరలు’ పాక్షికంగా భర్తీ చేస్తాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో (2023–24) కమోడిటీ ధరలు తగ్గుముఖం పట్టడం, వాణిజ్య పరిమాణాలు పెరగడం వల్ల కార్పొరేట్ల లాభదాయకత మెరుగుపడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment