భారీగా క్షీణించిన వెండి ధర
భారీగా క్షీణించిన వెండి ధర
Published Tue, Jul 4 2017 4:06 PM | Last Updated on Thu, Jul 11 2019 8:55 PM
న్యూఢిల్లీ: కమొడిటీ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు భారీ పతనమవుతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా పుత్తడి ధరల్లో బలహీన ధోరణి కొనసాగుతుండగా, మరో విలువైన లోహం వెండి ధరలు కూడా మంగళవారం భారీగా పడిపోయాయి. డాలర్ విలువలోపుంజుకున్న బలం, భారీగా తగ్గిన డిమాండ్ కారణంగా కిలో వెండి ధర వెయ్యి రూపాయలకు పైగా నష్టపోయింది.
సిల్వర్ ధర మంగళవారం రూ .39 వేల స్థాయి కిందికి పడిపోయింది. దేశ రాజధానిలో కిలోకు రూ .1,335 నష్టపోయి రూ.38,265గా నమోదైంది. వారాంతపు ఆధారిత డెలివరీ రూ .1,090 తగ్గి రూ .37,265 కు పడిపోయింది. బంగారం ధర 10 గ్రా. రూ.90లు క్షీణించి రూ. 29,310గా నమోదైంది.
అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు పరిశ్రమ దారులనుంచి డిమాండ్ గణనీయంగా క్షీణించిందని ట్రేడర్లు చెప్పారు. దేశీయ మార్కెట్లో నాణెం తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గిందని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా వెండి ధరలు 2.98 శాతం తగ్గి ఔన్స్ధర 16.11 డాలర్లకు చేరుకున్నాయి.. అటు ఔన్స్ బంగారం 1.73 శాతం నష్టపోయి 1,219.70 డాలర్లకు చేరుకుంది. సోమవారం య పుత్తడి ధర 7 వారాల కనిష్టాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇండిపెండెన్స్ డే సందర్భంగా మంగళవారం అమెరికా మార్కెట్లకు సెలవు.
Advertisement
Advertisement