దరాబాద్: ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్(ఎఎస్‌డి, మెదడుకు సంబంధించిన రుగ్మత) ఉన్న వ్యక్తులను ఉద్యోగాల్లోకి తీసుకోవడం ప్రారంభించామని శాప్ ల్యాబ్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఆటిజం ఎట్ వర్క్ విధానంలో భాగంగా 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగుల్లో 1 శాతం మేర ఎఎస్‌డి బాధితులకు ఉద్యోగాలివ్వడం లక్ష్యమని శాప్ ఇండియా హెచ్‌ఆర్ విభాగాధిపతి భువనేశ్వర్ నాయక్ తెలిపారు. ఎఎస్‌డి సమస్య ఉన్నవారికి ఉద్యోగాలివ్వడమే కాకుండా ఉత్తమ విద్యాబోధన, శిక్షణ ఇచ్చే ఉద్దేశం కూడా ఉందని పేర్కొన్నారు.