వారానికి మూడు రోజుల పనిదినాలా?
వారానికి మూడు రోజుల పనిదినాలా?
Published Mon, Aug 4 2014 2:46 PM | Last Updated on Sat, Sep 2 2017 11:19 AM
న్యూఢిల్లీ: వారానికి ఐదు, ఆరు రోజుల పనిదినాలంటే విసిగెత్తిపోయే ఉద్యోగులకు ఊరట కలిగించే వార్తను ప్రపంచ వ్యాపార దిగ్గజాలు అందించారు. ఉద్యోగుల నుంచి మెరుగైన ఫలితాలను ఆశించడానికి వారానికి మూడు పనిదినాలుండాలనే ఓ ప్రతిపాదనను వ్యాపార దిగ్గజాలు కార్లోస్ స్లిమ్, రిచర్డ్ బ్రాన్సన్ లు తీసుకొచ్చారు. రోజుకు 11 గంటలపాటు మూడు రోజుల పనిదినాలను ఉంటే ఎలా అనే తాజా ప్రతిపాదన భారతీయ పరిస్థితులకు సరితూగవని హెచ్ఆర్ నిపుణులు పెదవి విరిచారు.
భారతీయ పరిశ్రమలకు, ఉద్యోగాలు ఈ తాజా ప్రతిపాదన అనుకూలంగా ఉండదని పలు కంపెనీలు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. కస్టమర్ సర్వీస్, రిటైల్, ఎంటర్ టైన్ మెంట్, హెల్త్ కేర్ రంగాల్లో మూడు పనిదినాల్లంటే కుదరదు అని ఎస్ఏపీ లాబ్స్ ఇండియా హెచ్ఆర్ టి.శివరాం తెలిపారు. గంటల ప్రతిపాదికన పనిచేసే ఉద్యోగులకు తాజా ప్రతిపాదన ప్రతికూలంగా మారుతుందని శివరాం అన్నారు.
Advertisement