వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు సర్ రిచర్డ్ బ్రాన్సన్ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయారు. తాను దివాళా తీసినట్లు.. ప్రస్తుత ఆర్ధిక సమస్యల నుంచి బయటపడేందుకు నిధులు కావాలని కోరుతూ యునైటెడ్ స్టేట్స్ దివాలా (bankruptcy court) కోర్టును ఆశ్రయించారు.
ఈ ఏడాది జనవరిలో రిచర్డ్ బ్రాన్సన్‌కు చెందిన శాటిలైట్ లాంచ్ సంస్థ ‘వర్జిన్ ఆర్బిట్’ యూకే కేంద్రంగా ఆర్బిట్ (కక్ష్య)లోకి శాటిలైట్లను పంపేందుకు మాడిఫైడ్ 747 జెట్‌ను ఉపయోగించింది. బాహుబలి జెట్‌లో ‘స్టార్ట్ అప్ మీ’ పేరుతో లూనార్ వన్స్ అనే రాకెట్‌ను యూకేలోని కార్న్‌వాల్ ఎయిర్‌పోర్ట్ న్యూక్వే విమానాశ్రయం నుంచి ప్రయోగించారు. అతిపెద్ద పొడవైన సముద్ర ఆకాశ మార్గం నుంచి జెట్ లూనార్ వన్స్ రాకెట్‌ను విడుదల చేయగా.. అది కక్ష్యలోకి వెళితే ప్రయోగం విజయవంతం అవుతుంది.
అలా లూనార్ వన్స్ ప్రయోగం ప్రారంభమైంది. కొద్ది సేపటికి లూనార్ వన్స్ రాకెట్ విజయవంతంగా కక్ష్యకు చేరుకుందంటూ వర్జిన్ ఆర్బిట్ ట్వీట్ చేసింది. అయితే అనూహ్యంగా అరగంట తర్వాత ప్రయోగం విఫలమైంది. ప్రయోగం రెండో దశలో ఉండగా రాకెట్ ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో తొమ్మిది ఉపగ్రహాలు కక్ష్యను చేరుకోలేవని కంపెనీ ప్రకటించింది. 747 జెట్, దాని సిబ్బంది సురక్షితంగా తిరిగి వచ్చి నైరుతి ఇంగ్లాండ్‌లోని స్పేస్‌పోర్ట్ కార్న్‌వాల్‌లో దిగారు.
ఈ ప్రయోగం విఫలం కావడంతో రిచర్డ్ బ్రాన్సన్ ఆస్తులు మంచులా కరిగిపోయాయి. గత వారం దాదాపు 85 శాతం మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత ఆస్తులను విక్రయించాలని కోరుతున్నట్లు యుఎస్ దివాలా కోర్టులో కంపెనీ చేసిన దాఖలలో పేర్కొన్నట్లు రాయిటర్స్ నివేదించింది. వర్జిన్ ఆర్బిట్ సీఈఓ డాన్ హార్ట్ మాట్లాడుతూ ఆస్తుల విక్రయాన్ని ఖరారు చేయడమే ఉత్తమమైన మార్గమని అన్నారు.
ప్రయోగం విఫలం కావడంతో తర్వాత నిధులను పొందడంలో కంపెనీ విఫలమైంది. వర్జిన్ ఆర్బిట్ మార్చి 15న తన కార్యకలాపాలను నిలిపి వేయాల్సి వచ్చింది. నగదును ఆదా చేసేందుకు ఉద్యోగులందరినీ తొలగించింది. రాకెట్ డిజైన్ మెరుగుదలపై దృష్టి సారించడానికి నిధుల కోసం ప్రయత్నించి విఫలమైంది.
చదవండి👉 షాకింగ్ ఘటన: అందరూ చూస్తుండగానే అగ్నికి ఆహుతైన కారు!
Comments
Please login to add a commentAdd a comment