SAP Labs India
-
గుడ్ న్యూస్: 15,000 ఉద్యోగాలు.. ప్రారంభమైన సాఫ్ట్వేర్ కంపెనీ క్యాంపస్ నిర్మాణం
జర్మనీకి చెందిన మల్టీనేషన్ సాఫ్ట్వేర్ కంపెనీ శాప్ (SAP) ల్యాబ్స్ బెంగళూరులో రెండో క్యాంపస్ నిర్మాణాన్ని తాజాగా ప్రారంభించింది. 15,000 మంది ఉద్యోగులు పని చేసేందుకు సరిపోయేలా ఈ క్యాంపస్‌ను నిర్మిస్తున్నారు. శాప్ ల్యాబ్స్ ఇండియా ఎండీ, సీనియర్ వైస్ ప్రెసిడింట్ సింధు గంగాధరన్ కొత్త క్యాంపస్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో 41.07 ఎకరాల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్‌ను నిర్మిస్తున్నారు. ఇది 2025 నాటికి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ‘శాప్ ల్యాబ్స్ ఇండియా 25వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం బెంగళూరులో 15,000 ఉద్యోగాలను సృష్టించే కొత్త 41 ఎకరాల క్యాంపస్‌తో భారతదేశంలో మా పెట్టుబడులను మరింతగా పెంచుతున్నాం’ అని శాప్ ల్యాబ్స్ ఇండియా ఎండీ, సీనియర్ వైస్ ప్రెసిడింట్ సింధు గంగాధరన్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత్‌లో ప్రస్తుతం శాప్ ల్యాబ్స్‌కు అతిపెద్ద ఆర్అండ్డీ హబ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీ మొత్తం ఆర్అండ్డీ విభాగంలో 40 శాతం వాటా దీని నుంచి ఉంది. కొత్త క్యాంపస్ నిర్మాణం భారతదేశం పట్ల తమ నిబద్ధతను మరింత బలపరుస్తుందని శాప్ కంపెనీ తెలిపింది. ఇదీ చదవండి: ట్విటర్ క్రాష్: ఇష్టమొచ్చినట్లు ఉద్యోగులను పీకేస్తే ఇలాగే ఉంటుంది! -
ఎఎస్‌డి బాధితులకు శాప్ ఉద్యోగాలు
దరాబాద్: ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్(ఎఎస్‌డి, మెదడుకు సంబంధించిన రుగ్మత) ఉన్న వ్యక్తులను ఉద్యోగాల్లోకి తీసుకోవడం ప్రారంభించామని శాప్ ల్యాబ్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఆటిజం ఎట్ వర్క్ విధానంలో భాగంగా 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగుల్లో 1 శాతం మేర ఎఎస్‌డి బాధితులకు ఉద్యోగాలివ్వడం లక్ష్యమని శాప్ ఇండియా హెచ్ఆర్ విభాగాధిపతి భువనేశ్వర్ నాయక్ తెలిపారు. ఎఎస్‌డి సమస్య ఉన్నవారికి ఉద్యోగాలివ్వడమే కాకుండా ఉత్తమ విద్యాబోధన, శిక్షణ ఇచ్చే ఉద్దేశం కూడా ఉందని పేర్కొన్నారు. -
వారానికి మూడు రోజుల పనిదినాలా?
న్యూఢిల్లీ: వారానికి ఐదు, ఆరు రోజుల పనిదినాలంటే విసిగెత్తిపోయే ఉద్యోగులకు ఊరట కలిగించే వార్తను ప్రపంచ వ్యాపార దిగ్గజాలు అందించారు. ఉద్యోగుల నుంచి మెరుగైన ఫలితాలను ఆశించడానికి వారానికి మూడు పనిదినాలుండాలనే ఓ ప్రతిపాదనను వ్యాపార దిగ్గజాలు కార్లోస్ స్లిమ్, రిచర్డ్ బ్రాన్సన్ లు తీసుకొచ్చారు. రోజుకు 11 గంటలపాటు మూడు రోజుల పనిదినాలను ఉంటే ఎలా అనే తాజా ప్రతిపాదన భారతీయ పరిస్థితులకు సరితూగవని హెచ్ఆర్ నిపుణులు పెదవి విరిచారు. భారతీయ పరిశ్రమలకు, ఉద్యోగాలు ఈ తాజా ప్రతిపాదన అనుకూలంగా ఉండదని పలు కంపెనీలు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. కస్టమర్ సర్వీస్, రిటైల్, ఎంటర్ టైన్ మెంట్, హెల్త్ కేర్ రంగాల్లో మూడు పనిదినాల్లంటే కుదరదు అని ఎస్ఏపీ లాబ్స్ ఇండియా హెచ్ఆర్ టి.శివరాం తెలిపారు. గంటల ప్రతిపాదికన పనిచేసే ఉద్యోగులకు తాజా ప్రతిపాదన ప్రతికూలంగా మారుతుందని శివరాం అన్నారు. -
3 రోజుల ఆఫీసు మనకు తగదు..
న్యూఢిల్లీ: వారానికి మూడు రోజులే ఆఫీసు... రోజుకు 11 గంటల పని... ఈ పద్ధతి పాటిస్తే ఉద్యోగుల ఉత్పాదకత పెరుగుతుందంటున్నారు అంతర్జాతీయ ప్రముఖులు. ప్రపంచంలో రెండో అత్యధిక ధనవంతుడు, మెక్సికోకు చెందిన స్లిమ్ కార్లోస్, సుప్రసిద్ధ బ్రిటిష్ వాణిజ్యవేత్త రిచర్డ్ బ్రాన్సన్ తదితరులు ఈ కొత్త పద్ధతిపై అమితాసక్తి చూపుతున్నారు. ‘వారానికి మూడు రోజుల పని, నాలుగు రోజులు సెలవులుండడమే మంచిది. వారానికి ఐదారు రోజులకు బదులు రోజుకు 11 గంటల చొప్పున మూడు రోజులు పనిచేస్తే ఉత్పాదకత పెరుగుతుంది..’ అని వారు చెబుతున్నారు. భారతీయ విశ్లేషకులు మాత్రం ఈ అభిప్రాయంతో విభేదిస్తున్నారు. అనేక రకాల పరిశ్రమలు, ఉద్యోగాల్లో ఈ మోడల్ ఆచరణ సాధ్యం కాదని అంటున్నారు. ‘రోజుకు 11 గంటల పని అంటే రన్నింగ్ రేసు వంటిదే. కస్టమర్ సర్వీసు, రిటైల్, ఎంటర్టైన్మెంట్, హెల్త్‌కేర్ వంటి రంగాలకు కొత్త పద్ధతి అనువుగా లేదు. ఉత్పాదకత కీలకమైన వర్ధమాన దేశాల్లో మరిన్ని ఉద్యోగాలు కల్పించాల్సిఉంది. అందుకే, ఈ పద్ధతి భారత్‌కు తగినట్లుగా లేదు’ అని శాప్ ల్యాబ్స్ ఇండియా హెచ్ఆర్ హెడ్ టి.శివరామ్ చెప్పారు. ‘కొత్త మోడల్లో ఉద్యోగులు వారానికి 33 గంటలే పనిచేస్తారు. గంటల లెక్కన జీతం చెల్లిస్తారు. వారానికి 40 గంటల పనితో పోలిస్తే ఉద్యోగులకు వేతనాలు తగ్గుతాయి. ఆ లోటు పూడ్చుకోవడానికి మరో ఉద్యోగం వెతుక్కోవాలి’ అని అంటాల్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ మేనేజింగ్ పార్ట్నర్ జోసెఫ్ దేవాసియా పేర్కొన్నారు.