వరల్డ్‌ ఆటిజమ్‌ డే.. తెలుసుకోవాల్సిన విషయాలు!‌ | Special Story On World Autism Awareness Day | Sakshi
Sakshi News home page

వరల్డ్‌ ఆటిజమ్‌ డే.. తెలుసుకోవాల్సిన విషయాలు!‌

Published Fri, Apr 2 2021 1:13 PM | Last Updated on Fri, Apr 2 2021 3:22 PM

Special Story On World Autism Awareness Day - Sakshi

ఎన్నిసార్లు పేరు పెట్టి పిలుస్తున్నా సరే మీ బాబు అస్సలు పలకడం లేదా? మాటిమాటికీ పలకరిస్తున్నా అతడు జవాబివ్వడం లేదా? ఎప్పుడూ తనదైన ఏదో లోకంలో ఉండిపోతున్నాడా? ఇతరులతో మాట్లాడటం, సంభాషించడం, కమ్యూనికేషన్‌ నెలకొల్పడంలో ఇబ్బంది పడుతున్నాడా?... ఇవి అతడు ‘ఆటిజమ్‌’ అనే రుగ్మతతో బాధపడుతున్నాడని చెప్పేందుకు కొన్ని ప్రధాన లక్షణాలు. ఈ రోజుల్లో ఈ రుగ్మత ప్రపంచవ్యాప్తంగా చాలా విస్తృతంగా ఉంది. కొన్ని అంచనాల ప్రకారం దేశంలో దాదాపు 20 లక్షల మందికి పైగా ఆటిజమ్‌తో బాధపడుతున్నారు. రేపు వరల్డ్‌ ఆటిజమ్‌ డే సందర్భంగా... చిన్నారుల్లో కనిపించే ఈ వ్యాధిపై అవగాహన కోసం ఈ కథనం. 

ఆటిజమ్‌ అంటే..? 
‘ఆటిజమ్‌’ అనే మాటను మొదటిసారిగా యూజెన్‌ బ్లూలర్‌ అనే సైకియాట్రిస్ట్‌ ఉపయోగించారు. పిల్లలు తమదైన ఏదో లోకంలో ఉన్నట్లుగా ఉండే రుగ్మతను తొలుత స్కీజోఫ్రీనియాలోని ఒక రకంగా భావించేవారు. అయితే హాన్స్‌ యాస్పర్జెర్, లియో కన్నెర్‌ అనే ఇద్దరు పరిశోధకులు ఈ వ్యాధిపై విస్తృతంగా పరిశోధించి, దీని లక్షణాలనూ, పిల్లల్లో అది వ్యక్తమయ్యే తీరును అధ్యయనం చేశారు. ‘ఆటిజమ్‌’ ఒక జబ్బు కాదు. ఒక న్యూరలాజికల్‌ డిజార్డర్‌. ఇమ్యూనిటీలో తేడా వల్ల ఇది వస్తుంది.

ఇందులో పిల్లల వికాసం అంతగా కనిపించదు. పిల్లల్లో ఆ వయసుకు ఉండాల్సిన వికాసం లేకపోగా వారు సామాజికంగా నలుగురితో కలిసి ఉండలేక, మామూలుగా చుట్టుపక్కల ఉన్నవారితో నెరపాల్సిన సామాజిక బంధాలను నెరపలేని స్థితిలో ఉంటారు. దీని లక్షణాల విస్తృతి చాలా ఎక్కువగా ఉండటం తో కేవలం ‘ఆటిజమ్‌’ అనే మాటతో సరిపుచ్చలేక. పరిశోధకులు, అధ్యయనవేత్తలు, డాక్టర్లు దీన్ని ఇటీవల ‘ఆటిజమ్‌ స్పెక్ట్రమ్‌’ అంటూ వ్యవహరిస్తున్నారు. 

కారణాలు
ఆటిజమ్‌కు కారణాలు అన్వేషించడానికి విస్తృతమైన అధ్యయనాలే జరిగాయి, జరుగుతున్నాయి. అయినప్పటికీ నిర్దిష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే పిల్లల్లో ఆటిజమ్‌ వచ్చేందుకు/ ఆటిజమ్‌కు దోహదపడే అనేక అంశాలు తెలియవచ్చాయి. గత రెండు దశాబ్దాలుగా నిర్వహించిన అధ్యయనాల్లో తెలియవచ్చిన అంశాల్లో కొన్ని

ఆటఆటిజమ్‌కు ప్రధాన కారణం జన్యుపరమైనది. 
గర్భవతిగా ఉన్నప్పుడు తల్లి ఆరోగ్య పరిస్థితి: గర్భం దాల్చకముందు థైరాయిడ్‌/ గర్భధారణ సమయంలోనే కనిపించే జెస్టేషనల్‌ డయాబెటిస్‌ వంటి అంశాల కారణంగా కనిపించే హార్మోన్‌ అసమతౌల్యతలతోనూ, అలాగే గర్భధారణకు ముందు వారిలో వచ్చే కొన్ని వైరల్‌ ఇన్ఫెక్షన్ల కారణంగానూ, అలాగే ఆ కాబోయే తల్లులు తీవ్రమైన మానసిక వ్యధకూ, మానసిక ఒత్తిడికీ గురైనప్పుడు ఆ పిల్లల్లో ‘ఆటిజమ్‌’ కనిపించే అవకాశాలుంటాయి. అలాగే గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి తీవ్రమైన ఉద్వేగాలకు లోనుకావడం, పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపలేకపోవడం వల్ల కూడా  రావచ్చు.

గర్భవతిగా ఉన్నప్పుడు వాడే మందులు: గర్భధారణ ఆశించి అండం విడదలయ్యేందుకు, దాంతోపాటు ఐయూఐ/ ఐవీఎఫ్‌ ప్రక్రియల కోసం కొందరు మహిళలూ, అలాగే సంతాన సాఫల్యం కోసం కొందరు దంపతులు, వీళ్లలో వీర్యకణాల సంఖ్య పెరగడం కోసం కొందరు పురుషులు మందులు వాడటం మామూలే. ఇలా గర్భధారణ కోసం హార్మోన్లను ప్రభావితం చేసే మందులు వాడిన వారి పిల్లల్లో ‘ఆటిజమ్‌’ వచ్చే అవకాశాలు ఎక్కువే.

అండం విడుదల సక్రమంగా లేనివారిలో: కొందరు మహిళల్లో అందునా ప్రధానంగా పీసీఓడీ వంటి నీటితిత్తులున్న ఆరోగ్య చరిత్ర (మెడికల్‌ హిస్టరీ)గల మహిళల్లో అండం విడుదల (ఒవ్యూలేషన్‌) ఒక క్రమపద్ధతిలో కాకుండా ఒక్కోసారి త్వరత్వరగానూ, ఇంకొందరిలో ఇంకొన్నిసార్లు చాలా ఆలస్యంగానూ... ఇలా ఒక క్రమపద్ధతిలో కాకుండా జరుగుతుంటుంది. అలాగే ఒక్కోసారి త్వరత్వరగా గర్భధారణ జరుగుతుండటం లేదా మరీ ఆలస్యంగా గర్భధారణ అవుతుండటం చూడవచ్చు. ఇలా ఒవ్యూలేషన్‌ ప్రక్రియ సక్రమంగా లేనివారికి కలిగే పిల్లల్లోనూ ‘ఆటిజమ్‌’ ఎక్కువగా కనిపించింది. 

బర్త్‌ హిస్టరీ: మహిళల్లో వారి ప్రసవ చరితను గమనించినప్పడు మెడచుట్టూ పేగు చుట్టుకుపోయి పుట్టిన పిల్లల్లోనూ, ప్రసవం కష్టమై వాక్యూమ్‌ లేదా ఫోర్సెప్‌ డెలివరీ చేయాల్సి వచ్చిన సందర్భాల్లో పుట్టిన పిల్లల్లోనూ, ప్రసవవేదన సుదీర్ఘకాలం పాటు కొనసాగాక పుట్టిన పిల్లల్లోనూ, పిండదశలో కొన్ని సమస్య లు ఉన్న పిల్లల్లోనూ (అంటే పిండదశ లో గుండె స్పందనలు సక్రమంగా లేకపోవడం అలాగే పిండదశలో ఉన్న చిన్నారి పూర్తిగా ఎదిగాక బయటివచ్చి చేసే మొదటి మల విసర్జనను ‘మెకోనియమ్‌ స్టెయిన్‌’ అంటారు. ఇది ఒక్కోసారి పుట్టకముందే జరిగిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొనప్పుడు), చిన్నారిని నలువైపులనుంచి ఆవరించుకుని ఉండే ఆమ్నియాటిక్‌ ఫ్లుయిడ్‌ అనే ఉమ్మనీరు లీక్‌ అయిన సందర్భాల్లోనూ... ఇలాంటి ప్రవస చరిత ఉన్న పిల్లల్లో ఆటిజమ్‌ ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. భారలోహాలకు ఎక్స్‌పోజ్‌ కావడం, యాంటీడిప్రెసెంట్‌ తీసుకోవడం లేదా ఆమెకు పొగతాగే / మద్యం తీసుకునే అలవాటు ఉండటం, చాలా ఆలస్యంగా గర్భందాల్చడం, జీవక్రియల్లో అసమతౌల్యత, ప్రసవం సమయంలో బిడ్డకుతగినంత ఆక్సిజన్‌ అందకపోవడం వంటివి కారణం.

టీకాల తర్వాత వికాసంలో లోపం:  కొందరిలో 15 – 18 నెలల సమయంలో టీకా వేయించాక... ఎందుకో సాధారణ వికాసం/ ఎదుగుదల మందగిస్తాయి. ఇలాంటి పిల్లల్లోనూ ఆటిజమ్‌ కనిపిస్తుంది. 
సప్రెస్‌డ్‌ స్కిన్‌ : కొందరు తమ చర్మసౌందర్యం కోసం ఎన్నోరకాల క్రీములు వాడుతుంటారు. ఉదాహరణకు పొడి చర్మం వారు తేమను పెంచడానికి, దురదలు వస్తున్నవారూ, చర్మం పగుళ్లు బారుతున్నవారు అవి తగ్గడానికి... ఇలా రకరకాల క్రీములు వాడుతుండేవారిలో... ఆ క్రీముల్లోని రసాయనాల కారణంగా వ్యాధినిరోధక వ్యవస్థపై తీవ్రప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. ఇలా ‘వ్యాధినిరోధకత’పై ప్రతికూల ప్రభావాలు పడ్డవారి పిల్లల్లోనూ ఆటిజమ్‌ ఎక్కువగా కనిపిస్తుంటుంది. రకాలు ఆటిజమ్‌లో 1 తేలికపాటి (మైల్డ్‌) ఆటిజమ్‌. ఇది 30% వరకు ఉంటుంది. 2 ఓ మోస్తరు (మాడరేట్‌) ఆటిజమ్‌... ఇది 30% నుంచి 60% వరకు ఉంటుంది. 3 తీవ్రమైన (సివియర్‌) ఆటిజమ్‌. ఇది 60 శాతం పైగా (60% + ) ఉంటుంది. 

గుర్తించడానికి తోడ్పడే అంశాలివి... 
ఆటిజమ్‌ సాధారణంగా మగపిల్లల్లో ఎక్కువ. రెట్స్‌ డిజార్డర్‌ అనే అరుదైన రకం ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చైల్డ్‌హుడ్‌ డిసింటిగ్రేటెడ్‌ డిజార్డర్‌ అనేది ఆటజమ్‌లో ఒక తీవ్రమైన సమస్య. యాస్పర్జస్‌ డిజార్డర్‌లో పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉండి, వారు తదేకంగా చేసే పనులలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఇలా దీనిలో చాలా రకాలు ఉంటాయి. ఇది మెదడు సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల వస్తుంది. మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, అందులో స్రవించే సెరటోనిన్, డోపమిన్‌ వంటి రసాయనాలు ఇలా ఎన్నో అంశాలు కారణం కావచ్చు. అకారణంగా ఏడవటం. నలుగురిలో కలవలేకపోవడం, ఆటవస్తువుల్లో ఏదో ఒక భాగంపైనే దృష్టి కేంద్రీకరించడం వంటి అంశాలు ఆటిజమ్‌ ను గుర్తించేందుకు దోహదపడతాయి. 

చికిత్స: ఆటిజమ్‌ అనేది ఇమ్యూనిటీ లోపం వల్ల వస్తుంది కనుక ఇమ్యునో థెరపీ ద్వారా దీన్ని నయం చేయవచ్చు. ఇందులో ఔషధాలు కేవలం వ్యాధిని అణచివేయడం కాకుండా... వ్యాధి మూలాంకురంలోకి వెళ్లి.. అక్కడి నుంచి దాన్ని పెకిలించి వేస్తాయి. ఆటిజమ్‌ ఉన్న పిల్లల్లో వారి వ్యక్తిగత లక్షణాలు, కుటుంబ, సామాజిక, మానసిక భావోద్వేగాల ఆధారంగా మూలకారణాలను అన్వేషిస్తారు. వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స వ్యవధి ఉంటుంది. సరైన మందులను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే పిల్లలు మామూలుగా అయ్యేందుకు లేదా బాగా మెరుగుపడేందుకు అవకాశం ఉంటుంది.  ఆటిజమ్‌ ఉన్న పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం, తరచూ జలుబు, దగ్గు,  జ్వరం వంటి వాటికి లోనుకావడం జరుగుతుందని తేలింది. ప్రధాన వ్యాధితో పాటు ఇలాంటి రుగ్మతలన్నింటికీ ఎలాంటి దుష్ప్రభావాలూ (సైడ్‌ ఎఫెక్ట్స్‌) లేకుండా చికిత్స చేయడం హోమియో ప్రక్రియలో సాధ్యమవుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement