హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మినిప్లెక్స్‌ల నిర్మాణంలో ఉన్న విజయవాడకు చెందిన వై స్క్రీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో న్యూఢిల్లీకి చెందిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థ స్పార్‌క్లింగ్ (ఇండియా) ఫిన్‌షేర్స్ బిజినెస్ డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ కుదర్చుకుంది. ఇందులో భాగంగా వై స్క్రీన్ ట్రేడ్ డెవలప్‌మెంట్ సెంటర్స్ ఏర్పాటులో ఫ్రాంచైజీలకు స్పార్‌క్లింగ్ రుణ సదుపాయం కల్పిస్తుంది. ఈ సెంటర్స్‌లో నెలకొల్పే మిని సినిమా కేంద్రాలు, ఫుడ్ కోర్టులు, సైబర్ కేఫ్స్, గేమింగ్ జోన్స్, హెల్త్ కేర్ సెంటర్స్, కమర్షియల్ షాపింగ్, కో వర్కింగ్ స్పేస్, రెస్టారెంట్ల స్థాపనకు సైతం ఫైనాన్స్ లభిస్తుంది. కంపెనీ సొంతంగా నిర్మిస్తున్న ట్రేడ్ డెవలప్‌మెంట్ సెంటర్స్ కోసం ఇరు సంస్థలు పెట్టుబడి పెడతాయని వై స్క్రీన్స్ సీఎండీ వై.వి.రత్న కుమార్ సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. పెట్టుబడి పరిమితి లేదని, ప్రాజెక్టునుబట్టి ఇది మారుతుందని చెప్పారు. ఎన్నారైలు తమ స్టార్టప్స్‌ను ఏర్పాటు చేసేందుకు వై స్క్రీన్స్ కో–వర్కింగ్ స్పేస్‌ను వినియోగించుకోవచ్చన్నారు. మూడేళ్లపాటు ఈ ఒప్పందం అమలులో ఉంటుందని స్పార్‌క్లింగ్ డైరెక్టర్ చెరుకు సాగరిక పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, కొవ్వూరులో రెండు ప్రాజెక్టులను వై స్క్రీన్స్ పూర్తి చేసింది. ఏపీలో 12 కేంద్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిలో 2 సొంతంగా, 6 కేంద్రాలు జాయింట్ వెంచర్ మోడల్‌లో, నాలుగు ఫ్రాంచైజీ విధానంలో సిద్ధమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment