Y Screens Miniplex
-
వై స్క్రీన్స్‌తో స్పార్క్లింగ్ ఫిన్షేర్స్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మినిప్లెక్స్ల నిర్మాణంలో ఉన్న విజయవాడకు చెందిన వై స్క్రీన్స్ ఎంటర్టైన్మెంట్తో న్యూఢిల్లీకి చెందిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థ స్పార్క్లింగ్ (ఇండియా) ఫిన్షేర్స్ బిజినెస్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ కుదర్చుకుంది. ఇందులో భాగంగా వై స్క్రీన్ ట్రేడ్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటులో ఫ్రాంచైజీలకు స్పార్క్లింగ్ రుణ సదుపాయం కల్పిస్తుంది. ఈ సెంటర్స్‌లో నెలకొల్పే మిని సినిమా కేంద్రాలు, ఫుడ్ కోర్టులు, సైబర్ కేఫ్స్, గేమింగ్ జోన్స్, హెల్త్ కేర్ సెంటర్స్, కమర్షియల్ షాపింగ్, కో వర్కింగ్ స్పేస్, రెస్టారెంట్ల స్థాపనకు సైతం ఫైనాన్స్ లభిస్తుంది. కంపెనీ సొంతంగా నిర్మిస్తున్న ట్రేడ్ డెవలప్మెంట్ సెంటర్స్ కోసం ఇరు సంస్థలు పెట్టుబడి పెడతాయని వై స్క్రీన్స్ సీఎండీ వై.వి.రత్న కుమార్ సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. పెట్టుబడి పరిమితి లేదని, ప్రాజెక్టునుబట్టి ఇది మారుతుందని చెప్పారు. ఎన్నారైలు తమ స్టార్టప్స్‌ను ఏర్పాటు చేసేందుకు వై స్క్రీన్స్ కో–వర్కింగ్ స్పేస్‌ను వినియోగించుకోవచ్చన్నారు. మూడేళ్లపాటు ఈ ఒప్పందం అమలులో ఉంటుందని స్పార్క్లింగ్ డైరెక్టర్ చెరుకు సాగరిక పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, కొవ్వూరులో రెండు ప్రాజెక్టులను వై స్క్రీన్స్ పూర్తి చేసింది. ఏపీలో 12 కేంద్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిలో 2 సొంతంగా, 6 కేంద్రాలు జాయింట్ వెంచర్ మోడల్లో, నాలుగు ఫ్రాంచైజీ విధానంలో సిద్ధమవుతున్నాయి. -
పశ్చిమ గోదావరి జిల్లాలో వై స్ర్కీన్ మాల్ ఫ్రారంభం
-
కొవ్వూరులో 7న ‘వై స్క్రీన్స్ మాల్’ ప్రారంభం
సాక్షి, అమరావతి : మిని డిజిటల్ థియేటర్ కాన్సెప్ట్‌తో బాగా ప్రాచుర్యం పొందిన వై స్క్రీన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ కొవ్వూరులో వై స్క్రీన్స్ మాల్‌ను ప్రారంభించనుంది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వురులోని మెయిన్ బైపాస్ రోడ్డులో మంగళవారం(మే 7వ తేదీ) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభం కానుంది. వై స్క్రీన్స్ ట్రేడ్ డెవలప్మెంట్ సెంటర్(వైఎస్టీడీ సెంటర్) పేరిట ఏర్పాటు చేయనున్న ఈ మాల్‌లలో మిని డిజిటల్ థియేటర్, ప్రభుత్వ సేవలు అందించే మీసేవ, బ్యాంక్ ఏటీఎమ్‌లు, గేమింగ్ జోన్, కాఫీ షాప్స్, బ్రాండెడ్ వస్తువుల విక్రయశాలలు, కార్పొరేట్ ఆఫీస్ కార్యాలయాలు ఉండనున్నాయి. వై స్క్రీన్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్, ఎండీ వైవీ రత్నకుమార్ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లలో ఏర్పాటు చేసిన థియేటర్లు ప్రజల ఆధారాభిమానాలు పొందటంతోపాటు ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. -
టిక్కెట్ కొని శ్రీమంతుడు చూసిన చంద్రబాబు
విజయవాడ : ఆంధ్రప్రదేవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సినిమా చూశారు. నిజమే.. కొద్దిసేపు థియేటర్లో కూర్చుని శ్రీమంతుడు సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు. ఇందుకోసం ఆయన రూ.1,200 పెట్టి టికెట్ కూడా కొన్నారు. దేశంలోనే మొదటిసారిగా విజయవాడ పండిట్ నెహ్రూ ఆర్టీసీ బస్టాండ్‌లో నిర్మించిన వైస్క్రీన్ థియేటర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ప్రారంభించారు. రూ.1,200తో టికెట్ కొన్న ఆయన థియేటర్లో కూర్చుని సేదతీరారు. పలువురు ఆర్టీసీ సిబ్బందితో కలిసి సినిమా చూశారు. అనంతరం ఫుడ్‌కోర్టు ప్రారంభించారు. వైస్క్రీన్ యజమాని వైవీ రత్నం థియేటర్ విశేషాలను ఆయనకు వివరించారు. త్వరలో రాష్ట్రంలోని ప్రతి మండలంలో వైఎస్టీడీ (వైస్క్రీన్ ట్రేడ్ డెవలప్మెంట్) సెంటర్లు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అందులో మిని థియేటర్‌తో పాటు పుడ్‌కోర్టు, మీసేవా, ఏటీఎం, సైబర్ కేఫ్, రిటైల్ మార్కెట్, అన్ని రకాల సమాచారం కోసం ఫ్రంట్ ఆఫీస్ ఏర్పాటుచేసి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి సాంకేతిక పరిజ్ఞానం అందించిన సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజి డీన్ డాక్టర్ బి.పాండురంగారావును సీఎం సన్మానించారు. అలాగే గుడివాడ డిపో ఆర్టీసీ కానిస్టేబుల్ కె.శ్రీనివాసరావు ఇటీవల మృతిచెందడంతో ఆయన భార్య నాగపుష్పవతికి రూ.10లక్షల బీమా చెక్కును అందించారు.