ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఆఫర్ | SpiceJet announces 25% discount on family travel | Sakshi
Sakshi News home page

ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఆఫర్

Published Sat, May 10 2014 1:32 AM | Last Updated on Tue, Oct 2 2018 7:37 PM

ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఆఫర్ - Sakshi

ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఆఫర్

 స్పైస్‌జెట్ విమాన టికెట్లపై 25% వరకూ డిస్కౌంట్

 న్యూఢిల్లీ: స్పైస్‌జెట్ కంపెనీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ  ఆఫర్ కింద దేశీయ రూట్లలో ప్రయాణించే నలుగురు లేదా అంతకు మించిన(నాలుగు నుంచి తొమ్మిది మంది) ప్రయాణికులకు విమాన టికెట్లలో 25 శాతం వరకూ డిస్కౌంట్‌నిస్తోంది. ఈ డిస్కౌంట్ బేస్‌ఫేర్‌కు వర్తిస్తుందని పేర్కొంది. అయితే ఈ ఆఫర్ కింద ఒక్కో విమానంలో పరిమితమైన సంఖ్యలోనే సీట్లు అందుబాటులో ఉంటాయని వివరించింది. ఈ ఆఫర్‌కు మంచి స్పందన లభించగలదని స్పైస్‌జెట్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కానేశ్వరన్ అవిలి ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితం  చౌక ధరలకే విమానయానాన్నందించే సంస్థ ఇండిగో ఈ తరహా ఆఫర్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement