దేశమంతా స్పైస్‌జెట్ మాన్‌సూన్ ఆఫర్ | SpiceJet extends Rs 1,999 monsoon offer pan-India | Sakshi
Sakshi News home page

దేశమంతా స్పైస్‌జెట్ మాన్‌సూన్ ఆఫర్

Published Wed, Jun 18 2014 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 AM

దేశమంతా స్పైస్‌జెట్ మాన్‌సూన్ ఆఫర్

దేశమంతా స్పైస్‌జెట్ మాన్‌సూన్ ఆఫర్

  •  రూ.1,999కే విమానయానం
  • మరో రెండు రోజులే బుకింగ్స్
  • జూలై 19-సెప్టెంబర్ 30 ప్రయాణాలకు వర్తింపు
  • ముంబై: చౌకధరల విమానయాన సంస్థ, స్పైస్‌జెట్ తన మాన్‌సూన్ ఆఫర్‌ను దేశవ్యాప్తంగా విస్తరించింది. రూ.1,999(అన్ని పన్నులు కలుపుకొని) ధరకే విమానయానాన్ని దేశంలోని అన్ని నగరాలకు అందిస్తామని స్పైస్‌జెట్ మంగళవారం వెల్లడించింది. ఈ ఆఫర్ ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నైలతో పాటు తాము విమాన సర్వీసులు నడిపే అన్ని నగరాలకు వర్తిస్తుందని పేర్కొంది. ఈ ఆఫర్‌కు బుకింగ్స్ మంగళవారం నుంచే ప్రారంభమయ్యాయని, గురువారంతో (జూన్ 17 నుంచి 19 వరకూ) ముగుస్తాయని వివరించింది. వచ్చే నెల 19 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకూ ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది.
     
     గతవారంలోనే స్పైస్‌జెట్ కంపెనీ ఈ ఆఫర్‌ను ప్రకటించింది. ఎనిమిది దక్షిణాది నగరాలు-హైదరాబాద్, విశాఖపట్టణం, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, కోచి, కోజికోడ్, మైసూర్‌ల నుంచి విమానయానానికి ఈ ఆఫర్‌ను ఇచ్చింది. మరో చౌకధరల విమానయాన సంస్థ, ఇటీవలే సర్వీసులు ప్రారంభించిన ఎయిర్ ఏషియా ఇండియా కోచి నుంచి విమాన టికెట్లను రూ.500కే (అన్ని పన్నులు కలుపుకొని) ఆఫర్ చేస్తామని ప్రకటించింది. ఈ ప్రకటన వచ్చిన నేపథ్యంలో తన మాన్‌సూన్ ఆఫర్‌ను (రూ.1,999కే విమానయానం) దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నామని స్పైస్‌జెట్ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement