స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్..మల్టీ కరెన్సీ ఫారెక్స్ కార్డు
స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఇటీవల మల్టీ కరెన్సీ ఫారెక్స్ కార్డును ఆవిష్కరించింది. యూఎస్ డాలర్, యూరో, స్విస్ ఫ్రాంక్, బ్రిటిష్ పౌండ్, జపనీస్ యెన్, సౌతాఫ్రికా రాండ్, సింగపూర్ డాలర్ వంటి 20కి పైగా కరెన్సీలను ఈ కార్డులో లోడ్ చేసుకోవచ్చు. ట్రావెలర్లు విదేశాల్లో పర్యటించేటప్పుడు కార్డును ఆన్‌లైన్‌లో రిలోడ్ చేసుకోవచ్చు. కార్డు నగదు విత్‌డ్రాయల్స్‌పై జీరో మార్క్–అప్ ఫారెక్స్ రేట్ లాక్ ఇన్ సదుపాయముంది. తద్వారా కార్డు లోడ్ చేసేటప్పుడు ఏ మార్పిడి రేటు ఉందో తర్వాత షాపింగ్ చేసేటప్పుడు ఆ రేటునే చెల్లించవచ్చు. అలాగే స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ మల్టీ కరెన్సీ ఫారెక్స్ కార్డు పర్యాటకులకు అదనంగా ట్రావెల్ బీమాను కూడా అందిస్తోంది.