పీఎఫ్‌సీ వాటా విక్రయం సక్సెస్
ఖజానాకు రూ.1,600 కోట్లు
న్యూఢిల్లీ: రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ బాగుం డటంతో ప్రభుత్వ రంగ దిగ్గజం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ) తలపెట్టిన ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) 2.34 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయ్యింది. ఎన్‌ఎస్‌ఈ గణాంకాల ప్రకారం ఈ సంస్థలో ప్రభుత్వానికి ఉన్న వాటాలో 5 శాతాన్ని... అంటే 6.60 కోట్ల షేర్లను ఓఎఫ్‌ఎస్‌కి ఉంచగా 15.41 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. ఒకో షేరుకు రూ. 254 ధరను నిర్ణయించటంతో ఖజానాకు రూ. 1,600 కోట్ల పైచిలుకు జమ కానున్నాయి. మొత్తం షేర్లలో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 1.32 కోట్ల షేర్లను ప్రతిపాదించగా ఏకంగా 5.92 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. షేరు కనీస విక్రయ ధర రూ.254లో రిటైల్ ఇన్వెస్టర్లకు 5 శాతం డిస్కౌంటు లభిస్తుంది. బీఎస్‌ఈలో సోమవారం పీఎఫ్‌సీ షేర్లు 2.12 శాతం క్షీణించి రూ. 254.05 వద్ద ముగిశాయి.