
సుజుకీ కొత్త ప్రెసిడెంట్‌గా తొషిహిరొ సుజుకీ
టోక్యో: మారుతీ సుజుకీ మాతృసంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్(ఎస్‌ఎంసీ)లో కార్యనిర్వాహక విభాగంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎస్‌ఎంసీ కొత్త ప్రెసిడెంట్‌గా తొషిహిరో సుజుకీ(ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్) ఎంపికయ్యారు. ఈయన ప్రస్తుతం సీఈఓగా వ్యవహరిస్తున్న ఒసాము సుజుకీ పెద్ద కొడుకు.