కాల్‌డ్రాప్ పరిష్కారానికి చర్యలు చేపట్టండి
టెల్కోల అధిపతులను కోరిన డాట్
న్యూఢిల్లీ: కాల్‌డ్రాప్ సమస్య తీవ్రతరం కావడంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం (డాట్) ఆ అంశంపై దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగా డాట్ కాల్‌డ్రాప్ సమస్య పరిష్కారానికి తగిన చర్యలను చేపట్టాలని టెల్కోల అధిపతులను కోరింది. టెలికం కార్యదర్శి రాకేశ్ జార్జ్ ఈ విషయమై భారతీ ఎయిర్‌టెల్ ప్రమోటర్ సునీల్ మిట్టల్‌కు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ ప్రమోటర్ అనిల్ అంబానీకి, ఐడియా ప్రమోటర్ కుమార్ మంగళం బిర్లాకు, వోడాఫోన్ గ్లోబల్ సీఈవో విట్టోరియోకు ఫోన్ చేసి.. సర్వీసుల నాణ్యతను పెంచాలని, లేనిపక్షంలో లెసైన్స్ నిబంధనల కింద జరిమానా విధిస్తామని తెలిపిన ట్లు సమాచారం. కాల్‌డ్రాప్‌కు సంబంధించి టెల్కోలు వినియోగదారులకు పరిహారం చెల్లించే అంశంపై అక్టోబర్ 10-15 సమయంలో అంతిమ ప్రతిపాదనలను రూపొందిస్తామని ట్రాయ్ చైర్మన్ ఆర్.ఎస్.శర్మ తెలిపారు.
టవర్ల ఏర్పాటును అనుమతించండి: వెంకయ్య నాయుడు
కాగా కాల్‌డ్రాప్ సమస్యను ఎదుర్కొనడంలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు ప్రభుత్వ భవనాలపై సెల్‌ఫోన్ టవర్ల ఏర్పాటుకు అనుమతులను ఇవ్వాలని తన శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.