రీచార్జ్, బిల్లు చెల్లింపు సమస్యలకు టెల్కోలదే బాధ్యత
న్యూఢిల్లీ: థర్డ్‌పార్టీ వెబ్‌సైట్లు, యాప్స్ ద్వారా వినియోగదారులు జరిపే రీచార్జ్‌లు, బిల్లు చెల్లింపుల్లో సమస్యలు ఏర్పడితే, వాటికి టెలికం కంపెనీలే బాధ్యత వహించాలని టెలికం నియంత్రణా సంస్థ ట్రాయ్ హెచ్చరించింది. పేమెంట్ సదుపాయాన్ని కల్పించే థర్డ్‌పార్టీ వెబ్‌సైట్లు, అప్లికేషన్లు లెసైన్సులు లేని సంస్థలని, వాటిని టెలికాం సంస్థలే నియమించుకున్నందున, సమస్యలు ఏర్పడితే వాటికి ఆపరేటర్లే బాధ్యత వహించాలంటూ ట్రాయ్ ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. ప్రస్తుతం ఫ్రీచార్జ్, మెబిక్‌విక్, ఆక్సిజన్ వంటి పలు మొబైల్ యాప్స్, వెబ్‌సైట్లు...టెలికాం కంపెనీల చానల్ పార్టనర్లుగా మొబైల్ రీచార్జ్, బిల్లు చెల్లింపు సదుపాయాల్ని అందిస్తున్నాయి.