ఆసియాలో అగ్రస్థానం.. అంతర్జాతీయంగా మూడో స్థానం | The UK: the destination for innovation centre investment? | Sakshi
Sakshi News home page

ఆసియాలో అగ్రస్థానం.. అంతర్జాతీయంగా మూడో స్థానం

Published Thu, Dec 15 2016 1:18 AM | Last Updated on Mon, Sep 4 2017 10:44 PM

ఆసియాలో అగ్రస్థానం..  అంతర్జాతీయంగా మూడో స్థానం

ఆసియాలో అగ్రస్థానం.. అంతర్జాతీయంగా మూడో స్థానం

ఇన్నోవేషన్‌ సెంటర్ల ఏర్పాటుకు గమ్యంగా భారత్‌: క్యాప్‌జెమిని   
ముంబై: ఆసియా ప్రాంతంలో ఇన్నోవేషన్‌ సెంటర్ల ఏర్పాటుకు భారత్‌ గమ్యస్థానంగా మారింది. ఇక అంతర్జాతీయంగా మూడో స్థానంలో ఉంది. గ్లోబల్‌ కన్సల్టింగ్‌ దిగ్గజం క్యాప్‌జెమిని రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇండియాలో ఇన్నోవేషన్‌ కేంద్రాల ఏర్పాటులో బెంగళూరు టాప్‌లో ఉందని నివేదిక పేర్కొంది. ఇక్కడ ఈ ఏడాది మార్చి–అక్టోబర్‌ మధ్యకాలంలో 3 కొత్త సెంటర్లు ఏర్పాటయ్యాయి.

ఇదే కాలంలో దేశంలో 9 కేంద్రాలు ఏర్పాటయ్యాయని, దీంతో భారత్‌లో మొత్తం ఇన్నోవేషన్‌ సెంటర్ల సంఖ్య 25కి పెరిగిందని పేర్కొంది. అమెరికా 146 సెంటర్లతో టాప్‌లో ఉందని తెలిపింది. దీని తర్వాతి స్థానంలో బ్రిటన్‌ (29 సెంటర్లు), ఇండియా (25 సెంటర్లు) ఉన్నాయని పేర్కొంది. ఈ ఏడాది మార్చి–అక్టోబర్‌లో జైపూర్, పుణే, హైదరాబాద్‌ ప్రాంతాల్లో రెండేసి చొప్పున కొత్త ఇన్నోవేషన్‌ సెంటర్లు ఏర్పాటయ్యాయని పేర్కొంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement