Innovation Centre
-
మాన్యుఫాక్చరింగ్ యూనిట్స్ పెరగాలి
రాయదుర్గం: తెలంగాణ రాష్ట్రంలో మాన్యుఫాక్చరింగ్ యూనిట్స్ పెరగాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. నానక్‌రాంగూడలో నూతనంగా విస్తరించిన మెడ్‌ట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్‌ను గురువారం ఆయన అమెరికా కాన్సులేట్ (హైదరాబాద్) కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలో ఎంఈఐసీ ఉండటం మెడ్‌టెక్ ఆవిష్కరణలకు హాట్‌స్పాట్‌గా ఎదుగుతుందనడానికి నిదర్శనమన్నారు. ఈ ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభు త్వం కట్టుబడి ఉందన్నారు. వైద్య పరికరాల తయారీ, పరిశోధన, అభివృద్ధికి ఆదర్శవంతమైన గమ్య స్థానంగా హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. మెడ్‌ట్రానిక్ సంస్థ అమెరికా తర్వాత అతిపెద్ద ఆర్అండ్డీ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంస్థ పురోభివృద్ధికి పూర్తి సహకారం అందించేందుకు ఎప్పుడూ సి ద్ధంగా ఉంటామని పేర్కొన్నారు. కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మాట్లాడుతూ, అమెరికా తర్వాత అతిపెద్ద ఆర్అండ్డీ సెంటర్లను భారత్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం హర్షణీయమన్నా రు. మెడ్‌ట్రానిక్ చైర్మన్, సీఈఓ జెఫ్‌మార్తా మాట్లా డుతూ ఆర్అండ్డీ సౌకర్యాన్ని విస్తరించడానికి, భవిష్యత్తులో 1,500 మందికి ఉపాధి కల్పించడానికి మెడ్‌ట్రానిక్ ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు. వచ్చే ఐదేళ్లలో రూ.3 వేల కోట్ల పెట్టుబడితో విస్తరిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎంఈఐసీ ఉపాధ్యక్షుడు, సైట్ లీడర్ దివ్యప్రకాశ్ జోషి మాట్లాడారు. అనంతరం మంత్రి మెడ్‌ట్రానిక్ సంస్థ ద్వారా ఉత్పత్తి చేసిన యంత్ర పరికరాలు వాటి పనితీరును వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఫోర్సిస్ ఇంక్ నూతన కార్యాలయం ప్రారంభం తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు పూర్తిగా అనుకూలంగా ఉందని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలోని ఫోర్సిస్ ఇంక్‌నూతన కార్యాలయాన్ని శ్రీధర్‌బాబు, అమెరికా కాన్సులేట్ (హైదరాబాద్) కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సా మాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, అందుకు ప్రైవేటు సంస్థలు కూడా ముందుకు రావాలన్నారు. జెన్నిఫర్ లార్సన్ మాట్లాడుతూ భారతదేశం, అమెరికా భాగస్వామ్య ప్రజాస్వామ్య విలువల ఆధారంగా బలమైన ద్వైపాక్షిక స్నేహంగా ముందుకు సాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఫోర్సిస్ సంస్థ వ్యవస్థాపకులు జేపీ వేజెండ్ల, ఐల్యా బ్స్ గ్రూప్ చైర్మన్ శ్రీనివాసరాజు మాట్లాడారు. -
ఐస్ క్రీమ్ తింటున్న కొద్దీ ఇంకా తినాలని ఎందుకు అనిపిస్తుంది?
ఐస్‌క్రీం అంటే ఇష్టపడని వారుండరు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా ఆస్వాదించే మధురమైన స్నాక్. ఆఖరికి పెళ్లి భోజనాల్లో తాంబులాలకు బదులు ఐస్‌క్రీంలు సర్వ్ చేస్తున్నారు. అంతలా మిగతా తినుబండరాల్లో రారాజుగా అగ్రస్థానంలో నిలిచింది. ఐస్క్రీ వినియోగం విషయమై పోటీపెడితే ప్రతి దేశం పాల్గొంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఐతే ఐస్‌క్రీం మనల్ని ఎందుకంతలా టెంప్ట్ చేసి..తినేకొద్ది తినాలనిపిస్తుందంటే.. తొలి నాళ్లల్లో కేవలం పాలు చక్కెరతో తయారు చేసిన ఐసీక్రీ మాత్రమే ఉండేది. ఆ తర్వాత వెన్నెలా అంటూ రకరకాల ఐస్‌క్రీం ఫ్లేవర్లు లెక్కకు మించి మార్కెట్లోకి వచ్చి మనల్ని ఊరించడం ప్రారంభించాయి. అయితే వీటి తయారికి పాలు, చక్కెర ప్రధానమైనవి. ఆ తర్వాత సాల్ట్, స్ట్రాస్ పియర్, బ్లూ చీజ్‌లు ఈ ఐస్‌క్రీంకి మరింత రుచిని తెచ్చిపెట్టడంలో కీలక పాత్ర పోషించాయి. ఓన్లీ క్రిమ్ని సిప్ చేయకుండా మధ్య, మధ్యలో క్రంచీ క్రంచీగా తినేలా మాల్టెడ్ మిల్స్బాల్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే క్యాండీడీ సాల్మన్‌తో కూడిన ఐస్‌క్రీంలు, క్రీమీ సలాడ్ డ్రెస్సింగ్‌లో ఇల్లులాంటి ఆకృతులతో కూడిని ఐస్‌క్రీంలు వచ్చాయి. మొదటగా ఆ ఐస్క్రీంని చూడగానే రంగు, రుచి, ఆకృతులతో కట్టిపేడేయాలన్న లక్ష్యంతో తయారీదారులు వాటికే ప్రాధాన్యత.. ఇస్తూ మంచి నాణ్యతతోక కూడినవి ప్రజలకు అందిస్తున్నారు. దీంతో ప్రజలు కూడా ఐసీక్రీంలకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులోనూ సమ్మర్ సీజన్లో అయితే ఇక ఆ ఐస్క్రీంలను అస్సలు వదిలిపెట్టరు. ఇదే క్రమంలో ఫుడ్ ఇన్నోవేషన్ సెంటర్లు కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేయడంపైనే దృష్టి సారిస్తున్నాయి. మసోని ఉబెర్ గౌర్మెట్ అనే మహిళా ఫుడ్ ఇన్నోవేటర్ ఇప్పటి వరకు తన కెరియర్లో సుమారు 100 రకాల విభిన్న ఫ్లేవర్లతో కూడిన ఐస్క్రీంలను తయారు చేసింది. సరికొత్త బ్రాండ్లతో మరింత రుచిగా అందించేలా నెపుణ్యాలను మెరుగుపరచుకోవడమే గాక మనం తీసుకునే ఆహారంలో ఇన్ బ్యాలెన్స్ అయ్యేలా వాటిని రూపొందిస్తుంది ఉబెర్. అంతేగాదు ఆరోగ్యానికి ప్రమాదకారికి ఉండకుండా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పుడూ నాణ్యతతో కూడిన సరికొత్త ఐస్క్రీంలను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు తయారీదారులో. దానిలో ఉండే చక్కెర గడ్డ కట్టకుండా ఉంటూ మన హయిగా ఆస్వాదించేలా ఉంటున్నాయి. ప్రజల ఆరోగ్య రీత్యా చక్కెరను కూడా తక్కువ శాతం వినియోగించేందుకు కంపెనీలు ఆసక్తి కనబర్చడంతో.. ప్రజలు కూడా వాటిని తినేందుకేక ఇష్టపడుతున్నారు. చల్లగా ఉండే ఆ ఐస్క్రీంని ఆస్వాదించగానే మన మెమెరీ ఒక్కసారిగా ఉత్తేజంగా మారడమే గాక మనం ఆనందంగా ఉన్న జ్ఞాపకాలు కళ్లముందు మెదిలేలా చేస్తుంది. దీంతో మనకే తెయని ఒక విధమైన అనుభూతికి గురై..మరోసారి తినాలనే ఫీలింగ్ వస్తుంటుంది. ఇక వీటిలో అధిక కొవ్వు, చక్కెరల కారణంగా రోజు ఎక్కువగా తింటే ఒబెసిటీ వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉంది. అందువల్ల సాధ్యమైనంత మేర కాస్త దూరంగా ఉండటమే మంచిది అంటున్నారు ఆహార నిపుణులు. ఆయా ఐస్క్రీంలలో ఎలక్రిక్ మిషన్‌తో కూడిన స్కూపీల్లో చక్కెర స్థాయిలు, కొవ్వు శాతం సుమారు 10 నుంచి 11 శాతం మాత్రమే ఉంటాయి. ఇక మంచి బ్రాండెడ్ కంపెనీలకు సంబంధించిన ఐస్క్రీంలలో అయితే వాటి స్థాయి అధికంగానే ఉంటుంది. (చదవండి: కమ్మని కాఫీలాంటి కళ) -
హైదరాబాద్ వేదికగా ‘ఫ్లేవర్స్ ఇన్నోవేషన్ సెంటర్’
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయంగా ఫ్లేవర్స్, ఫ్రాగ్రన్స్ పారిశ్రామిక రంగాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని ఫ్రాన్స్‌కు చెందిన ‘మనే’ ఫ్రాగ్రన్స్ అండ్ ఫ్లేవర్స్ అగ్రగామి తయారీ సంస్థ చైర్మన్ జీన్ మనే తెలిపారు. మనే గ్రూప్స్ ఆధ్వర్యంలో నగరంలోని రాయదుర్గ్ వేదికగా మంగళవారం ఫ్లేవరస్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఆహారం, పరిమళాలకు సంబంధించిన పరిశ్రమల్లో అవసరమైన ఫ్లేవర్స్‌ను అందించడంలో భాగంగా పరిశోధనాభివృద్ధి కార్యకలాపాల కోసం 3 మిలియన్ యూరోల వ్యయంతో ఈ ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జీన్ మనే మాట్లాడుతూ., భారత్‌లో ఫ్లేవర్స్ రంగంలో అతిపెద్ద వేదికగా ఈ సెంటర్‌ను ప్రారంభించామని, రానున్న మూడేళ్లలో సంస్థ పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా 45 మిలియన్ యూరోలను వెచ్చించనున్నామని తెలిపారు. ఈ ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా ఆహార పదార్థాలు, పానియాలు, చాక్లెట్, బేకరీ ఉత్పత్తులు, స్వీట్, కన్ఫెక్షనరీ తదితరాలకు అవసరమయ్యే ఫ్లేవర్స్‌ను సేకరించి ఉత్పత్తి సంస్థలకు అందిస్తామని వెల్లడించారు. తమ సంస్థ 56 శాతం గ్లోబల్ రెవెన్యూతో అంతర్జాతీయంగా 5వ స్థానంలో ఉందని, ఇందులో 8 శాతం భారత్ నుంచే ఉత్పత్తి అవుతుందని వెల్లడించారు. మనే ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఫ్లేవర్స్ ఇన్నోవేషన్ సెంటర్, ముంబైలో ఫ్రాగ్రన్స్ స్టూడియోను నిర్వహిస్తున్నామన్నారు. ఫ్లేవర్స్‌ను సేకరించే ప్లాంట్లను ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, కేరళలో నిర్వహిస్తున్నామని, స్పైస్ కోసం ఇక్కడ లభించే మిరప అత్యుత్తమమైనదని చెప్పారు. తెలంగాణలోని దుండిగల్‌లో కూడా తమ ఉత్పత్తి కేంద్రం సేవలందిస్తోందని వివరించారు. నగరంలోని ఈ ఇన్నోవేషన్ సెంటర్ అధునాతన సాంకేతిక విధానంలో పరిశోధనలు చేస్తూ పారిశ్రామికంగా అవసరమైన ఫార్ములాలను రూపొందిస్తోందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సుమిత్ దాస్ గుప్తా తెలిపారు. పరిశోధనాభివృద్ధి కోసం అధునాతన ల్యాబరేటరీలను కొనసాగిస్తున్నామని గ్రూప్ ఆసియా పసిఫిక్ డైరెక్టర్ బె ర్నార్డ్ లేనౌడ్ పేర్కొన్నారు. ఈ సంస్థ భారత్‌తో పాటు శ్రీలంక, నేపాల్‌లలో సేవలందిస్తోందని చెప్పారు. -
ఆసియాలో అగ్రస్థానం.. అంతర్జాతీయంగా మూడో స్థానం
ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు గమ్యంగా భారత్: క్యాప్‌జెమిని ముంబై: ఆసియా ప్రాంతంలో ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు భారత్ గమ్యస్థానంగా మారింది. ఇక అంతర్జాతీయంగా మూడో స్థానంలో ఉంది. గ్లోబల్ కన్సల్టింగ్ దిగ్గజం క్యాప్‌జెమిని రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇండియాలో ఇన్నోవేషన్ కేంద్రాల ఏర్పాటులో బెంగళూరు టాప్‌లో ఉందని నివేదిక పేర్కొంది. ఇక్కడ ఈ ఏడాది మార్చి–అక్టోబర్ మధ్యకాలంలో 3 కొత్త సెంటర్లు ఏర్పాటయ్యాయి. ఇదే కాలంలో దేశంలో 9 కేంద్రాలు ఏర్పాటయ్యాయని, దీంతో భారత్‌లో మొత్తం ఇన్నోవేషన్ సెంటర్ల సంఖ్య 25కి పెరిగిందని పేర్కొంది. అమెరికా 146 సెంటర్లతో టాప్‌లో ఉందని తెలిపింది. దీని తర్వాతి స్థానంలో బ్రిటన్ (29 సెంటర్లు), ఇండియా (25 సెంటర్లు) ఉన్నాయని పేర్కొంది. ఈ ఏడాది మార్చి–అక్టోబర్‌లో జైపూర్, పుణే, హైదరాబాద్ ప్రాంతాల్లో రెండేసి చొప్పున కొత్త ఇన్నోవేషన్ సెంటర్లు ఏర్పాటయ్యాయని పేర్కొంది.