రెండేళ్లలో ఆన్‌లైన్లోకి 2 కోట్ల చిన్న సంస్థలు
గూగుల్ ఇండియా లక్ష్యం
న్యూఢిల్లీ: వచ్చే రెండేళ్లలో భారత్‌లో 2 కోట్ల పైగా చిన్న, మధ్య త రహా (ఎస్‌ఎంబీ) సంస్థలను ఆన్‌లైన్ మాధ్యమంలోకి తేవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు సెర్చి ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ తెలిపారు. ఇందుకోసం గూగుల్ మై బిజినెస్ (జీఎంబీ) మొబైల్ యాప్‌ను అందిస్తున్నట్లు ఆయన వివరించారు. దీన్ని ఉపయోగించుకుని ఎస్‌ఎంబీలు .. ఇంగ్లీషు, హిందీ భాషల్లో తమ వ్యాపారాల వివరాలను ఆన్‌లైన్‌లో ఉచితంగా పొందుపర్చవచ్చని చెప్పారు.