
ముంబై: ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడానికి మరో మూడు రోజులే గడువుంది. గత ఆర్థిక సంవత్సరానికి(అసెస్‌మెంట్ ఇయర్ 2019–20) సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఎలక్ట్రానిక్ పద్దతిలో దాఖలు చేయడానికి గడవు తేదీ ఈ నెల 31వ తేదీ. కాగా ఐటీఆర్‌లు దాఖలు చేయడానికి ఐదు వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నా యి. ఆదాయపు పన్ను విభాగం పోర్టల్... ఐటీఆర్ దాఖలు చేయడానికి అధికారిక వెబ్‌సైట్‌గా అందుబాటులో ఉంది. క్లియర్ ట్యాక్స్, మైఐటీ రిటర్న్, ట్యాక్స్‌స్పానర్, పైసాబజార్ ఈ వెబ్‌సైట్‌ల ద్వారా కూడా ఐటీఆర్‌లు దాఖలు చేయవచ్చు. ఇవే కాకుండా చాలా బ్యాంక్‌లు ఈ–ఫైలింగ్ ఆప్షన్‌ను అందిస్తున్నాయి. ఐటీఆర్‌లు దాఖలు చేయాలనుకుంటున్న వాళ్లు సంబంధిత బ్యాంక్‌ల ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఐటీఆర్‌లను దాఖలు చేయవచ్చు. ఈ నెల 31లోపు ఐటీఆర్ దాఖలు చేయలేకపోతే, ఈ ఏడాది డిసెంబర్ వరకూ రూ. 5,000 జరిమానాతో, ఆ తర్వాత రూ.10,000 ఫైన్‌తో దాఖలు చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment