4 నుంచి తిరుపతిలో దక్షిణ భారత కంపెనీ సెక్రటరీల సదస్సు | Tirupati, in southern India, Company Secretaries Conference 4th and 5th | Sakshi
Sakshi News home page

4 నుంచి తిరుపతిలో దక్షిణ భారత కంపెనీ సెక్రటరీల సదస్సు

Published Wed, Dec 2 2015 3:07 AM | Last Updated on Sun, Sep 3 2017 1:19 PM

4 నుంచి తిరుపతిలో దక్షిణ భారత కంపెనీ సెక్రటరీల సదస్సు

4 నుంచి తిరుపతిలో దక్షిణ భారత కంపెనీ సెక్రటరీల సదస్సు

తిరుపతి రూరల్: దక్షిణ భార త కంపెనీ సెక్రటరీల 10వ ప్రాంతీయ సదస్సును తిరుపతిలో ఈ నెల 4, 5 తేదీల్లో నిర్వహించనున్నట్లు ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా చైర్మన్ నాగేంద్రరావు తెలిపారు. తిరుపతిలోని బ్లిస్ హోటల్‌లో 4వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ సదస్సు ప్రారంభమవుతుందన్నారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సదరన్ డిస్కం సీఎండీ హెచ్‌వై దొర పాల్గొంటారని తెలిపారు. మంగళవారం తిరుపతిలో సదరన్ డిస్కం కంపెనీ సెక్రటరీ ప్రకాష్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ది ఛాలెంజ్ ఆఫ్ ఛేంజ్-కంపెనీ సెక్రటరీ లీడింగ్ ది వే’ అనే అంశంపై ఈ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణసహా పలు రాష్ట్రాల నుంచి   కంపెనీల సెక్రటరీలు పాల్గొంటారని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement