సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తొలి స్థిరాస్తి ప్రదర్శనకు భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) సిద్ధమైంది. మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో శుక్రవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈ ప్రాపర్టీ షోను ప్రారంభిస్తారని క్రెడాయ్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఈనెల 31 వరకు జరిగే ఈ స్థిరాస్తి ప్రదర్శనలో సుమారుగా 150 మంది బిల్డర్లు, డెవలపర్లు పాల్గొంటారు. దాదాపు రూ.35 లక్షల నుంచి రూ.2.5 కోట్ల విలువ గల ఫ్లాట్లు, విల్లాలు, స్థలాల వివరాలను అందజేస్తారు. ఈ ప్రాపర్టీ షోలో హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి, క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొంటారు.
నేడు క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభం!
Published Fri, Aug 29 2014 2:15 AM | Last Updated on Wed, Aug 15 2018 8:06 PM
Advertisement
Advertisement