
నేటి నుంచి నారాయణ హృదయాలయ ఐపీఓ
- ప్రైస్‌బాండ్ రూ.245-250 రేంజ్‌లో
న్యూఢిల్లీ: నారాయణ హృదయాలయ ఐపీఓ నేటి(గురువారం) నుంచి ప్రారంభం కానున్నది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.613 కోట్లు సమీకరించనున్నదని అంచనా. ఈ నెల 21న (వచ్చే సోమవారం) ముగిసే ఈ ఐపీఓకు రూ. 245-250 ధరల శ్రేణిని ప్రైస్‌బాండ్‌గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఐపీఓ ద్వారా 14 శాతం వాటాకు సమానమైన 2.45 కోట్ల షేర్లను జారీ చేస్తారు. కాగా 15 మంది యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా రూ.184 కోట్లు సమీకరించామని తెలిపింది.