న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ఆయిల్ మార్కెటింగ్ సంస్థ ఐవోసీ జూన్ త్రైమాసికంలో 50 శాతం అధికంగా లాభాన్ని ఆర్జించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.6,831 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.4,549 కోట్లుగా ఉంది. ఇన్వెంటరీ లాభాలు (దిగుమతి చేసుకున్న ముడి చమురు, విక్రయానికి వచ్చే సరికి రేట్ల పెరుగుదలతో కలిగే ప్రయోజనం) రూ.7,866 కోట్లుగా ఉండడమే ఈ స్థాయి పనితీరుకు దోహదపడింది.
రిఫైనరీ మార్జిన్లు తక్కువగా ఉండడం, కరెన్సీ మారకం నష్టాలు ఉన్నప్పటికీ ఇన్వెంటరీ లాభాల కారణంగా ఐవోసీ అధిక లాభాలను నమోదు చేసింది. ఆదాయం రూ.1,49,747 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.1,28,183 కోట్లు కావడం గమనార్హం. ప్రతీ బ్యారెల్ ముడి చమురును, ఇంధనంగా మార్చినందుకు 10.21 డాలర్లను ఆర్జించింది. ఇన్వెంటరీ లాభాలను తీసేసి చూస్తే ప్రతీ బ్యారెల్‌పై రిఫైనింగ్ మార్జిన్ 5.18 డాలర్లుగా ఉండగా, క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 6.44 డాలర్లు కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment