రేపే సువిధ ప్రాజెక్ట్ ప్రారంభం! | tomarrow suvidha project is opening | Sakshi
Sakshi News home page

రేపే సువిధ ప్రాజెక్ట్ ప్రారంభం!

Published Fri, Jan 29 2016 11:31 PM | Last Updated on Sun, Sep 3 2017 4:34 PM

tomarrow suvidha project is opening

కొత్తూరు, షాద్‌నగర్ ప్రాంతాల్లో పలు ప్రాజెక్ట్‌లను విజయవంతంగా పూర్తి చేసిన శతాబ్ది టౌన్‌షిప్ ప్రై.లి. మహేశ్వరం మండలంలోని అమీర్‌పేట్ గ్రామంలో సువిధ పేరుతో మెగా ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టనుంది. ఆదివారం లాంఛనంగా ప్రారంభించనున్న ఈ వెంచర్ విశేషాలను సంస్థ ఎండీ కే శ్రీనివాస్ రెడ్డి ‘సాక్షి రియల్టీ’తో పంచుకున్నారు.

 ఆయనేమన్నారంటే..
60 ఎకరాల్లో సువిధ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఫేజ్-1లో 25 ఎకరాలకు హెచ్ ఎండీఏ అనుమతి కూడా పొందాం. ఇందులో 165-400 గజాల మధ్య ఓపెన్ ప్లాట్లుంటాయి. గజం ధర రూ.4,000. కేవలం ప్లాట్ల అమ్మకాలే కాకుండా తొలి విడతగా 100 ఇళ్లను కూడా నిర్మించాలని నిర్ణయించాం.

ప్రాజెక్ట్ ప్రత్యేకతేంటంటే.. 60 ఫీట్ల వెడల్పుండే ప్రధాన రహదారిలో మొత్తం సోలార్ వీధి దీపాలే. కొనుగోలుదారుల ఆరోగ్యం దృష్ట్యా ప్రాజెక్ట్‌లో పచ్చదనానికి అధిక ప్రాధాన్యమిస్తున్నాం. 2 వేల గజాల్లో క్లబ్ హౌజ్, స్విమ్మింగ్ పూల్ వంటి ఏర్పాట్లూ ఉంటాయి.

గతంలో కొత్తూరులో 15 ఎకరాల్లో మగధ, ఇదే ప్రాంతంలో 45 ఎకరాల్లో శతాబ్ది వ్యాల్యూ వెంచర్లను పూర్తి చేశాం. షాద్‌నగర్‌లో 40 ఎకరాల్లో వసుధ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ప్రస్తుతమిందులో 15 ఎకరాల్లో అమ్మకాలున్నాయి. గజం ధర రూ.2 వేలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement