హైదరాబాద్ లో తోషిబా విస్తరణ | Toshiba to set up rail systems equipment facility in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ లో తోషిబా విస్తరణ

Published Fri, Apr 8 2016 12:44 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

హైదరాబాద్ లో తోషిబా విస్తరణ - Sakshi

హైదరాబాద్ లో తోషిబా విస్తరణ

రైల్వే పరికరాల తయారీ కేంద్రం ఏర్పాటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విద్యుత్ పరికరాల తయారీలో ఉన్న జపాన్‌కు చెందిన తోషిబా కార్పొరేషన్ హైదరాబాద్‌లో రైల్వే పరికరాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. 2017 ఏప్రిల్‌లో ఈ ఫెసిలిటీలో ఉత్పత్తి ప్రారంభం కానుంది. పవర్ కన్వర్షన్ సిస్టమ్స్, ట్రైన్ కంట్రోల్ సిస్టమ్స్ ఇక్కడ తయారు చేస్తారు. భారత్‌తో పాటు మధ్యప్రాచ్య, ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తారు. 2020 నాటికి కొత్త ఫెసిలిటీ కోసం 100 మందిని నియమించుకునే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. తోషిబా కార్పొరేషన్ అనుబంధ కంపెనీ అయిన తోషిబా ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియాకు (టీటీడీఐ) హైదరాబాద్ సమీపంలోని రుద్రారం వద్ద ట్రాన్స్‌ఫార్మర్ల తయారీ ప్లాంటు ఉంది. ఈ ప్లాంటును అంతర్జాతీయ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్టు టీటీడీఐ సీఎండీ కట్సుటోషి టోడ ఇటీవల వెల్లడించారు. 2017 నాటికి మరో రూ.200 కోట్లను వెచ్చించనున్నట్టు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement