ఐక్యరాజ్యసమితి : జీఎస్‌టీ, నోట్ల రద్దు, బ్యాంకు స్కాంలతో దెబ్బతిన్న భారత జీడీపీ క్రమంగా కోలుకుంటోందని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7.2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. 2019-20లో భారత వృద్ధిరేటు 7.4 శాతంగా ఉంటుందని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆసియాపసిఫిక్ సామాజికార్థిక సర్వే పేర్కొంది.
భారత్‌లో ఇటీవల ప్రవేశపెట్టిన జీఎస్‌టీతో పాటు కార్పొరేట్, బ్యాంకింగ్ సంస్థల స్కామ్‌లు, నష్టాలు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపాయని పేర్కొంది. అయితే 2017 ద్వితీయార్థం నుంచి భారత జీడీపీ కోలుకుంటోందని అంచనా వేసింది. భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోందని, వ్యాపార వర్గాలు జీఎస్‌టీతో సర్ధుబాటు కావడడం, ప్రభుత్వ ఊతంతో బ్యాంకులు, కార్పొరేట్ల బ్యాలెన్స్ షీట్లు మెరుగవడం సానుకూల సంకేతాలని పేర్కొంది. ప్రైవేట్ పెట్టుబడులు సైతం భారత్‌లో క్రమంగా ఊపందుకుంటున్నాయని అంచనా వేసింది. కాగా, 2017లో ఆసియాఫసిఫిక్‌మ ఆర్థిక వ్యవస్థలు మెరుగైన సామర్ధ్యం కనబరుస్తూ 5.4 శాతం వృద్ధి రేటును కనబరిచాయని పేర్కొంది. ఇది అంతకుముందు ఏడాది 5.4 శాతంగా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment