ఫ్రీడం సేల్‌ : వెయ్యికే విమాన ప్రయాణం | Vistara Announces Freedom Sale ; Tickets Available Starting Rs 1099 | Sakshi
Sakshi News home page

ఫ్రీడం సేల్‌ : వెయ్యికే విమాన ప్రయాణం

Published Tue, Aug 14 2018 4:33 PM | Last Updated on Tue, Aug 14 2018 6:42 PM

Vistara Announces Freedom Sale ; Tickets Available Starting Rs 1099 - Sakshi

విస్తారా ఎయిర్‌లైన్స్‌ (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విమానయాన సంస్థలు డిస్కౌంట్‌ ఆఫర్లతో అదరగొడుతున్నాయి. ఇప్పటికే ఎయిరిండియా, ఇండిగో సంస్థలు స్వాతంత్య్ర దినోత్సవ సేల్స్‌ను ప్రకటించగా.. తాజాగా విస్తారా ఎయిర్‌లైన్స్‌ కూడా ‘ఫ్రీడం సేల్‌’ను ప్రయాణికుల ముందుకు తెచ్చింది. ఈ సేల్‌ కింద విమాన టిక్కెట్‌ కేవలం రూ.1,099కే లభ్యమవుతుంది. ఈ కొత్త సేల్‌ ఆఫర్‌ బుకింగ్స్‌ ఆగస్టు 14వ తేదీ 00:01 am నుంచి ప్రారంభమై, 11:59 pm వరకు కొనసాగనున్నాయి. ఎస్‌బీఐ కార్డుద్వారా టిక్కెట్లను బుక్‌ చేసుకునే వారికి అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తోంది. ఈ ఆఫర్‌ కింద టిక్కెట్లను బుక్‌ చేసుకున్న బిజినెస్‌ క్లాస్‌ కస్టమర్లు 2018 ఆగస్టు 22 నుంచి 2018 అక్టోబర్‌ 10 వరకు ప్రయాణించవచ్చు. ఎకానమీ, ప్రీమియం ఎకానమీ క్లాస్‌ కస్టమర్లు సెప్టెంబర్‌ 14 నుంచి అక్టోబర్‌ 10 వరకు ట్రావెల్‌ చేయొచ్చు.  

ఎకానమీ లైట్‌ కేటగిరీ వారికి వన్‌-వే ధరలు కేవలం రూ.1,099కే అందుబాటులో ఉన్నాయి. ఎకానమీ స్టాండర్డ్‌ కేటగిరీ వారికి రూ.1,399కు, ప్రీమియం ఎకానమీ కేటగిరీ వారికి రూ.2,499, బిజినెస్‌ క్లాస్‌ కేటగిరీ వారికి రూ.6,099కు విమాన టిక్కెట్లను విస్తారా ఆఫర్‌ చేస్తోంది. ఈ ఆఫర్‌ కింద సీట్లు పరిమితం. ఫస్ట్‌-కమ్‌-ఫస్ట్‌ సర్వ్‌ బేసిస్‌లోనే ఈ సీట్లను బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలోనే అన్ని ఛార్జీలు కలిసి ఉంటాయి. అహ్మదాబాద్‌ నుంచి బెంగళూరు వన్‌-వే విమాన టిక్కెట్‌ ధర ఎకానమీ లైట్‌ కేటగిరీ కింద రూ.1,799 కాగ, ఎకానమీ స్టాండర్డ్‌ కింద 2,324 రూపాయలు, ప్రీమియం ఎకానమీ కింద 4,199 రూపాయలు, బిజినెస్‌ క్లాస్‌ కింద 15,999 రూపాయలుగా ఉంది. మిగతా రూట్ల ధరలను www.airvistara.com లో చూడవచ్చు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement