ట్విట్టర్ డౌన్! వన్నాక్రై దాడి జరిగిందా?
సామాజిక మాధ్యమంగా ఎక్కువమంది యూజర్లు వాడే ట్విట్టర్ డౌన్ అయింది. శుక్రవారం ఉదయం ఒక్కసారిగా ట్విట్టర్ కు ఏమైందో తెలియదు? చాలామంది యూజర్లకు ట్విట్టర్ లో పోస్టింగ్స్ చేయడానికి తెగ ఇబ్బందులు పడ్డారట. ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో ట్విట్టర్ లో ట్వీట్స్ పోస్టు చేసేటప్పుడు, ఇంటర్నల్ ఎర్రర్, ఇతర మెసేజ్ లు చూపించాయని రిపోర్టులు వెల్లువడ్డాయి. దీంతో ఒక్కసారిగా యూజర్లలో ఆందోళన రేకెత్తిందని తెలిసింది. వారం క్రితం జరిగిన భారీ సైబర్ దాడి ముప్పున ట్విట్టర్ కూడా పడిందేమోనని యూజర్లు తీవ్రంగా ఆందోళన పడ్డారు.
ట్విట్టర్ లోకి వెళ్లిన 15-20 నిమిషాలకు వరకు సర్వర్ డౌన్ లోనే ఉందని కొంతమంది యూజర్లు ఫిర్యాదు చేశారు. ట్వీటింగ్, రీట్విటింగ్ వంటి వాటిల్లో సమస్యలు వచ్చాయని వారు పేర్కొన్నారు. గత 20 నిమిషాల వ్యవధిలో అసలు ట్వీట్ చేయడానికి వీలుపడలేదని ఓ ట్విట్టరియన్ చెప్పారు. 25 నిమిషాల వరకు ట్విట్టర్ డౌన్ అయిందని మరో వ్యక్తి ట్వీట్ చేశాడు. ఒకవేళ ట్విట్టర్ వన్నాక్రై బారిన పడిందా? అని అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రాబ్లమ్ కొన్ని ప్రాంతాల్లోనే వచ్చిందని వెల్లడైంది.