
సనోఫీ నుంచీ తప్పుకుంటున్న మాల్యా
న్యూఢిల్లీ: ఇటీవలే యునెటైడ్ స్పిరిట్స్ చైర్మన్ హోదా నుంచి వైదొలిగిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా తాజాగా సనోఫీ ఇం డియా చైర్మన్‌గా కూడా రిటైరవుతున్నట్లు బుధవారం తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగే కంపెనీ వార్షిక సర్వ సభ్య సమావేశంలో మరోసారి డెరైక్టర్‌గా ఎన్నికను కోరబోనని తెలిపారు. ‘నేను 42 ఏళ్ల పైగా కంపెనీకి డెరైక్టరుగాను, 32 ఏళ్లకు పైగా బోర్డు చైర్మన్‌గా వ్యవహరించాను. ఇక రిటైరవ్వదల్చుకున్నాను’ అంటూ సంస్థ బోర్డ్ ఆఫ్ డెరైక్టర్స్‌కు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. బుధవారం సమావేశమైన సనోఫీ ఇండియా బోర్డు .. మాల్యా నిర్ణయాన్ని ఆమోదించింది. సనోఫీ ఇండియా గతంలో హెక్ట్స్ ఫార్మాస్యూటికల్స్‌గా పేరొందింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కి సంబంధించి రూ. 9,000 కోట్ల పైగా రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యా ప్రస్తుతం దేశం విడిచి వెళ్లిపోవడం తెలిసిందే.