కంపెనీ చేతికి జ్యూరిక్ ఎయిర్‌పోర్ట్ వాటా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో (బీఐఏఎల్) ఫెయిర్‌ఫ్యాక్స్ వాటా పెంచుకుంటోంది. బీఐఏఎల్‌లో మైనారిటీ షేర్ హోల్డర్‌గా ఉన్న జ్యూరిక్ ఎయిర్‌పోర్ట్ తనకున్న 5 శాతం వాటాను ఫెయిర్‌ఫ్యాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌కు విక్రయించేందుకు ఒప్పందం చేసుకుంది. డీల్ విలువ (పన్నులకు ముందు) రూ.318 కోట్లు. దీంతో ఫెయిర్‌ఫ్యాక్స్ వాటా 38 శాతానికి చేరుకోనుంది. తద్వారా మెజారిటీ వాటాదారుగా నిలువనుంది. ఇటీవలే విమానాశ్రయంలో 33% వాటాను రూ.2,149 కోట్లకు ఫెయిర్‌ఫ్యాక్స్‌కు అమ్ముతున్నట్టు జీవీకే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ డీల్‌తో జీవీకే వాటా 10 శాతానికి పరిమితం అవుతోంది. కాగా, 2009లో జ్యూరిక్ ఎయిర్‌పోర్ట్ బీఐఏఎల్‌లో 12 శాతం వాటాను జీవీకే పవర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు విక్రయించింది. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్ర యాన్ని బీఐఏఎల్ నిర్వహిస్తోంది. విమానాశ్రయంలో ప్రస్తుతం సీమెన్స్ ప్రాజెక్ట్ వెంచర్స్‌కు 26 శాతం, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 13%, కర్ణాటక స్టేట్ ఇండస్ట్రియల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు 13 శాతం వాటా ఉంది. కెనడాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ ఫెయిర్‌ఫ్యాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌ను భారత్‌లో పుట్టిన ప్రేమ్ వత్స స్థాపించారు.
బెంగళూరు విమానాశ్రయంలో ఫెయిర్‌ఫ్యాక్స్ పాగా
Published Tue, Apr 19 2016 2:07 AM | Last Updated on Sun, Sep 3 2017 10:11 PM
Advertisement