
ప్రతీకాత్మక చిత్రం
కాన్పూర్ : యూపీలోని మహరాజ్‌గంజ్‌లో దారుణం జరిగింది. నాలుగేళ్ల పసిపాపై 6 నుంచి 12 సంవత్సరాల వయసున్న నలుగురు మైనర్ బాలురు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. మొబైల్ పోన్‌లో నగ్న చిత్రాలు చూసిన అనంతరం వారు ఈ ఘోరానికి పాల్పడ్డారు. నిందితులను మూడు రోజుల రిమాండ్ అనంతరం కౌన్సెలింగ్ కోసం జువెనిల్ హోంకు తరలించారు. పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసిన నలుగురు బాలురను మంగళవారం కాన్పూర్ పోలీసులు జువెనిల్ కోర్టులో హాజరుపరిచారు. వారికి కౌన్సెలింగ్ ఇప్పించాలని కోర్టు పేర్కొంటూ మూడురోజుల రిమాండ్‌కు తరలించింది.
కోర్టు ఉత్తర్వుల మేరకు జువెనిల్ హోంలో మూడు రోజుల బాలల సైకియాట్రిస్ట్‌తో కౌన్సెలింగ్ ఇస్తామని కాన్పూర్ ఎస్పీ ఏకే మీనా తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నలుగురు మైనర్ బాలురు మొబైల్ ఫోన్‌లో నగ్న చిత్రాలను చూసిన క్రమంలో ఇంటి బయట ఆడుకుంటున్న నాలుగేళ్ల పాపను సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో గాలించిన కుటుంబ సభ్యులకు అపస్మారక స్థితిలో కనిపించింది. ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం తనపై జరిగిన ఘోరాన్ని కుటుంబ సభ్యులకు వివరించడంతో వారు మహరాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.