ట్రైన్‌తో సెల్ఫీ.. గాల్లోకి ఎగిరిపడ్డారు.. | 3 Bengaluru Boys Crushed By Train | Sakshi
Sakshi News home page

ట్రైన్‌తో సెల్ఫీ.. గాల్లోకి ఎగిరిపడ్డారు..

Published Tue, Oct 3 2017 4:16 PM | Last Updated on Tue, Oct 3 2017 5:02 PM

3 Bengaluru Boys Crushed By Train

బెంగళూరు : వెర్రి ఆలోచనలతో విద్యార్థులు ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. స్వీయ చిత్రాలు(సెల్ఫీలు) వారి పాలిట మరణ మృదంగాలుగా మారుతున్నాయి. ప్రతి రోజు ఏదో ఒకచోట సెల్ఫీ మరణాలు సంభవిస్తున్నా అవగాహనకు తెచ్చుకోకుండా అలాంటి ప్రమాదాలనే మళ్ల మళ్లీ కొని తెచ్చుకుంటున్నారు. బెంగళూరులో మొన్న ఓ చెరువులో స్నానం చేస్తూ సెల్ఫీలు దిగే క్రమంలో ఓ విద్యార్థి చనిపోగా నేడు కూడా అదే బెంగళూరులో రైలుతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించి ముగ్గురు విద్యార్థులు మృత్యువాతపడ్డారు.

వేగంగా వచ్చిన రైలు వారిని అమాంతం ఢీకొట్టడంతో ముగ్గురి శరీరాలు చిద్రమయ్యాయి. గాల్లో బంతుల్లాగా ఎగిరి పట్టాలపై ముక్కలుగా పడ్డారు. ఈ ఘటన గురించి పరిశీలించిన అధికారులు కచ్చితంగా సెల్ఫీ ప్రయత్నంలోనే దుర్ఘటన చోటు చేసుకుందని, రైలు తమకు ఎంత సమీపంలో ఉందనే విషయాన్ని అంచనా వేయలేకపోయారని అంటున్నారు. మంగళవారం ఉదయం 9.30 గంటల నుంచి 10గంటల మధ్య బెంగళూరుకు 30 కిలోమీటర్లలోని బిడది అనే గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన వారిని ప్రభు ఆనంద్‌(18), రోహిత్‌(16), ప్రతేఖ్‌ రాయకర్‌(20) అనే విద్యార్థులుగా గుర్తించారు. వీరు జయనగర్‌లోని నేషనల్‌ కాలేజీలో చదువుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement