ఛత్తీస్‌లో ముగ్గురు నక్సల్స్‌ ఎన్‌కౌంటర్‌ | 3 Maoists killed in encounter | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌లో ముగ్గురు నక్సల్స్‌ ఎన్‌కౌంటర్‌

Published Sat, Jun 16 2018 3:54 AM | Last Updated on Tue, Oct 9 2018 2:39 PM

3 Maoists killed in encounter - Sakshi

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. గత రాత్రి చింతగుఫా పోలీస్‌స్టేషన్‌ పరిధి గట్టపాడ్, టోకన్‌పల్లి గ్రామాల మధ్య దట్టమైన అటవీ ప్రాంతంలో జిల్లా రిజర్వు బలగాలు, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ సంయుక్తంగా కూంబింగ్‌ చేపట్టాయి.

ఈ సందర్భంగా వారికి మావోయిస్టులు తారసపడ్డారు. రెండు వర్గాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోగా మిగతా వారు పరారయ్యారు. ఆ ప్రాంతంలో మావోయిస్టులకు చెందిన మూడు తుపాకులు లభ్యమయ్యాయి. మృతులను గుర్తించాల్సి ఉందని ఎస్పీ అభిషేక్‌ మీనా తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement