బాలిక మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబసభ్యులు
లక్నో, ఉత్తరప్రదేశ్ : కథువా గ్యాంగ్‌రేప్ ఘటనను మరువక ముందే ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోరం జరిగింది. తల్లిదండ్రులతో పాటు వివాహ వేడుకకు హాజరైన ఎనిమిదేళ్ల బాలికపై ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. పెళ్లి పనుల్లో ఆదమరచి ఉన్న తల్లిదండ్రుల కళ్లుగప్పిన సోను(18) బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు.
ఆపై దారుణంగా కొట్టి చంపాడు. ఈ ఘటన ఈటా గ్రామంలో చోటు చేసుకుంది. పెళ్లి వేడుక సందర్భంగా పెద్ద ఎత్తున శబ్దాలు పెట్టడంతో బాలిక కేకలు పెద్దలకు వినిపించలేదు. పెళ్లి తర్వాత బాలిక కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఊరిలో వెతకడం ప్రారంభించారు. నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో బాలిక మృతదేహాన్ని చూసిన వారు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
బాలికను కిరాతకంగా చంపిన సోను కూడా మృతదేహం పక్కనే మద్యం సేవించి పడివుండటాన్ని చూసి నిర్ఘాంతపోయారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సోను అదుపులోకి తీసుకున్ని పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, జమ్మూ కశ్మీర్‌లోని కథువా ఘటనలో మృగాళ్ల కవరానికి బలైన ఎనిమిదేళ్ల అసిఫాను చూసి అఖడం భారతం కళ్లు చెమర్చింది. పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను ముక్తకంఠంతో ఖండించింది.
Comments
Please login to add a commentAdd a comment