తల్వార్ దంపతులు (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : ఆరుషి జంట హత్యల కేసు మరో కొత్త మలుపు తిరిగింది. తల్వార్ దంపతులను నిర్దోషులుగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ వచ్చిన అప్పీల్‌ను సోమవారం సుప్రీంకోర్టు స్వీకరించింది. పని మనిషి హేమ్‌రాజ్ భార్య కుంకాల బంజాడే ఈ కేసుపై పునర్విచారణ చేపట్టాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు పిటిషన్‌ను స్వీకరించిన జస్టిస్ రంజన్ గోగయ్ నేతృత్వంలోని బెంచ్.. తల్వార్ దంపతులకు నోటీసులు జారీ చేసింది.
2008లో దంత వైద్యులైన రాజేశ్, నూపుర్ తల్వార్ దంపతుల కుమార్తె ఆరుషి, వాళ్ల ఇంట్లో పని మనిషి హేమరాజ్‌లు హత్యకు గరైయ్యారు. ఈ కేసులో ఘజియాబాద్ కోర్టు తల్వార్ దంపతులను దోషులుగా తేలుస్తూ 2013లో యావజ్జీవ శిక్ష విధించింది. అయితే సరైన సాక్ష్యాలు లేని కారణంగా ఆరుషి తల్లిదండ్రులను అలహాబాద్ కోర్టు నిర్దోషులుగా తేలుస్తూ 2017లో తీర్పు వెలువరించింది.
Comments
Please login to add a commentAdd a comment