aarushi murder case
-
ఆరుషి హత్యకేసులో కీలక మలుపు
-
ఆరుషి హత్యకేసులో కీలక మలుపు
సాక్షి, న్యూఢిల్లీ : ఆరుషి తల్వార్ జంట హత్యల కేసు మరో మలుపు తిరిగింది. తల్వార్ దంపతులను అలహాబాద్ కోర్టు నిర్దోషులుగా పేర్కొడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది. 2008లో దంత వైద్యులైన నూపుర్, రాజేశ్ తల్వార్ దంపతుల కుమార్తె ఆరుషి, వాళ్ల ఇంట్లో పని మనిషి హేమరాజ్‌లు హత్యకు గరైయ్యారు. ఈ కేసులో ఘజియాబాద్ కోర్టు తల్వార్ దంపతులను దోషులుగా తేలుస్తూ 2013లో యావజ్జీవ శిక్ష విధించింది. అయితే సరైన సాక్ష్యాలు లేని కారణంగా ఆరుషి తల్లిదండ్రులను అలహాబాద్ కోర్టు నిర్దోషులుగా తేలుస్తూ 2017లో తీర్పువెలువరించింది. కాగా, తల్వార్ దంపతులను నిర్దోషులుగా పేర్కొనడాన్ని సవాలు చేస్తూ హేమరాజ్ భార్య కుంకాల బంజాడే వేసిన పిటిషన్ ఇప్పటికే సుప్రీం విచారణలో ఉండగా.. తాజాగా సీబీఐ కూడా ఈ కేసులో పునర్విచారణ కోరుతూ పిటిషన్ వేయడంతో కేసు మరో కొత్త మలుపు తిరిగింది. -
ఆరుషి కేసులో కొత్త మలుపు
సాక్షి, న్యూఢిల్లీ : ఆరుషి జంట హత్యల కేసు మరో కొత్త మలుపు తిరిగింది. తల్వార్ దంపతులను నిర్దోషులుగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ వచ్చిన అప్పీల్‌ను సోమవారం సుప్రీంకోర్టు స్వీకరించింది. పని మనిషి హేమ్రాజ్ భార్య కుంకాల బంజాడే ఈ కేసుపై పునర్విచారణ చేపట్టాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు పిటిషన్‌ను స్వీకరించిన జస్టిస్ రంజన్ గోగయ్ నేతృత్వంలోని బెంచ్.. తల్వార్ దంపతులకు నోటీసులు జారీ చేసింది. 2008లో దంత వైద్యులైన రాజేశ్, నూపుర్ తల్వార్ దంపతుల కుమార్తె ఆరుషి, వాళ్ల ఇంట్లో పని మనిషి హేమరాజ్‌లు హత్యకు గరైయ్యారు. ఈ కేసులో ఘజియాబాద్ కోర్టు తల్వార్ దంపతులను దోషులుగా తేలుస్తూ 2013లో యావజ్జీవ శిక్ష విధించింది. అయితే సరైన సాక్ష్యాలు లేని కారణంగా ఆరుషి తల్లిదండ్రులను అలహాబాద్ కోర్టు నిర్దోషులుగా తేలుస్తూ 2017లో తీర్పు వెలువరించింది. -
ఆరుషి కేసులో మీడియాకు రిక్వెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : ఆరుషి మృతి కేసులో దాదాపు నాలుగేళ్ల తర్వాత తల్వార్ దంపతులు జైలు జీవితం నుంచి విముక్తులయ్యారు. దస్న జైలు నుంచి బయటికొచ్చిన రాజేశ్, నుపుర్‌లు మీడియా వైపు కన్నెత్తి కూడా చూడకుండా వెళ్లిపోయారు. అయితే వారి స్పందన తెలుసుకుందామని యత్నిస్తున్న మీడియాకు రాజేశ్ సోదరుడు దినేశ్ మాత్రం ఓ విజ్ఞప్తి చేస్తున్నాడు. ‘‘కన్నకూతురి(ఆరుషి)ని కోల్పోయిన బాధ నుంచి ఆ దంపతులు బయటపడటం కష్టమే. కానీ, న్యాయం కోసం ఇన్నేళ్లుగా పోరాడిన వారు ఇప్పుడు మాములుగా మారేందుకు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మీడియాకు చేస్తున్న విన్నపం ఒక్కటే. దయచేసి వారికి కొంత సమయం ఇవ్వండి. కోలుకున్నాక వారే మీడియా ముందుకొచ్చి మాట్లాడతారు’’ అని దినేశ్ చెప్పారు. తప్పు ఎవరు చేశారన్నది తేలకుండా ఆరోపణలు చేయటం సరికాదన్న ఆయన.. ఈ నాలుగేళ్లలో తమ కుటుంబం ఎన్నో భావోద్వేగాలను ఎదుర్కుందని అన్నారు. జైలుకి వెళ్లినప్పటి నుంచి కూడా ఆ దంపతులు కోరుకునేది ఒక్కటే. ఆరుషిపై పడ్డ మచ్చ(హేమరాజ్తో సంబంధాలు) చెరిగిపోవాలి. ఈ కేసులో నిజమేంటో తేలాలి. అందుకోసం ఊపిరి ఉన్నంతవరకు పోరాడతానని నా సోదరుడు(రాజేశ్) చెప్పాడు అని దినేశ్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఘజియాబాద్ జైలు నుంచి విడుదలైన తల్వార్ దంపతులు.. నోయిడా, జలవాయు విహార్‌లోని తమ ఇంట్లో కాకుండా.. నుపుర్ తల్లిదండ్రుల ఇంట్లో ఉన్నారు. -
జైలు నుంచి తల్వార్ దంపతుల విడుదల
-
భద్రత కావాలి : జైలు నుంచి తల్వార్ దంపతుల విడుదల
సాక్షి, న్యూఢిల్లీ : ఆరుషి, హేమ్‌రాజ్‌ల హత్య కేసులో గడిచిన నాలుగేళ్లుగా శిక్ష అనుభవించిన రాజేశ్ తల్వార్, ఆయన భార్య నుపుర్ తల్వార్లు సోమవారం సాయంత్రం ఘజియాబాద్ దస్నా జైలు నుంచి విడుదలయ్యారు. జంటహత్య కేసులో వీరికి సీబీఐ కోర్డు విధించిన జీవితఖైదును అలహాబాద్ హైకోర్టు గత వారం రద్దుచేసిన సంగతి తెలిసిందే. వరుస సెలవుల కారణంగా వారి విడుదల మూడు రోజులు ఆలస్యమైంది. మాకు భద్రత కల్పించండి : జైలు నుంచి విడుదలైన తర్వాత తమపై ఎవరైనా దాడికి పాల్పడే అవకాశం ఉన్న కారణంగా పోలీస్ భద్రత కల్పించాలని తల్వార్ దంపతులు కోరినట్లు వారి తరఫు న్యాయవాది చెప్పారు. గతంలో అలహాబాద్ కోర్టు ప్రాంగణంలో రాజేశ్ తల్వార్‌పై కొందరు దాడికి పాల్పడిన నేపథ్యంలోనే వారు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. జైలు నుంచి ఆలయానికి! : ఆరుషి-హేమ్‌రాజ్‌ల హత్య మొదలు ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తల్వార్ దంపతుల విడుదల సందర్భంగా దస్పా జైలు వెలువల మీడియా కోలాహలం నెలకొంది. తల్వార్ దంపతులు జైలు నుంచి నేరుగా నోయిడాలోని సాయిబాబా ఆలయానికి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఆ ఇంటికి మాత్రం ఇప్పుడే కాదు : తమ కూతురు ఆరుషి, పనిమనిషి హేమ్రాజ్ హత్య జరిగిన ఇంటికి తల్వార్ దంపతులు ఇప్పుడప్పుడే వెళ్లే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఆ ఇంట్లో వేరేవాళ్లు అద్దెకుంటున్నారు. జల్వాయి విహార్‌లోని నుపుర్ తల్లిదండ్రుల ఇంట్లోనే కొన్నాళ్లు ఉండనున్నట్లు తర్వాల్ బంధువులు పేర్కొన్నారు. జైలులో సంపాదించిన రూ. 49,500 తీసుకోకుండానే.. : ప్రొఫెషనల్ డెంటిస్టులైన రాజేశ్, నుపుర్ తర్వార్లు తమ శిక్షా కాలంలో జైలు ఖైదీలు, సిబ్బంది, అధికారులకు వైద్యం చేశారు. ఇందుకుగానూ వారికి రూ.49,500 ఫీజుగా అందాల్సిఉందని, అయితే ఆ మొత్తాన్ని తీసుకునేందుకు తల్వార్ దంపతులు నిరాకరించారని దస్నా జైలర్ మయూరా చెప్పారు. విడుదలైన తర్వాత కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి జైలుకు వెళ్లి వైద్యం చేయాలని వైద్యదంపతులు నిర్ణయం తీసుకున్నారు. #WATCH: Rajesh & Nupur Talwar released from Ghaziabad's Dasna Jail after Allahabad HC acquitted them in 2008 Aarushi-Hemraj murder. pic.twitter.com/mSkoXbExFs — ANI (@ANI) 16 October 2017 -
జైలులో లాస్ట్ డే : ఖైదీల భారీ క్యూ..
ఘజియాబాద్ : కూతురుని హత్య చేసిన కేసులో నిర్దోషులుగా బయటపడిన రాజేశ్ తల్వార్, నుపుర్ తల్వార్ దంపతులు ఆదివారం దాస్నా జైలులో బిజీగా గడిపేశారు. స్వయంగా వారు దంతవైద్యులు కావడంతో జైలులోని క్లినిక్ ఆదివారం ఇతర ఖైదీలతో కిక్కిరిసిపోయింది. తమ దంత సమస్యలు చూపించుకునేందుకు జైలు సిబ్బందితోసహా బారులు తీరారు. దీంతో వారిద్దరు ఆదివారం విశ్రాంతి లేకుండా జైలులో గడిపారు. 'సాధారణంగా వైద్యులైన నుపుర్, రాజేష్ శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఆదివారం క్లినిక్ వచ్చేవాళ్లు కాదు. అయితే, ఈ ఆదివారమే వారికి చివరి రోజు కావడంతో ఆ విషయం తెలుసుకున్న ఖైదీలు పెద్ద మొత్తంలో క్లినిక్ వద్ద బారులు తీరారు. రాజేష్ పురుష ఖైదీలకు వైద్యం చేయగా నుపుర్ మహిళా ఖైదీలకు వైద్య సేవలు చేసింది' అని జైలు అధికారులు తెలిపారు. అలాగే, జైలు ఖైదీలతోపాటు పప్పు అన్నం తిన్నారని తెలిపారు. గతంలో ఫిబ్రవరి విచారణ సమయంలో కూడా తాము నిర్దోషులుగా బయటకు వచ్చినప్పటికీ వారానికో, రెండు రోజులకు ఒకసారి జైలులోని ఖైదీలకు వైద్యం చేస్తామని కూడా కోర్టుకు తెలిపారు. తమ కూతురు ఆరుషిని, పని మనిషి హేమ్ రాజ్‌ను హత్యచేసిన కేసులో వీరిద్దరు నిర్దోషులని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. దీంతో వారిద్దరు విడుదల కావాల్సి ఉండగా ఆదివారం కావడంతో ఆరోజంతా చివరిసారిగా జైలులో వారికి వైద్య సేవలు చేశారు. -
ఆరుషి హత్య కేసులో.. సంచలన తీర్పు
-
తీర్పు తర్వాత సీబీఐ రియాక్షన్ ఇదే
న్యూఢిల్లీ : దేశంలో సంచలనం సృష్టించిన ఆరుషి తల్వార్ కేసులో ఆమె తల్లిదండ్రులను నిర్దోషులుగా అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పడంపై సీబీఐ స్పందించింది. తీర్పునకు సంబంధించిన కోర్టు కాపీ తమకు ఇంకా అందలేదని, ఒకసారి అది అందిన తర్వాత పూర్తిగా చదివి విశ్లేషణ చేశాక ఈ కేసులో ముందుకు వెళతామని స్పష్టం చేసింది. ఆరుషి కేసును సీబీఐ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. గతంలో సీబీఐ ప్రత్యేక కోర్టే వారిని దోషులుగా ప్రకటించింది. అయితే, ఆ తీర్పును కొట్టేస్తూ తాజాగా ఆరుషి తల్లిదండ్రులైన నుపుల్ తల్వార్, రాజేష్ తల్వార్లను అలహాబాద్ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఇదిలా ఉండగా తాజా తీర్పుపై తల్వార్ దంపతులు ఆరుషి తాత కూడా స్పందించారు. తల్వార్ దంపతులు తమ బిడ్డ ఆరుషిని హత్య చేయలేదని తనకు ముందే తెలుసని ఆరుషి తాతయ్య అన్నారు. ఈ సందర్భంగా తాము హైకోర్టుకు ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పారు. ఇక తల్వార్ దంపతులు స్పందిస్తూ తమకు ఇప్పటికైనా న్యాయం జరిగిందని అన్నారు. -
ఆరుషి హత్యకేసు: తల్వార్ దంపతులకు ఊరట
-
అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి హత్యకేసులో ఆమె తల్లిదండ్రులకు ఊరట లభించింది. అలహాబాద్ హైకోర్టు గురువారం ఆరుషి తల్లిదండ్రులను నిర్దోషిలుగా తేల్చింది. ఆరుషిని ఆమె తల్లిదండ్రులే చంపారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఆరుషిని ఆమె తల్లిదండ్రులే చంపినట్లు ఆధారాలు లేవని, ఆధారాలు సమర్పించడంలో సీబీఐ విఫలమైందని కోర్టు పేర్కొంది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద న్యాయస్థానం ఆరుషి తల్లిదండ్రులను నిర్దోషులుగా ప్రకటించింది. కాగా పద్నాలుగేళ్ల తమ కుమార్తె ఆరుషి, పనిమనిషి హేమరాజ్‌ల హత్య కేసులో దంతవైద్య నిపుణులు రాజేశ్, నూపుర్ తల్వార్ దంపతులను స్థానిక సీబీఐ ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆరుషి తల్లిదండ్రులు ప్రస్తుతం ఘజియాబాద్‌లోని దస్నా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. మరోవైపు అలహాబాద్ హైకోర్టు తీర్పును ఆరుషి తాత స్వాగతించారు. రాజేశ్, నూపుర్ తల్వార్ ఎలాంటి తప్పు చేయలేదని తమకు తెలుసు అని ఆయన అన్నారు. -
ఆరుషి తల్లికి పెరోల్
న్యూఢిల్లీ: తమ కూతురు ఆరుషి హత్య కేసులో జీవితఖైదు పడిన ఆమె తల్లి నుపుర్ తల్వార్ కు పెరోల్ లభించింది. ఆమెకు అలహాబాద్ హైకోర్టు మూడు వారాలు పెరోల్ మంజూరు చేసింది. అనారోగ్యంతో బాధ పడుతున్న తన తల్లిని చూసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించడంతో ఆమెకు ఊరట లభించింది. ఆరుషి, పనిమనిషి హేమ్ రాజ్(45) హత్య కేసులో భర్త రాజేశ్ తల్వార్ తో కలిసి నుపుర్ యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. నోయిడాలోని తల్వార్ ఇంటిలో ఆరుషి, హేమరాజ్ 2008, మే 15-16న హత్యకు గురయ్యారు. దేశంలో సంచలనం సృష్టించిన ఈ కేసులు ఎన్నో మలుపులు తిరిగింది. చివరకు 2013, నవంబర్ లో ఆరుషి తల్లిదండ్రులను కోర్టు దోషులుగా తేల్చింది. ఈ తీర్పును అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు. -
వైద్య సహాయకునిగా రాజేష్, టీచర్‌గా నూపుర్ తల్వార్!!
యావజ్జీవ జైలు శిక్ష పడిన తల్వార్ దంపతులు జైల్లో కొత్త పాత్రలు పోషిస్తున్నారు. రాజేష్ తల్వార్‌కు జైలు ఆస్పత్రిలో సీనియర్ వైద్యులకు సహాయకుని బాధ్యతలు అప్పగించగా, నూపుర్ తల్వార్‌కు టాచర్ పని అప్పగించారు. వీళ్లిద్దరూ బాగా ఉన్నత విద్యావంతులు కావడంతో వాళ్లకు తగిన పని అప్పజెప్పాలన్న ఉద్దేశంతో ఈ బాధ్యతలు ఇచ్చారు. ఇందుకు గాను వారిద్దరికీ జైలు నిబంధనల ప్రకారం తగిన వేతనం కూడా చెల్లిస్తామని ఘజియాబాద్ జైలు సూపరింటెండెంట్ వీరేష్ రాజ్ శర్మ తెలిపారు. వాళ్లు ఒక్క ఆదివారం తప్ప మిగిలిన అన్ని రోజుల్లోనూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది. బుధవారం నాడే వాళ్లు పని మొదలుపెట్టారు. రాజేష్, నూపుర్‌లను వరుసగా 11, 13 నెంబరు బ్యారక్‌లలో ఉంచారు. వీటిలో వాళ్లతో పాటు 11, 35 మంది ఇతర ఖైదీలుంటారు. రాజేష్ తల్వార్‌కు ఖైదీ నెంబర్ 9342, నూపుర్‌కు 9343 కేటాయించారు. వీళ్లిద్దరికీ జైల్లో వీఐపీ హోదా మాత్రం ఇవ్వడంలేదు. దంపతులిద్దరూ నవళ్లు చదవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. జైలుకు వచ్చేటప్పుడే నూపుర్ మూడు నవళ్లు తీసుకున్నారు. వార్తాపత్రికలు మాత్రం వాళ్లు చదవడంలేదని సూపరింటెండెంట్ శర్మ చెప్పారు.