యావజ్జీవ జైలు శిక్ష పడిన తల్వార్ దంపతులు జైల్లో కొత్త పాత్రలు పోషిస్తున్నారు. రాజేష్ తల్వార్కు జైలు ఆస్పత్రిలో సీనియర్ వైద్యులకు సహాయకుని బాధ్యతలు అప్పగించగా, నూపుర్ తల్వార్కు టాచర్ పని అప్పగించారు. వీళ్లిద్దరూ బాగా ఉన్నత విద్యావంతులు కావడంతో వాళ్లకు తగిన పని అప్పజెప్పాలన్న ఉద్దేశంతో ఈ బాధ్యతలు ఇచ్చారు. ఇందుకు గాను వారిద్దరికీ జైలు నిబంధనల ప్రకారం తగిన వేతనం కూడా చెల్లిస్తామని ఘజియాబాద్ జైలు సూపరింటెండెంట్ వీరేష్ రాజ్ శర్మ తెలిపారు.
వాళ్లు ఒక్క ఆదివారం తప్ప మిగిలిన అన్ని రోజుల్లోనూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది. బుధవారం నాడే వాళ్లు పని మొదలుపెట్టారు. రాజేష్, నూపుర్లను వరుసగా 11, 13 నెంబరు బ్యారక్లలో ఉంచారు. వీటిలో వాళ్లతో పాటు 11, 35 మంది ఇతర ఖైదీలుంటారు.
రాజేష్ తల్వార్కు ఖైదీ నెంబర్ 9342, నూపుర్కు 9343 కేటాయించారు. వీళ్లిద్దరికీ జైల్లో వీఐపీ హోదా మాత్రం ఇవ్వడంలేదు. దంపతులిద్దరూ నవళ్లు చదవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. జైలుకు వచ్చేటప్పుడే నూపుర్ మూడు నవళ్లు తీసుకున్నారు. వార్తాపత్రికలు మాత్రం వాళ్లు చదవడంలేదని సూపరింటెండెంట్ శర్మ చెప్పారు.
వైద్య సహాయకునిగా రాజేష్, టీచర్గా నూపుర్ తల్వార్!!
Published Wed, Nov 27 2013 9:35 PM | Last Updated on Sat, Sep 2 2017 1:02 AM
Advertisement