సాక్షి, న్యూఢిల్లీ : ఆరుషి మృతి కేసులో దాదాపు నాలుగేళ్ల తర్వాత తల్వార్ దంపతులు జైలు జీవితం నుంచి విముక్తులయ్యారు. దస్న జైలు నుంచి బయటికొచ్చిన రాజేశ్, నుపుర్‌లు మీడియా వైపు కన్నెత్తి కూడా చూడకుండా వెళ్లిపోయారు. అయితే వారి స్పందన తెలుసుకుందామని యత్నిస్తున్న మీడియాకు రాజేశ్ సోదరుడు దినేశ్ మాత్రం ఓ విజ్ఞప్తి చేస్తున్నాడు.
‘‘కన్నకూతురి(ఆరుషి)ని కోల్పోయిన బాధ నుంచి ఆ దంపతులు బయటపడటం కష్టమే. కానీ, న్యాయం కోసం ఇన్నేళ్లుగా పోరాడిన వారు ఇప్పుడు మాములుగా మారేందుకు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మీడియాకు చేస్తున్న విన్నపం ఒక్కటే. దయచేసి వారికి కొంత సమయం ఇవ్వండి. కోలుకున్నాక వారే మీడియా ముందుకొచ్చి మాట్లాడతారు’’ అని దినేశ్ చెప్పారు.
తప్పు ఎవరు చేశారన్నది తేలకుండా ఆరోపణలు చేయటం సరికాదన్న ఆయన.. ఈ నాలుగేళ్లలో తమ కుటుంబం ఎన్నో భావోద్వేగాలను ఎదుర్కుందని అన్నారు. జైలుకి వెళ్లినప్పటి నుంచి కూడా ఆ దంపతులు కోరుకునేది ఒక్కటే. ఆరుషిపై పడ్డ మచ్చ(హేమరాజ్‌తో సంబంధాలు) చెరిగిపోవాలి. ఈ కేసులో నిజమేంటో తేలాలి. అందుకోసం ఊపిరి ఉన్నంతవరకు పోరాడతానని నా సోదరుడు(రాజేశ్) చెప్పాడు అని దినేశ్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఘజియాబాద్ జైలు నుంచి విడుదలైన తల్వార్ దంపతులు.. నోయిడా, జలవాయు విహార్‌లోని తమ ఇంట్లో కాకుండా.. నుపుర్ తల్లిదండ్రుల ఇంట్లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment