rajesh talwar
-
ఆరుషి కేసులో మీడియాకు రిక్వెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : ఆరుషి మృతి కేసులో దాదాపు నాలుగేళ్ల తర్వాత తల్వార్ దంపతులు జైలు జీవితం నుంచి విముక్తులయ్యారు. దస్న జైలు నుంచి బయటికొచ్చిన రాజేశ్, నుపుర్‌లు మీడియా వైపు కన్నెత్తి కూడా చూడకుండా వెళ్లిపోయారు. అయితే వారి స్పందన తెలుసుకుందామని యత్నిస్తున్న మీడియాకు రాజేశ్ సోదరుడు దినేశ్ మాత్రం ఓ విజ్ఞప్తి చేస్తున్నాడు. ‘‘కన్నకూతురి(ఆరుషి)ని కోల్పోయిన బాధ నుంచి ఆ దంపతులు బయటపడటం కష్టమే. కానీ, న్యాయం కోసం ఇన్నేళ్లుగా పోరాడిన వారు ఇప్పుడు మాములుగా మారేందుకు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మీడియాకు చేస్తున్న విన్నపం ఒక్కటే. దయచేసి వారికి కొంత సమయం ఇవ్వండి. కోలుకున్నాక వారే మీడియా ముందుకొచ్చి మాట్లాడతారు’’ అని దినేశ్ చెప్పారు. తప్పు ఎవరు చేశారన్నది తేలకుండా ఆరోపణలు చేయటం సరికాదన్న ఆయన.. ఈ నాలుగేళ్లలో తమ కుటుంబం ఎన్నో భావోద్వేగాలను ఎదుర్కుందని అన్నారు. జైలుకి వెళ్లినప్పటి నుంచి కూడా ఆ దంపతులు కోరుకునేది ఒక్కటే. ఆరుషిపై పడ్డ మచ్చ(హేమరాజ్తో సంబంధాలు) చెరిగిపోవాలి. ఈ కేసులో నిజమేంటో తేలాలి. అందుకోసం ఊపిరి ఉన్నంతవరకు పోరాడతానని నా సోదరుడు(రాజేశ్) చెప్పాడు అని దినేశ్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఘజియాబాద్ జైలు నుంచి విడుదలైన తల్వార్ దంపతులు.. నోయిడా, జలవాయు విహార్‌లోని తమ ఇంట్లో కాకుండా.. నుపుర్ తల్లిదండ్రుల ఇంట్లో ఉన్నారు. -
జైలు నుంచి తల్వార్ దంపతుల విడుదల
-
భద్రత కావాలి : జైలు నుంచి తల్వార్ దంపతుల విడుదల
సాక్షి, న్యూఢిల్లీ : ఆరుషి, హేమ్‌రాజ్‌ల హత్య కేసులో గడిచిన నాలుగేళ్లుగా శిక్ష అనుభవించిన రాజేశ్ తల్వార్, ఆయన భార్య నుపుర్ తల్వార్లు సోమవారం సాయంత్రం ఘజియాబాద్ దస్నా జైలు నుంచి విడుదలయ్యారు. జంటహత్య కేసులో వీరికి సీబీఐ కోర్డు విధించిన జీవితఖైదును అలహాబాద్ హైకోర్టు గత వారం రద్దుచేసిన సంగతి తెలిసిందే. వరుస సెలవుల కారణంగా వారి విడుదల మూడు రోజులు ఆలస్యమైంది. మాకు భద్రత కల్పించండి : జైలు నుంచి విడుదలైన తర్వాత తమపై ఎవరైనా దాడికి పాల్పడే అవకాశం ఉన్న కారణంగా పోలీస్ భద్రత కల్పించాలని తల్వార్ దంపతులు కోరినట్లు వారి తరఫు న్యాయవాది చెప్పారు. గతంలో అలహాబాద్ కోర్టు ప్రాంగణంలో రాజేశ్ తల్వార్‌పై కొందరు దాడికి పాల్పడిన నేపథ్యంలోనే వారు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. జైలు నుంచి ఆలయానికి! : ఆరుషి-హేమ్‌రాజ్‌ల హత్య మొదలు ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తల్వార్ దంపతుల విడుదల సందర్భంగా దస్పా జైలు వెలువల మీడియా కోలాహలం నెలకొంది. తల్వార్ దంపతులు జైలు నుంచి నేరుగా నోయిడాలోని సాయిబాబా ఆలయానికి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఆ ఇంటికి మాత్రం ఇప్పుడే కాదు : తమ కూతురు ఆరుషి, పనిమనిషి హేమ్రాజ్ హత్య జరిగిన ఇంటికి తల్వార్ దంపతులు ఇప్పుడప్పుడే వెళ్లే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఆ ఇంట్లో వేరేవాళ్లు అద్దెకుంటున్నారు. జల్వాయి విహార్‌లోని నుపుర్ తల్లిదండ్రుల ఇంట్లోనే కొన్నాళ్లు ఉండనున్నట్లు తర్వాల్ బంధువులు పేర్కొన్నారు. జైలులో సంపాదించిన రూ. 49,500 తీసుకోకుండానే.. : ప్రొఫెషనల్ డెంటిస్టులైన రాజేశ్, నుపుర్ తర్వార్లు తమ శిక్షా కాలంలో జైలు ఖైదీలు, సిబ్బంది, అధికారులకు వైద్యం చేశారు. ఇందుకుగానూ వారికి రూ.49,500 ఫీజుగా అందాల్సిఉందని, అయితే ఆ మొత్తాన్ని తీసుకునేందుకు తల్వార్ దంపతులు నిరాకరించారని దస్నా జైలర్ మయూరా చెప్పారు. విడుదలైన తర్వాత కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి జైలుకు వెళ్లి వైద్యం చేయాలని వైద్యదంపతులు నిర్ణయం తీసుకున్నారు. #WATCH: Rajesh & Nupur Talwar released from Ghaziabad's Dasna Jail after Allahabad HC acquitted them in 2008 Aarushi-Hemraj murder. pic.twitter.com/mSkoXbExFs — ANI (@ANI) 16 October 2017 -
జైలులో లాస్ట్ డే : ఖైదీల భారీ క్యూ..
ఘజియాబాద్ : కూతురుని హత్య చేసిన కేసులో నిర్దోషులుగా బయటపడిన రాజేశ్ తల్వార్, నుపుర్ తల్వార్ దంపతులు ఆదివారం దాస్నా జైలులో బిజీగా గడిపేశారు. స్వయంగా వారు దంతవైద్యులు కావడంతో జైలులోని క్లినిక్ ఆదివారం ఇతర ఖైదీలతో కిక్కిరిసిపోయింది. తమ దంత సమస్యలు చూపించుకునేందుకు జైలు సిబ్బందితోసహా బారులు తీరారు. దీంతో వారిద్దరు ఆదివారం విశ్రాంతి లేకుండా జైలులో గడిపారు. 'సాధారణంగా వైద్యులైన నుపుర్, రాజేష్ శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఆదివారం క్లినిక్ వచ్చేవాళ్లు కాదు. అయితే, ఈ ఆదివారమే వారికి చివరి రోజు కావడంతో ఆ విషయం తెలుసుకున్న ఖైదీలు పెద్ద మొత్తంలో క్లినిక్ వద్ద బారులు తీరారు. రాజేష్ పురుష ఖైదీలకు వైద్యం చేయగా నుపుర్ మహిళా ఖైదీలకు వైద్య సేవలు చేసింది' అని జైలు అధికారులు తెలిపారు. అలాగే, జైలు ఖైదీలతోపాటు పప్పు అన్నం తిన్నారని తెలిపారు. గతంలో ఫిబ్రవరి విచారణ సమయంలో కూడా తాము నిర్దోషులుగా బయటకు వచ్చినప్పటికీ వారానికో, రెండు రోజులకు ఒకసారి జైలులోని ఖైదీలకు వైద్యం చేస్తామని కూడా కోర్టుకు తెలిపారు. తమ కూతురు ఆరుషిని, పని మనిషి హేమ్ రాజ్‌ను హత్యచేసిన కేసులో వీరిద్దరు నిర్దోషులని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. దీంతో వారిద్దరు విడుదల కావాల్సి ఉండగా ఆదివారం కావడంతో ఆరోజంతా చివరిసారిగా జైలులో వారికి వైద్య సేవలు చేశారు. -
ఆరుషి హత్యకేసులో.. సినిమా డైరెక్టర్లా..!
అలహాబాద్ : ఒక ఆలోచన ఆధారంగా కథ అల్లుకుని, దానికి తగ్గట్లు సీన్లు రాసుకుని సినిమాను ఓ కొలిక్కితెస్తారు దర్శకులు. సంచలనాత్మక ఆరుషి-హేమ్రాజ్ హత్యకేసులోనూ సీబీఐ విచారణ కోర్టు(ట్రయల్ కోర్టు) న్యాయమూర్తి సరిగ్గా సినిమా దర్శకుడి మాదిరి ‘కథను కొలిక్కి తెచ్చేందుకు’ ప్రయత్నించారట!! ‘‘న్యాయమూర్తి సినిమా దర్శకుడిలా వ్యవహరించారు. అసలు హత్య చేసింది ఎవరు, ఎందుకు, ఎలా చేశారు అనే వాస్తవ విషయాలను పట్టించుకోకుండా చెల్లాచెదురుగా ఉన్న ఆధారాలనే నమ్మి, నిందితులకు జీవితఖైదు విధించారు’’ అని ఘజియాబాద్ సీబీఐ విచారణ కోర్టు న్యాయమూర్తిని ఉద్దేశించి అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు తీర్పు కాపీలో ఆసక్తికరమైన విషయాలను రాసుకొచ్చింది. 2008 నాటి నోయిడా జంట హత్యలపై గురువారం తీర్పును వెలువరించిన అలహాబాద్ హైకోర్టు.. జీవితఖైదును అనుభవిస్తోన్న ఆరుషి తల్లిదండ్రులు రాజేశ్ తల్వార్, నుపుర్ తర్వార్లను సంశయ లబ్ధి(బెనిఫిట్ ఆఫ్ డౌట్) కింద నిర్దోషులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దోషులను నిర్ధారించడంలో సీబీఐ పూర్తిగా విఫలం చెందిందని, ఆ అరకొర ఆధారాలనే నమ్మిన సీబీఐ న్యాయమూర్తి నిజానిజాలను విస్మరించారని హైకోర్టు ధర్మాసనం వాపోయింది. ప్రస్తుతం దస్నా జైలులో ఉన్న రాజేశ్, నుపుర్ తల్వార్లు శుక్రవారం మధ్యాహ్నం విడుదలయ్యే అవకాశం ఉంది. తొమ్మిదేళ్ల సుదీర్ఘకాలంలో ఊహించని మలుపులు తిరిగి దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన బాలిక ఆరుషి, వాచ్‌మన్ హేమరాజ్‌ల హత్య కేసులో దోషులెవరో ఇంకా తేలలేదు. ఈ కేసులో ఆమె తల్లిదండ్రులు నూపూర్ తల్వార్, రాజేష్ తల్వార్లే ప్రధాన నిందితులంటూ ఆరోపించిన సీబీఐ.. వారికి మరణశిక్ష విధించాలని వాదించింది. అయితే అందుకు తగ్గట్లు సందేహాతీతమైన, సహేతుకమైన సాక్ష్యాధారాలేవీ సీబీఐ సమర్పించ లేకపోయిందని ధర్మాసనం అభిప్రాయపడింది. కాగా, హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లేది లేదనిదీ త్వరలోనే ప్రకటిస్తామని సీబీఐ అధికారులు చెప్పారు. అసలేం జరిగింది ? ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో నివసిస్తోన్న డెంటిస్టు దంపతులు రాజేశ్- నుపుర్ తల్వార్ ఇంట్లో వారి కూతురు ఆరుషి(14 ఏళ్లు), పనిమనిషి హేమ్రాజ్(45 ఏళ్లు) దారుణ హత్యకు గురయ్యారు. 2008, మే 15 అర్ధరాత్రి తర్వాత ఈ ఉదంతరం చోటుచేసుకుంది. ఈ కేసును తొలుత దర్యాప్తు చేసిన ఉత్తరప్రదేశ్ పోలీసులుగానీ, అగ్రశ్రేణి దర్యాప్తు సంస్థగా అందరూ భావించే సీబీఐ సిబ్బందికానీ ఆదినుంచీ తప్పులు చేస్తూ పోయారు. మీడియాకు లీకులివ్వడంలో చూపిన ఉత్సాహంలో రవ్వంతైనా దర్యాప్తుపై చూపలేకపోయారు. ఉత్తరప్రదేశ్ పోలీసులు తొలుత ఆరుషిని వాచ్మాన్ హత్య చేసి పారిపోయి ఉంటాడని నిర్ధారణకొచ్చారు. ఆ ఇంటిపైనున్న గదిలో నివాసం ఉంటున్నా డన్నారు గనుక అక్కడ సోదా చేద్దామనుకున్నా ఆ గదికి దారితీసే మెట్లవైపు తలుపు తాళం వేసి ఉండటంతో దాన్ని విరమించుకున్నారు. హేమరాజ్ కోసం అంతటా వెతికి ఆచూకీ దొరక్కపోవడంతో చివరకు ఆ మర్నాడొచ్చి తలుపు తాళం బద్దలుకొట్టారు. తీరాచూస్తే అక్కడి టెర్రస్‌పైనే అతని శవం పడి ఉంది. ఆ పక్కనున్న గదిలో రక్తపు మరకలున్న దిండు దొరికింది. అనంతరకాలంలో ఆ రక్తపు మరకలు హేమరాజ్‌వేనని నిర్ధారణైంది. ఆరుషికి సంబంధించి మెడ కోసిన ఆనవాలు తప్ప నెత్తురొలికిన జాడలేదు. అంటే ఆ రక్తపు మరకల్ని ఎవరో శుభ్రం చేసి ఉండాలి. అలా చేసిందెవరో పోలీసులు తేల్చలేకపోయారు. తల్వార్ దంపతులే ఆ పని చేసి ఉండొచ్చునని భావించినా అందుకు ఎలాంటి ఆధా రాలనూ చూపలేకపోయారు. రాజేష్ తల్వార్ సహాయకుడు కృష్ణ, ఇంట్లో పనిచేసే రాజ్‌కుమార్, విజయ్‌మండల్ అనే మరో ఇద్దరు యువకుల్ని అదుపులోనికి తీసుకుని ప్రశ్నించారు. కానీ ఏమీ రాబట్టలేకపోయారు. ఈ కేసును సీబీఐకి అప్పగించినా ఫలితం లేకపోయింది. ఆరుషి కేసులో మొత్తం మూడు దర్యాప్తులు జరిగాయి. అందులో ఒకటి యూపీ పోలీసులది కాగా, మరో రెండింటిని సీబీఐకి చెందిన రెండు వేర్వేరు బృందాలు చేపట్టాయి. చిత్రమేమంటే– రెండూ వేర్వేరు నిర్ధారణలకొచ్చాయి. హత్య జరిగిన ప్రదేశాన్ని పోలీసులు వెనువెంటనే స్వాధీనం చేసుకోనందువల్ల నేరస్తుల వేలిముద్రలు, ఇతర ఆధారాలు చెదిరిపోయాయి. ఆరుషినీ, హేమ రాజ్‌నూ అభ్యంతరకర పరిస్థితుల్లో చూసిన తల్వార్ దంపతులు కోపం పట్టలేక ఆ బాలికను ‘పరువు హత్య’ చేశారని ఆరోపించినా ఆరుషి గదిలో ఆమె శవం మాత్రమే ఎందుకున్నదో, హేమరాజ్ శవం టెర్రస్‌పైకి ఎలా చేరిందో సీబీఐ చెప్పలేకపోయింది. ఆరుషి గదికి బయట తాళం వేసి ఉందని, దాని తాళం చెవి తల్వార్ దంపతుల దగ్గరే ఉంటుందని, వేరేవారెవరూ ఆ గదిలోకి వెళ్లే అవకాశం లేదని పోలీసులు న్యాయస్థానానికి నివేదించారు. కానీ గదికి వేరే తలుపు కూడా ఉందని, పైగా ఆరుషి గదిలోకి దుండగులు బాత్రూం ద్వారా ప్రవేశించి ఉండొచ్చునని తల్లిదండ్రులు చెప్పినదానికి వారి దగ్గర జవాబు లేదు. నార్కో అనాలిసిస్ పరీక్షలు సైతం ఉన్న గందరగోళాన్ని మరింత పెంచాయి. కృష్ణ, రాజ్‌కుమార్, విజయ్‌మండల్ నార్కో అనాలిసిస్ పరీక్షల్లో పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఎవరికి వారు మరొకరు ఈ హత్యకు కారకులని చెప్పారు. వారు చెప్పిన అంశాలతో సరిపోలే సాక్ష్యాధారాలేవీ పోలీసులకు లభించలేదు. తమ సచ్ఛీలత నిరూపించుకోవడానికి ఆరుషి తల్లిదండ్రులు కూడా అన్ని పరీక్షలకూ సిద్ధపడ్డారు. కానీ అందులో ఏమీ తేలలేదు. ఇలా ఈ కేసులో జవాబులేని ప్రశ్నలెన్నో ఉన్నాయి.. ఆరుషి హత్య కేసులో తల్లిదండ్రుల ప్రమేయం ఉన్నదని ‘నిరూపించడం’ కోసం ఆ కుటుంబాన్ని మీడియా బజారులో నిలబెట్టింది. అన్ని విలువలనూ వదిలిపెట్టి అనేక కథనాలను ప్రచారంలో పెట్టింది. రాజేష్ తల్వార్‌కు ఎవరితోనో వివాహేతర సంబంధం ఉన్నదని ఒక కథనం చెబితే... ఆ దంపతులు కుమార్తెను ఒంటరిగా వదిలి విందుల పేరుతో ఎక్కడెక్కడికో తిరిగి వచ్చేవారని మరో కథనం ఏకరువు పెట్టింది. తొలుత ఈ కేసును విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు కూడా ఇందులో ఎలాంటి ఆధారాలూ లభించలేదని అంగీకరించింది. కానీ ‘పరిస్థితులు పట్టి ఇచ్చే సాక్ష్యాల’ ఆధారంగా తల్లిదండ్రులను దోషులుగా నిర్ధారిస్తున్నట్టు 2013 నవంబర్‌లో తెలిపింది. చిత్రమేమంటే ఈ కేసులో తమకు ఎలాంటి సాక్ష్యాధారాలూ లభించలేదు గనుక కేసు మూసేయాలని 2010 డిసెంబర్లో న్యాయస్థానాన్ని సీబీఐ అభ్యర్థిస్తే అందుకు అభ్యంతరం చెబుతూ అప్పీల్‌కెళ్లింది తల్వార్ దంపతులే. తీరా మరో మూడేళ్లకు వారే నేరస్తులంటూ న్యాయస్థానం శిక్షించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు వరకూ వివిధ సందర్భాల్లో వారు సాగించిన పోరాటం, పడిన మనో వేదన అంతా ఇంతా కాదు. కుమార్తెను కోల్పోయి దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు ఓదార్పు లభించడం మాట అటుంచి ఊహించని ఇబ్బందులు చుట్టుముట్టాయి. చివరకు తొమ్మిదేళ్లకు వారిద్దరూ నిర్దోషులుగా బయటికొచ్చారు గానీ... తమ కుమార్తె ఉసురు తీసిందెవరో మాత్రం తెలియలేదు. మన దర్యాప్తు సంస్థల పని తీరుకు, మన న్యాయస్థానాల్లో ఏళ్ల తరబడి కేసులు సాగే వైనానికి ఆరుషి హత్య కేసు ఒక ఉదాహరణగా మిగిలిపోతుంది. -
ఆరుషి తల్లిదండ్రులు నిర్దోషులు
-
న్యాయం దక్కినట్టేనా?
తొమ్మిదేళ్ల సుదీర్ఘకాలంలో ఊహించని మలుపులు తిరిగి దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన ఢిల్లీ బాలిక ఆరుషి, వాచ్‌మన్ హేమరాజ్‌ల హత్య కేసు చివరకు దోషులెవరో తేలకుండానే ముగిసిపోయింది. ఈ కేసులో ఆమె తల్లిదండ్రులు నూపూర్ తల్వార్, రాజేష్ తల్వార్లే ప్రధాన నిందితులంటూ ఆరోపించిన సీబీఐ చివరకు దాన్ని నిరూపించలేకపోవడంతో... అలహాబాద్ హైకోర్టు గురువారం ఆ దంపతులిద్దరినీ ‘సంశయ లబ్ధి’ కింద విడుదల చేసింది. ఈ కేసును దర్యాప్తు చేసిన అధికారులు సందేహాతీతమైన, సహేతుకమైన సాక్ష్యాధారాలేవీ సమర్పించ లేకపోయారని ధర్మాసనం అభిప్రాయపడింది. దేశంలోనూ, వెలుపలా దర్యాప్తు సంస్థలకు సవాలుగా మారి, ఎన్నో సంక్లిష్టతలతో నిండి ఉన్న కేసుల తీరు తెన్నులను... వాటిని చాకచక్యంగా పరిష్కరించిన వైనాన్ని పోలీసు శిక్షణా సంస్థల్లో అధ్యయనం చేయిస్తారు. దర్యాప్తు ఎలా చేయకూడదో, సాక్ష్యాధారాల విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో, వాటినెంత ప్రాణప్రదంగా చూసుకోవాలో వివ రించడానికి ఆరుషి హత్య కేసును ఇప్పుడా జాబితాలో చేర్చక తప్పదు. ఎందుకంటే తొలుత దర్యాప్తు చేసిన ఉత్తరప్రదేశ్ పోలీసులుగానీ, అగ్రశ్రేణి దర్యాప్తు సంస్థగా అందరూ భావించే సీబీఐ సిబ్బందికానీ ఆదినుంచీ తప్పులు చేస్తూ పోయారు. మీడియాకు లీకులివ్వడంలో చూపిన ఉత్సాహంలో రవ్వంతైనా దర్యాప్తుపై చూపలేకపోయారు. ఉత్తరప్రదేశ్ పోలీసులు తొలుత ఆరుషిని వాచ్మాన్ హత్య చేసి పారిపోయి ఉంటాడని నిర్ధారణకొచ్చారు. ఆ ఇంటిపైనున్న గదిలో నివాసం ఉంటున్నా డన్నారు గనుక అక్కడ సోదా చేద్దామనుకున్నా ఆ గదికి దారితీసే మెట్లవైపు తలుపు తాళం వేసి ఉండటంతో దాన్ని విరమించుకున్నారు. హేమరాజ్ కోసం అంతటా వెతికి ఆచూకీ దొరక్కపోవడంతో చివరకు ఆ మర్నాడొచ్చి తలుపు తాళం బద్దలుకొట్టారు. తీరాచూస్తే అక్కడి టెర్రస్‌పైనే అతని శవం పడి ఉంది. ఆ పక్కనున్న గదిలో రక్తపు మరకలున్న దిండు దొరికింది. అనంతరకాలంలో ఆ రక్తపు మరకలు హేమరాజ్‌వేనని నిర్ధారణైంది. ఆరుషికి సంబంధించి మెడ కోసిన ఆనవాలు తప్ప నెత్తురొలికిన జాడలేదు. అంటే ఆ రక్తపు మరకల్ని ఎవరో శుభ్రం చేసి ఉండాలి. అలా చేసిందెవరో పోలీసులు తేల్చలేకపోయారు. తల్వార్ దంపతులే ఆ పని చేసి ఉండొచ్చునని భావించినా అందుకు ఎలాంటి ఆధా రాలనూ చూపలేకపోయారు. రాజేష్ తల్వార్ సహాయకుడు కృష్ణ, ఇంట్లో పనిచేసే రాజ్‌కుమార్, విజయ్‌మండల్ అనే మరో ఇద్దరు యువకుల్ని అదుపులోనికి తీసుకుని ప్రశ్నించారు. కానీ ఏమీ రాబట్టలేకపోయారు. ఈ కేసును సీబీఐకి అప్పగించినా ఫలితం లేకపోయింది. ఆరుషి కేసులో మొత్తం మూడు దర్యాప్తులు జరిగాయి. అందులో ఒకటి యూపీ పోలీసులది కాగా, మరో రెండింటిని సీబీఐకి చెందిన రెండు వేర్వేరు బృందాలు చేపట్టాయి. చిత్రమేమంటే– రెండూ వేర్వేరు నిర్ధారణలకొచ్చాయి. హత్య జరిగిన ప్రదేశాన్ని పోలీసులు వెనువెంటనే స్వాధీనం చేసుకోనందువల్ల నేరస్తుల వేలిముద్రలు, ఇతర ఆధారాలు చెదిరిపోయాయి. ఆరుషినీ, హేమ రాజ్‌నూ అభ్యంతరకర పరిస్థితుల్లో చూసిన తల్వార్ దంపతులు కోపం పట్టలేక ఆ బాలికను ‘పరువు హత్య’ చేశారని ఆరోపించినా ఆరుషి గదిలో ఆమె శవం మాత్రమే ఎందుకున్నదో, హేమరాజ్ శవం టెర్రస్‌పైకి ఎలా చేరిందో సీబీఐ చెప్పలేకపోయింది. ఆరుషి గదికి బయట తాళం వేసి ఉందని, దాని తాళం చెవి తల్వార్ దంపతుల దగ్గరే ఉంటుందని, వేరేవారెవరూ ఆ గదిలోకి వెళ్లే అవకాశం లేదని పోలీసులు న్యాయస్థానానికి నివేదించారు. కానీ గదికి వేరే తలుపు కూడా ఉందని, పైగా ఆరుషి గదిలోకి దుండగులు బాత్రూం ద్వారా ప్రవేశించి ఉండొచ్చునని తల్లిదండ్రులు చెప్పినదానికి వారి దగ్గర జవాబు లేదు. నార్కో అనాలిసిస్ పరీక్షలు సైతం ఉన్న గందరగోళాన్ని మరింత పెంచాయి. కృష్ణ, రాజ్‌కుమార్, విజయ్‌మండల్ నార్కో అనాలిసిస్ పరీక్షల్లో పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఎవరికి వారు మరొకరు ఈ హత్యకు కారకులని చెప్పారు. వారు చెప్పిన అంశాలతో సరిపోలే సాక్ష్యాధారాలేవీ పోలీసులకు లభించలేదు. తమ సచ్ఛీలత నిరూపించుకోవడానికి ఆరుషి తల్లిదండ్రులు కూడా అన్ని పరీక్షలకూ సిద్ధపడ్డారు. కానీ అందులో ఏమీ తేలలేదు. ఇలా ఈ కేసులో జవాబులేని ప్రశ్నలెన్నో ఉన్నాయి. ఆరుషి హత్య కేసులో తల్లిదండ్రుల ప్రమేయం ఉన్నదని ‘నిరూపించడం’ కోసం ఆ కుటుంబాన్ని మీడియా బజారులో నిలబెట్టింది. అన్ని విలువలనూ వదిలిపెట్టి అనేక కథనాలను ప్రచారంలో పెట్టింది. రాజేష్ తల్వార్‌కు ఎవరితోనో వివాహేతర సంబంధం ఉన్నదని ఒక కథనం చెబితే... ఆ దంపతులు కుమార్తెను ఒంటరిగా వదిలి విందుల పేరుతో ఎక్కడెక్కడికో తిరిగి వచ్చేవారని మరో కథనం ఏకరువు పెట్టింది. తొలుత ఈ కేసును విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు కూడా ఇందులో ఎలాంటి ఆధారాలూ లభించలేదని అంగీకరించింది. కానీ ‘పరిస్థితులు పట్టి ఇచ్చే సాక్ష్యాల’ ఆధారంగా తల్లిదండ్రులను దోషులుగా నిర్ధారిస్తున్నట్టు 2013 నవం బర్లో తెలిపింది. చిత్రమేమంటే ఈ కేసులో తమకు ఎలాంటి సాక్ష్యాధారాలూ లభించలేదు గనుక కేసు మూసేయాలని 2010 డిసెంబర్లో న్యాయస్థానాన్ని సీబీఐ అభ్యర్థిస్తే అందుకు అభ్యంతరం చెబుతూ అప్పీల్‌కెళ్లింది తల్వార్ దంపతులే. తీరా మరో మూడేళ్లకు వారే నేరస్తులంటూ న్యాయస్థానం శిక్షించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు వరకూ వివిధ సందర్భాల్లో వారు సాగించిన పోరాటం, పడిన మనో వేదన అంతా ఇంతా కాదు. కుమార్తెను కోల్పోయి దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు ఓదార్పు లభించడం మాట అటుంచి ఊహించని ఇబ్బందులు చుట్టుముట్టాయి. చివరకు తొమ్మిదేళ్లకు వారిద్దరూ నిర్దోషులుగా బయటికొచ్చారు గానీ... తమ కుమార్తె ఉసురు తీసిందెవరో మాత్రం తెలియలేదు. మన దర్యాప్తు సంస్థల పని తీరుకు, మన న్యాయస్థానాల్లో ఏళ్ల తరబడి కేసులు సాగే వైనానికి ఆరుషి హత్య కేసు ఒక ఉదాహరణగా మిగిలిపోతుంది. -
తీర్పు తర్వాత సీబీఐ రియాక్షన్ ఇదే
న్యూఢిల్లీ : దేశంలో సంచలనం సృష్టించిన ఆరుషి తల్వార్ కేసులో ఆమె తల్లిదండ్రులను నిర్దోషులుగా అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పడంపై సీబీఐ స్పందించింది. తీర్పునకు సంబంధించిన కోర్టు కాపీ తమకు ఇంకా అందలేదని, ఒకసారి అది అందిన తర్వాత పూర్తిగా చదివి విశ్లేషణ చేశాక ఈ కేసులో ముందుకు వెళతామని స్పష్టం చేసింది. ఆరుషి కేసును సీబీఐ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. గతంలో సీబీఐ ప్రత్యేక కోర్టే వారిని దోషులుగా ప్రకటించింది. అయితే, ఆ తీర్పును కొట్టేస్తూ తాజాగా ఆరుషి తల్లిదండ్రులైన నుపుల్ తల్వార్, రాజేష్ తల్వార్లను అలహాబాద్ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఇదిలా ఉండగా తాజా తీర్పుపై తల్వార్ దంపతులు ఆరుషి తాత కూడా స్పందించారు. తల్వార్ దంపతులు తమ బిడ్డ ఆరుషిని హత్య చేయలేదని తనకు ముందే తెలుసని ఆరుషి తాతయ్య అన్నారు. ఈ సందర్భంగా తాము హైకోర్టుకు ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పారు. ఇక తల్వార్ దంపతులు స్పందిస్తూ తమకు ఇప్పటికైనా న్యాయం జరిగిందని అన్నారు. -
ఆరుషి తల్లిదండ్రులు నిర్దోషులు
అలహాబాద్: తొమ్మిదేళ్ల క్రితం సంచలన రేపిన ఆరుషి తల్వార్, పనిమనిషి హేమ్రాజ్ హత్య కేసుల్లో అలహాబాద్ హైకోర్టు గురువారం కీలక తీర్పు చెప్పింది. ఈ కేసులో కింది కోర్టు దోషులుగా తేల్చిన ఆరుషి తల్లిదండ్రులు నుపుర్, రాజేశ్ తల్వార్లను హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. సమర్పించిన ఆధారాలు వారిద్దరిని దోషులుగా నిర్ధారించేందుకు సరిపోవని తేల్చింది. దంతవైద్యులైన తల్వార్ దంపతులు ఘజియాబాద్ దస్నా జైలు నుంచి శుక్రవారం విడుదల కానున్నారు. ఆరుషి, హేమ్రాజ్ హత్యకేసుల్లో 2013లో ఘజియాబాద్ సీబీఐ కోర్టు నుపుర్, రాజేశ్‌లకు జీవిత ఖైదు విధించింది. తీర్పు అనంతరం సీబీఐ స్పందిస్తూ.. హైకోర్టు తీర్పును పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని ప్రకటించింది. సీబీఐ కోర్టు తీర్పును సవాలు చేస్తూ తల్వార్ దంపతులు చేసిన అప్పీలును బెంచ్ సమర్థించింది. బెనిఫిట్ ఆఫ్ డౌట్(సంశయ లాభం)కింద అప్పీలుదారులకు అనుకూలంగా తీర్పునిచ్చేందుకు ఈ కేసు తగినదని హైకోర్టు వ్యాఖ్యానించింది. మాకు న్యాయం జరిగింది: తల్వార్ దంపతులు ఈ వార్త తెలియగానే తల్వార్ దంపతులు ఎంతో ఆనందించారని దస్నా జైలు జైలర్ దధిరామ్ మౌర్య పేర్కొన్నారు. తమకు న్యాయం జరిగిందని తల్వార్ దంపతులు పేర్కొన్నారని ఆయన చెప్పారు. ‘ రోజూలాగే వారిద్దరు తమ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. తీర్పు గురించి చెప్పగానే ఆనందబాష్పాలతో న్యాయం జరిగిందని నుపుర్ చెప్పారు’ అని మౌర్య తెలిపారు.విడుదల అనంతరం తల్వార్ దంపతులకు వ్యక్తిగత గోప్యత ఇవ్వాలని తల్వార్ దంపతుల తరఫు న్యాయవాది రెబెకా జాన్ కోరారు. నాడు సీబీఐకి అప్పగించిన మాయావతి గొంతు కోయడంతో మే 2008న నోయిడాలోని తన ఇంట్లో ఆరుషి(14) హత్యకు గురైంది. ఇంటి పనిమనిషి హేమ్రాజ్ మృతదేహాన్ని ఇంటి టెర్రస్‌పై కనుగొన్నారు. ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ అప్పట్లో ఉత్తరప్రదేశ్ పోలీసులపై తీవ్ర విమర్శలు తలెత్తాయి. అనంతరం అప్పటి ముఖ్యమంత్రి మాయవతి కేసును సీబీఐకి అప్పగించారు. అయితే సీబీఐ అధికారి అరుణ్ కుమార్ విచారణ తీరుపై విమర్శల నేపథ్యంలో కేసు విచారణను 2009లో మరో అధికారి నీలభ్ కిశోర్ చేపట్టారు. కేసులో మలుపులెన్నో.. ► మే 16, 2008: పడక గదిలో శవమై కనిపించిన ఆరుషి తల్వార్. పనిమనిషి హేమ్‌రాజ్‌పై అనుమానాలు ► మే 16, 2008: పడక గదిలో శవమై కనిపించిన ఆరుషి తల్వార్. పనిమనిషి హేమ్‌రాజ్‌పై అనుమానాలు ► మే 16, 2008: పడక గదిలో శవమై కనిపించిన ఆరుషి తల్వార్. పనిమనిషి హేమ్‌రాజ్‌పై అనుమానాలు ► మే 17: ఇంటి పై కప్పుపై హేమ్రాజ్ మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు ► మే 23: కేసులో ప్రధాన నిందితుడిగా ఆరుషి తండ్రి రాజేశ్ తల్వార్ అరెస్టు ► జూన్ 1: సీబీఐ చేతికి కేసు విచారణ ► జూన్ 13: తల్వార్ దంపతుల ఇంట్లో పనిచేసే కృష్ణను అరెస్టు చేసిన సీబీఐ ► డిసెంబర్ 29: తుది దర్యాప్తు నివేదికను ఘజియాబాద్ సీబీఐ కోర్టుకు సమర్పించిన సీబీఐ. తల్వార్ ఇంట్లో పనిచేసేవారికి క్లీన్చిట్.. ఆరుషి తల్లిదండ్రులపై అనుమానం ► ఫిబ్రవరి 9, 2011: సీబీఐ నివేదికను పరిగణనలోకి తీసుకుని ఆరుషి తల్లిదండ్రులపై హత్య, సాక్ష్యాధారాలు తారుమారు ఆరోపణలపై విచారణ కొనసాగించాలని సీబీఐ కోర్టు ఆదేశం ► నవంబర్, 2013: జంట హత్యల కేసులో రాజేశ్, నుపుర్‌లను దోషులుగా తేల్చిన ఘజియాబాద్ సీబీఐ కోర్టు.. జీవిత ఖైదు విధింపు ► సెప్టెంబర్ 7, 2017: దంపతుల అప్పీలుపై తీర్పును రిజర్వ్ చేసిన అలహాబాద్ హైకోర్టు ► అక్టోబర్ 12: రాజేశ్, నుపుర్ తల్వార్లను నిర్దోషులుగా విడుదల చేస్తూ హైకోర్టు తీర్పు -
'మా కూతురు హత్యపై మేమే పుస్తకం రాస్తున్నాం'
న్యూఢిల్లీ: తమ కూతురు హత్యపై ఒక పుస్తకం రాయడం ప్రారంభించామని దేశంలో సంచలనం సృష్టించిన ఆరుషి, పనిమనిషి హేమ్ రాజ్ హత్య కేసులో ప్రధాన నిందితులు ఆరుషి తల్లిదండ్రులు రాజేశ్ తల్వార్, నుపుర్ తల్వార్ అన్నారు. ఈ పుస్తకం ద్వారా వాస్తవాలు వెల్లడించాలని అనుకుంటున్నామని, అయితే, ఇది రాస్తున్నప్పుడు చెప్పలేని బాధగా అనిపించి ప్రస్తుతానికి పక్కకు పెట్టామని చెప్పారు. ఆ పుస్తకం పూర్తయితే దానిని చదివిన తర్వాతైన నిజనిజాలు తెలుసుకుంటారని చెప్పారు. తమ కూతురు ఆరుషి హత్య కేసులో ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్న వారిని ఓ మీడియా లేఖల ద్వారా ఇంటర్వ్యూ చేసింది. ఆరుషి హత్యపై పుస్తకం వచ్చింది, ఇప్పుడు ఓ సినిమా కూడా వస్తుంది, దీని ప్రభావం మీ కేసుపై ఉంటుందని అనుకుంటున్నారా అని ప్రశ్నించగా.. తాము కూడా జైలులో ట్రైలర్ చూశామని, ఆ చిత్రం రెండు వైపుల ఆలోచించి తీసినట్లు ఉందనిపిస్తుందని, కానీ, దుర్భుద్దితో సీబీఐ చేసిన విచారణ జోలికి వెళ్లనట్లు కనిపిస్తుందని తెలిపారు. ఎవరు ఏం సినిమా తీసినా నిజాలు ఉన్నా లేకున్నా తాము మాత్రం వాస్తవాలతో కూడిన పుస్తకాన్ని రాస్తున్నామని, కొంత బాధతోపాటు ప్రస్తుతం కేసులు, పిటిషన్ల వ్యవహారంతో బిజీగా ఉన్నందున త్వరలో దానిని పూర్తి చేసి నిజనిజాలు వివరిస్తామని తెలిపారు. సీబీఐ పక్షపాతంతో తమపై దర్యాప్తు జరిపిందని తెలిపారు. తమ బాధను ఎవరూ వినడం లేదని, తమ వైపే ఆలోచించకుండా దర్యాప్తు చేసి దోషులుగా సృష్టించారని చెప్పారు. తమ కూతురును కోల్పోయిన బాధలో ఉండగానే కేసులో ఇరికించి ముద్దాయిలుగా సృష్టించారని చెప్పారు. మీకు దేవుడి నమ్మకం ఉంటుందా అని ప్రశ్నించగా.. కొన్ని సార్లు తప్ప ఎక్కువగా నమ్మలేమని, కానీ ఒక విషయం నిజం అని నిరూపించడానికి ముఖ్యంగా విశ్వాసం, ఓపిక అనేవి ఒక వ్యక్తికి ఉండాలని సాయిబాబా చెప్పిన మాటలు నమ్ముతామని అన్నారు. తాము అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశామని, అది ఇంకా విచారణ ప్రారంభం కావాల్సి ఉందని తెలిపారు. -
బోనెక్కిన కడుపుతీపి!
విశ్లేషణ బొజ్జా తారకం, సీనియర్ న్యాయవాది కన్నకూతురు గొంతుకోసి చం పారనే అభియోగంపై ఘజియా బాద్ సెషన్స్ కోర్టు తల్లిదండ్రు లిద్దరికీ యావజ్జీవ కారాగారశిక్ష విధించింది. ఆరుషిని చంపిన రోజునే వాళ్లింట్లో పని వానిగా ఉన్న హేమ్రాజ్ని కూడా అదే మాదిరిగా గొంతుకోసి చంపా రనే అభియోగం మీద వారికి యావజ్జీవ కారాగారశిక్ష పడింది. వీటికి అదనంగా, ఆధా రాలను కనపడనీయకుండా చేశారని ఐదు సంవత్సరాల జైలు శిక్ష, పోలీసులను తప్పుదారి పట్టించినందుకు మరో రెండేళ్ల శిక్ష తండ్రిపై విధించి, జరిమానా కూడా విధించిం ది. అరుదైన కేసుల్లో అరుదైన కేసు కిందకి ఇది రాదని సెషన్స్ జడ్జి అభిప్రాయపడి మరణశిక్ష విధించలేదు. 2008లో జరిగిన ఈ రెండు హత్యలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. రాజేష్ తల్వార్, నూపూర్లకు ఆరుషి ఒక్క గానొక్క కూతురు. 14 ఏళ్ల వయస్సు. ఢిల్లీ పబ్లిక్ స్కూలు విద్యార్థిని. దంపతులిద్దరూ దంతవైద్యులు. ఉన్న ఒక్క కూతురినీ చంపారంటే ఎవరికీ నమ్మశక్యం కాలేదు. అనుమానాల రాత్రి... 2008 మే, 15న వారిని ఆఖరిగా చూసింది కారు డ్రైవర్. రాత్రి తాళాలు అప్పజెప్పి వెళ్లాడు. ఇంట్లో తల్వార్ దంపతులు, ఆరుషి, పని సహాయకుడు హేమ్రాజ్ -ఆ నలుగురే ఉన్నారు. ఆరుషి తన గదిలో, ఆమె తల్లిదండ్రు లు వారి గదిలో పడుకున్నారు. హేమ్రాజ్ అదే ఇంట్లో వేరే గదిలో పడుకున్నాడు. ఆరుషి తలుపు వేసుకుంటే తాళం దానంతట అదే పడిపోతుంది. తాళం లేకుండా లోపలి నుంచి తలుపు తీయవచ్చు గాని బయట నుంచి తీయాలం టే తాళం చెవి ఉండాలి. అది తల్వార్ దంపతుల వద్ద ఉంటుంది. 16 ఉదయం ఇంటి పని చేసే ఆమె వచ్చేటప్పటికి తలుపు తీసిలేదు. ఆమె బెల్ నొక్కింది. నూపూర్ వచ్చి తాళం చెవి కింద ఉందేమో చూడమని పంపిస్తూ, హేమ్ రాజ్ పాలు తేవటానికి వెళ్లి ఉంటాడని చెప్పింది. పని మనిషి కిందికి వెళ్లిందో లేదో ఆమెను మళ్లీ పైకి పిలిచి తాళం చెవి ఉన్నది రమ్మన్నది. ఆరుషి గది తెరిచి చూసే సరికి మంచం మీద చనిపోయి ఉన్నది. హేమ్రాజ్ కనబడ లేదు. ఆరుషి గొంతుకోసి ఉన్నది. ఆమె పెనుగులాడుతూ చనిపోయిన ఆనవాళ్లు లేవు. ఒక్కగా నొక్క కూతురు అంత దారుణంగా చంపబడి ఉంటే ఆరుషి తల్లిగాని తండ్రిగాని చలించలేదు. తల్లి కళ్లలో నుంచి ఒక్క చుక్క కూడా రాల లేదు. ఆరుషి శవాన్ని తుడిచినట్టు కనపడింది. రాజేష్ పోలీసు రిపోర్టు ఇచ్చాడు. తల్లిదండ్రులే... 17వ తేదీన హేమ్రాజ్ శవం అదే ఇంట్లో మేడపైన అట్ట పెట్టెలో కనపడింది. అతని గొంతుక కూడా కోసినట్టు ఉన్నది. కేసును సీబీఐకి అప్పగించారు. దర్యాప్తులో మరో ముగ్గురిని అనుమానించారు గాని తర్వాత విడిచి పెట్టే శారు. మొదటి బృందం చేసిన దర్యాప్తు సంతృప్తిగా లేదని రెండో బృందాన్ని నియమించారు. ఈ బృందం తల్వార్ దంపతులే హత్య చేసి ఉంటారని అనుకున్నారు గాని దర్యాప్తును ముగించమన్నారు. దానికి మేజిస్ట్రేట్ అంగీక రించక, దర్యాప్తు కొనసాగించమని ఉత్తరువు ఇచ్చాడు. దానిపై తల్వార్ దంపతులు హైకోర్టుకు వెళ్లారు. అక్కడ తల్వార్ దంపతులకు చుక్కెదురకాగా, సుప్రీం కోర్టుకు వెళ్లారు. సుప్రీం కోర్టు కూడా దర్యాప్తు జరగవలసిందేనని ఉత్తరువు ఇచ్చింది. చివరికి ఆ దంపతులే కూతుర్ని చంపా రని నిర్ధారించారు. ఏ కేసుకైనా ఆధారాలు, సాక్ష్యాలు ఉండాలి. ఆధారాలు దర్యాప్తు చేసే వారికి దొరుకుతాయి. సాక్ష్యాలు చూసిన వాళ్లు చెబుతారు. దీనిని ప్రత్యక్ష సాక్ష్యం అంటారు. రెండో దానిని పరిస్థితుల దృష్ట్యా సాక్ష్యం అంటారు. ఆరుషి కేసులో ప్రత్యక్ష సాక్ష్యాలు లేవు. నేరం చేసిన వారికి నోరు మెదపకుండా ఉండే హక్కు ఉన్నది. వాళ్లేమి మాట్లాడటం లేదు కాబట్టి వారే చేసి ఉంటారని నిర్ధారణకు వచ్చే ఆస్కారం లేదు. ఆధారాలతోనే... మరో ఆధారం చనిపోయిన వారిని ఆఖరిగా, ఎక్కడ, ఎవరు చూశారనేది. హత్యలు జరిగిన రాత్రి ఇంట్లో నలు గురే ఉన్నారు. ఐదో వ్యక్తి ప్రవేశించటానికి ఏ ఆస్కారమూ లేదు. తలుపులో, తాళమో బద్దలు గొట్టి ఎవరో ప్రవే శించారు అని చెప్పటానికి కూడా ఆస్కారం లేదు. హేమ్ రాజ్ శవం తన గదిలో కాక మేడపైన కనపడింది. ఎవరో మెట్ల మీద నుంచి పైకి లాక్కొని వెళ్లి ఉంటారు. అయితే మెట్ల మీదగాని, ఆరుషి మంచం మీద గాని రక్తపు మర కలు లేవు. హత్య జరిగిన స్థలాన్ని శుభ్రం చేశారు. ఇంట్లో ఉన్న నలుగురిలో ఇద్దరు చనిపోయారు. మిగిలిన ఇద్దరూ హత్య ఆనవాళ్లు లేకుండా తుడిచివేశారు. ఆరుషి మర్మావ యంలో తెల్లని ద్రవం కారిన ఆనవాళ్లున్నాయి. ఇద్దరి శరీ రంపై కట్టెతో కొట్టిన దెబ్బలు ఉన్నాయి. రాజేష్ తల్వార్ దగ్గర ఉండే గోల్ఫ్ కట్టెలలో ఒకటి కనపడలేదని దర్యా ప్తులో తేలింది. అది రాజేశ్ తర్వాత తెచ్చి ఇచ్చాడు. దాని పైనా రక్తపు మరకలు లేవు. ఆరుషి, హేమ్‌రాజ్‌ల గొంతు కోసిన పరికరం వైద్యులు శస్త్ర చికిత్సకు వాడే పదునైన అం చుగల కత్తి. వాటినీ జప్తు చేశారు. ఆ ఇద్దరి వైపే... ప్రత్యక్ష సాక్ష్యం లేకపోయినా హత్య కేసులో శిక్ష వేయవచ్చని సుప్రీంకోర్టు ఎన్నోసార్లు చెబుతూ వస్తు న్నది. అయితే ఆధారాలు గట్టిగా ఉండాలి. కోర్టు ముం దుకు తెచ్చే సందేహాలు హేతుబద్ధమైనవిగా ఉండాలి. కేసులో వచ్చే పరిస్థితులన్నీ ఒక గొలుసులా పేర్చాలి. ఏ ఒక్క లింకూ తప్పిపోకూడదు, తెగిపోకూడదు. ‘మను షులు అబద్ధమాడవచ్చు కాని పరిస్థితులు అబద్ధం చెప్ప వు’ అనేది మరో న్యాయసూత్రం. ఇంట్లో నలుగురే ఉండ టం, బయట నుంచి ఎవరూ రావటానికి ఆస్కారం లేకపో వటం, హేమ్రాజ్ శవాన్ని ఎవరో మేడ మీదికి లాక్కొని వెళ్లటం, ఆరుషి మంచం మీద చనిపోయి ఉండటం, ఆ ఇద్దరి గొంతులూ పదునైన పరికరంతో కోసి ఉండటం, హేమ్రాజ్ పాలు తేవడానికి వెళ్లాడని చెప్పటం, తల్లిదం డ్రుల అసహజ ప్రవర్తన- ఇటువంటివే హంతకులు తల్లి దండ్రులే అని చూపుతున్నాయి. సెషన్స్ జడ్జి తన తీర్పుకు ఇరవై ఆరు ప్రధానమైన ఆధారాలు చూపారు. ధర్మసందే హాలకు తాలులేదని కూడా పేర్కొన్నారు. హత్యలు చేయ టానికి ఉద్దేశమేమిటో జడ్జి నిర్ధారించలేదు. పరిస్థితుల ఆధారంగా తేల్చిన సందర్భంలో హత్య చేయటానికి ఉద్దేశ మేమిటో చెప్పాలి. అయితే ఉద్దేశం చెప్పనంత మాత్రాన ఇతర పరిస్థితులపై ఆధారపడిన సాక్ష్యాన్ని తిరస్కరించ టానికి వీలులేదని సుప్రీం కోర్టు చాలాసార్లు చెబుతూ వస్తున్నది. తల్వార్ దంపతుల ప్రవర్తన జడ్జికి ఎన్నో అనుమానాలు రేపింది. వేరే ఎవరైనా హత్యలు చేసి వెళ్లిపోయారంటే ఆ దాఖలాలు లేవు. హత్య చేసి ఆధారాలు దొరక్కుండా వెళ్లి పోయారనుకుంటే, మరి హేమ్రాజ్ శవం మేడ మీదికి ఎలా వెళ్లింది? అట్ట పెట్టెలో ఎవరు పెట్టారు? ఆరుషి ఒంటిమీద రక్తపు మరకలు ఏవీ లేకుండా తుడిచి శుభ్రం చేసి తెల్లటి దుప్పటి కప్పిందెవరు? ఇవన్నీ చేయటం లోపల ఉన్నవారికే సాధ్యంకాని బయటివాళ్లకు కాదు. వీటికి సంతృప్తికరంగా తల్వార్ దంపతులు న్యాయ స్థానం ముందు సమాధానం చెప్పుకోలేకపోయారు కాబట్టి వారిని దోషులని నిర్ధారించటానికి వీలులేదు. ఎందుకంటే మౌనంగా ఉండిపోయే హక్కు ముద్దాయిలకు ఉంటుంది. కాని కొన్ని పరిస్థితులను చెప్పగలగటం ముద్దాయిల పరిధిలోనే ఉంటుంది, వాటి వివరాలు ముద్దాయిలకు మాత్రమే తెలుస్తాయి. అటువంటి సంద ర్భాలలో ముద్దాయిలు మౌనంగా ఉండటాన్ని కోర్టులు అంగీకరించవు. అయితే నేర నిరూపణ బాధ్యత ప్రాసిక్యూ షన్ మీదనే ఉంటుంది. కాని కొన్ని సందర్భాలలో ఒక విష యం ఎలా జరిగిందో, జరిగి ఉంటుందో చెప్పటం సాధ్యం కాదు. అటువంటి సందర్భాలలో ‘‘ఇది ఇలా జరిగి ఉం టుందనే అభిప్రాయానికి’’ రావచ్చు. దీనిని చట్టం అంగీక రించింది. దీనినే సుప్రీంకోర్టు ఎన్నోసార్లు సమర్థించింది. ఈ సూత్రాల ఆధారంగా తల్వార్ దంపతులను సెషన్స్ జడ్జి దోషులుగా ధృవీకరించారు. ఈ కేసు ఓ సవాలు... జడ్జి కూడా మానవమాత్రుడే. అతనికీ కొన్ని సిద్ధాంతాలు, కొన్ని ఉద్దేశాలు, ప్రపంచం, సమాజం పట్ల కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఆయన ఏ సమాజం నుంచి వచ్చాడో ఆ సమాజపు విలువలు వెంటాడుతూ ఉంటా యి. జడ్జి చూసేది భారతీయ సమాజంలో వస్తున్న కేసు లు. జడ్జి పరిశీలించేది ఆంగ్ల న్యాయసూత్రాల ఆధారంగా ఏర్పడిన పద్ధతి. ఈ రెండూ చాలాసార్లు పరస్పరం సంఘర్షించుకుంటాయి. అటువంటి సందర్భాలలో జడ్జి ఎటూ తేల్చుకోలేక ‘‘ధర్మ సందేహాల’’కు అతీతంగా నేరం నిరూపణ కాలేదనే న్యాయసూత్రాన్ని ఆశ్రయిస్తాడు. ‘‘ఒక నిర్దోషికి శిక్ష వేయటం కంటే వెయ్యి మంది దోషులను విడిచిపెట్టేయటం మంచిదనే’’ ధర్మసూత్రం ప్రకారం దోషిని విడిచిపెట్టేస్తారు. ఆరుషి కేసు విచారించిన జడ్జికి ఏ ధర్మసందేహమూ రాలేదు. అందుకనే తల్వార్ దంపతు లకు యావజ్జీవ కారాగారశిక్ష విధించాడు. ఆయన తీర్పు కోసం ఆధారపడిన న్యాయసూత్రాలను, సాక్ష్యాధారాలను పైకోర్టులు ఎలా పరిశీలిస్తాయో చూడాలి. ఆరుషి కేసు దర్యాప్తు విభాగానికి, న్యాయ విచారణా విభాగానికి, సాక్ష్యాధారాల నిర్ణయ విధానాలకు ఓ సవాలు. ఈ కేసు మన న్యాయ సూత్రాలను పునర్విమర్శించుకోవలసిన అవసరాన్ని ఎత్తి చూపుతుంది. -
తల్వార్ దంపతుల ఆదాయం రోజుకు 40
ఘజియాబాద్: జంట హత్యల కేసులో జైలుపాలైన దంతవైద్య దంపతులు రాజేశ్, నూపుర్ తల్వార్లు డాస్నా కారాగారంలో రోజుకు రూ. 40 సంపాదిస్తున్నారు. ఈ విషయాన్ని సదరు కారాగారానికి చెందిన ఓ అధికారి గురువారం వెల్లడించారు. వాస్తవానికి కారాగారం పాలు కాకముందు వీరిరువురి ఆదాయం రోజుకు రూ. 4,000 పైమాటే. ఇదిలా ఉండగా ఇద్దరి బ్యారక్‌లు ఒకదాని పక్కన మరొకటి ఉన్నప్పటికీ ప్రతిరోజూ కలుసుకోలేకపోతున్నారు. వారానికి ఓ రోజు నలభై నిమిషాల పాటు కబుర్లు చెప్పుకుంటున్నారు. వీరిరువురినీ 11, 13 నంబర్ బ్యారక్‌లలో ఉంచిన సంగతి విదితమే. రాజేశ్ తల్వార్ 9,342 నంబరు ఖైదీ కాగా నూపుర్‌కు 9,343 నంబరును కేటాయించారు. ఈ విషయమై డాస్నా కారాగార సూపరింటెండెంట్ వీరేశ్ రాజ్‌శర్మ మాట్లాడు తూ కారాగారం ఆవరణలోని ఉద్యానవనంలో 40 నిమిషాలు మాట్లాడుకునేందుకు వారిద్దరికీ అవకాశమిచ్చామన్నారు. వారికి కారాగార నియమనిబంధనల ప్రకారం దుస్తులు ఇచ్చామన్నారు. కాగా కుమార్తె ఆరుషి, పనిమనిషి హేమరాజ్ హత్య కేసులో దోషులుగా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిర్ధారించడంతో డీలాపడిపోయిన రాజేశ్, నూపుర్ తల్వార్లు ఆ రోజు కారాగారంలో భోజనం చేసేందుకు నిరాకరించారు. ఆ మరుసటి రోజు న్యాయస్థానం జీవితఖైదు శిక్ష విధించినప్పటికీ శాంతించారు. కాగా వీరివురిలో రాజేశ్ దంత వైద్యుడిగా పనిచేస్తూ కారాగారంలో దంతపరమైన సమస్యలను ఎదుర్కొంటున్న వారికి సేవలందించాల్సి ఉంటుంది. ఇందుకుగాను ఆయనకు రోజుకు రూ. 40 చెల్లిస్తారు. ఇక నూపుర్‌కు ఖైదీల పిల్లలను చదివించే బాధ్యతలను అప్పగించారు. -
వైద్య సహాయకునిగా రాజేష్, టీచర్‌గా నూపుర్ తల్వార్!!
యావజ్జీవ జైలు శిక్ష పడిన తల్వార్ దంపతులు జైల్లో కొత్త పాత్రలు పోషిస్తున్నారు. రాజేష్ తల్వార్‌కు జైలు ఆస్పత్రిలో సీనియర్ వైద్యులకు సహాయకుని బాధ్యతలు అప్పగించగా, నూపుర్ తల్వార్‌కు టాచర్ పని అప్పగించారు. వీళ్లిద్దరూ బాగా ఉన్నత విద్యావంతులు కావడంతో వాళ్లకు తగిన పని అప్పజెప్పాలన్న ఉద్దేశంతో ఈ బాధ్యతలు ఇచ్చారు. ఇందుకు గాను వారిద్దరికీ జైలు నిబంధనల ప్రకారం తగిన వేతనం కూడా చెల్లిస్తామని ఘజియాబాద్ జైలు సూపరింటెండెంట్ వీరేష్ రాజ్ శర్మ తెలిపారు. వాళ్లు ఒక్క ఆదివారం తప్ప మిగిలిన అన్ని రోజుల్లోనూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది. బుధవారం నాడే వాళ్లు పని మొదలుపెట్టారు. రాజేష్, నూపుర్‌లను వరుసగా 11, 13 నెంబరు బ్యారక్‌లలో ఉంచారు. వీటిలో వాళ్లతో పాటు 11, 35 మంది ఇతర ఖైదీలుంటారు. రాజేష్ తల్వార్‌కు ఖైదీ నెంబర్ 9342, నూపుర్‌కు 9343 కేటాయించారు. వీళ్లిద్దరికీ జైల్లో వీఐపీ హోదా మాత్రం ఇవ్వడంలేదు. దంపతులిద్దరూ నవళ్లు చదవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. జైలుకు వచ్చేటప్పుడే నూపుర్ మూడు నవళ్లు తీసుకున్నారు. వార్తాపత్రికలు మాత్రం వాళ్లు చదవడంలేదని సూపరింటెండెంట్ శర్మ చెప్పారు. -
ఆరుషి కేసు చెప్పే గుణపాఠం!
అయిదున్నరేళ్లపాటు ఎన్నెన్నో మలుపులు తిరిగిన ఆరుషి తల్వార్ హత్య కేసు చివరకు ఆమె తల్లిదండ్రులు నూపూర్ తల్వార్, రాజేష్ తల్వార్లకు యావజ్జీవ శిక్ష పడటంతో విషాదకరమైన ముగింపునకు చేరింది. దంపతులిద్దరూ ఢిల్లీ సమీపంలోని నోయిడాలో పేరుపొందిన దంత వైద్యులు. ఎగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. వారి ఇంట్లో 2008 మే 15 రాత్రి అప్పటికి 13 ఏళ్ల బాలికైన ఆరుషి, హేమరాజ్ అనే నౌకరు హత్యకు గురయ్యారు. ఆ మర్నాడు ఉదయంనుంచి ఆ జంట హత్యల చుట్టూ రకరకాల కథనాలు అల్లుకున్నాయి. మొదట దర్యాప్తు చేసిన ఉత్తరప్రదేశ్ పోలీసులు, అటు తర్వాత దాన్ని స్వీకరించిన సీబీఐ...ఆ క్రమంలో తమకు వినబడిన ప్రతి అంశాన్నీ ఎప్పటికప్పుడు మీడియాకు లీక్ లివ్వడం, వాటి ఆధారంగా మీడియాలో పుంఖానుపుంఖాలుగా కథనాలు వెలువడటం సాగిపోయింది. దర్యాప్తు ఎలా చేయకూడదో తెలుసుకోవడానికి ఆరుషి హత్య కేసు బలమైన ఉదాహరణ. యూపీ పోలీసులుగానీ, అటు తర్వాత దర్యాప్తును స్వీకరించిన సీబీఐగానీ దర్యాప్తును సక్రమంగా సాగించడంలో విఫలమయ్యారు. సాధారణ పోలీసులకు హత్య కేసుల దర్యాప్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన లేకపోవడాన్ని అర్ధం చేసుకోవచ్చు గానీ అగ్రశ్రేణి దర్యాప్తు సంస్థగా పేరున్న సీబీఐ వ్యవహరణ తీరు కూడా అలాగే ఉంది. ఇద్దరూ మీడియాకు లీకులివ్వడంలో చూపించిన ఉత్సాహంలో కాస్తయినా దర్యాప్తు విషయంలో ప్రదర్శించలేదు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లభించనందున కేవలం ‘పరిస్థితులు పట్టి ఇచ్చే సాక్ష్యాల’ ఆధారంగా తల్లిదండ్రులిద్దరినీ దోషులుగా నిర్ధారిస్తున్నట్టు సోమవారం తీర్పు వెలువరించిన సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శ్యాంలాల్ ప్రకటించాల్సివచ్చింది. వైద్య పరమైన నైపుణ్యం ఉన్నవారే చేయగలిగే రీతిలో ఆరుషి గొంతు నరం కోసివున్నదన్న ప్రాసిక్యూషన్ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. దంపతులిద్దరూ సాక్ష్యాలను నాశనం చేసిన కేసులో కూడా దోషులని తేల్చారు. ఈ కేసును ఆద్యంతం పరిశీలించినప్పుడు దిగ్భ్రాంతికరమైన అంశాలు వెల్లడవుతాయి. సాధారణంగా నేరం చేసినవారు అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను ఏదో ఒక మేరకు వదిలివెళ్తారంటారు. ఈ కేసులో అలాంటివన్నీ లేకుండాపోయాయి. అందుకు మొదటగా తప్పుబట్టాల్సింది యూపీ పోలీసులనే. జంట హత్యల విషయం వెల్లడైన వెంటనే వచ్చిన పోలీసులు నేరం జరిగిన ప్రదేశాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకోలేదు. చుట్టుపక్కలవారంతా అక్కడ యధేచ్ఛగా తిరిగారు ఈ క్రమంలో నేరస్తుల వేలిముద్రలవంటి విలువైన సాక్ష్యాధారాలన్నీ చెదిరిపోయాయి. తొలుత కేవలం ఆరుషి మృతదేహం ఒక్కటే లభించింది. మరో మృతుడు హేమరాజ్ ఏమయ్యాడన్నది అప్పటికి తెలియలేదు. ఆ ఇంటిపైనే ఉన్న ఒక గదిలో అతను ఉంటున్నాడని తల్వార్ దంపతులు చెప్పినా ఆ గదికి దారితీసే మెట్ల వద్ద ఉన్న తలుపు తాళం వేసివున్నదని వారు ఊరుకున్నారు. ఆ తాళం బద్దలుకొట్టి వెళ్తే హేమరాజ్‌కు సంబంధించిన సాక్ష్యాలు దొరుకుతాయని వారి ఊహకు అందలేదు. చివరకు మర్నాడొచ్చి తాళం బద్దలుకొట్టారు. తీరా చూస్తే హేమరాజ్ శవం అక్కడపడివుంది. ఇవన్నీ ఇలాపోగా తల్వార్ దంపతులపైనా, వారి కుమార్తెపైనా ఎన్నో కథలు ప్రచారంలోకొచ్చాయి. అందులో రాజేష్ తల్వార్ ప్రవర్తన మంచిది కాదని, ఆయనకు ఇంకెవరితోనో సంబంధాలున్నాయన్న కథనం ఒకటి. ఆరుషినీ, హేమరాజ్నూ ‘అభ్యంతరకరమైన’ పరిస్థితుల్లో చూసిన తల్వార్ దంపతులు కోపం పట్టలేక పోయారని, అందుకే ఆరుషిని ‘పరువు హత్య’చేశారని మరో కథనం. ఇద్దరినీ ‘అభ్యంతరకర పరిస్థితుల్లో’ చూసినప్పుడు వచ్చిన ఆవేశంలో హత్యకు పూనుకుంటే ‘వైద్యపరమైన నైపుణ్యం’ ఉన్నవారు మాత్రమే చేయగలిగినంత ఒడుపుగా ఆరుషిని తల్లిదండ్రులు ఎలా చంపగలిగారు? అసలు ఆ గదిలోనే ఉండాల్సిన హేమరాజ్ శవం...పైనున్న అతని గది ముందు ఎలా పడివున్నట్టు? మీడియాలో వచ్చిన కథనాల సంగతలా ఉంచి ఈ కేసు దర్యాప్తు ఎన్నెన్నో మలుపులు తీసుకుంది. మొదట ముద్దాయిలుగా తేలినవారు ఆ తర్వాత కేసు నుంచి విముక్తులయ్యారు. మొదట దర్యాప్తుచేసిన సీబీఐ బృందానికీ, తర్వాత దర్యాప్తు చేసిన బృందానికీ లభించిన ఆధారాల్లో వైరుధ్యాలున్నాయి. కేసు దర్యాప్తులో భాగంగా తల్వార్ దంపతులపైనా, ఇతర నిందితులపైనా ఎన్నో పరీక్షలు జరిగాయి. ఇందులో పాలీగ్రాఫ్, బ్రెయిన్ మ్యాపింగ్, లైడిటెక్టర్, నార్కో అనాలిసిస్ పరీక్షలున్నాయి. అన్నిటిలోనూ దంపతులిద్దరికీ నేరం గురించి తెలియదన్న నిర్ధారణ జరిగింది. ఇవే పరీక్షల్లో అనుమానితుడిగా తేలిన రాజేష్ తల్వార్ సహాయకుడు కృష్ణ తర్వాత కాలంలో సీబీఐ దర్యాప్తులో నిర్దోషిగా తేలితే, ఆ పరీక్షల్లో అనుమానితులు కాని తల్వార్ దంపతులు ముద్దాయిలయ్యారు. చిత్రమేమంటే ఈ కేసులో తగిన సాక్ష్యాధారాలు లభించలేదు గనుక దీన్ని మూసేయడానికి అనుమతించమని కోర్టును సీబీఐ 2010 డిసెంబర్లో అభ్యర్థించినప్పుడు దానికి వ్యతిరేకంగా అప్పీల్ చేసింది తల్వార్ దంపతులే. 2010లో కేసు మూసివేత కోరిన సంస్థే మూడేళ్లు గడిచేసరికల్లా ‘మరణశిక్ష విధించదగిన’ నేరమని న్యాయస్థానం ముందు ఎలా వాదించగలిగిందో అనూహ్యం. మొత్తానికి దర్యాప్తు క్రమంలో పోలీసులు, సీబీఐ వ్యవహరించిన తీరువల్ల ఈ కేసులో నిర్ధారణ అయిన అంశాలకంటే అనుమానాలే ఎక్కువున్నాయి. కీలకమైన అంశాలు కొన్నిటిని కోర్టునుంచి సీబీఐ దాచిపెట్టిందని, అందువల్లే తల్వార్ దంపతులకు అన్యాయం జరిగిందని వారి న్యాయవాదులు అంటున్నారు. అప్పీల్‌కు వెళ్తే న్యాయం లభిస్తుందన్న విశ్వాసంతో ఉన్నారు. ఇది మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ఈ కేసు నేర్పిన గుణపాఠంతోనైనా దర్యాప్తు సంస్థలు తమ నైపుణ్యానికి మెరుగులు దిద్దుకోవాలి. -
తల్వార్ దంపతులకు జీవితఖైదు
ఘజియాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి హత్య కేసులో దోషులుగా తేలిన రాజేశ్, నూపుర్ తల్వార్ దంపతులకు సీబీఐ కోర్టు మంగళవారం జీవితఖైదు శిక్ష విధించింది. జంట హత్యలకు సంబంధించిన ఈ కేసును అత్యంత అరుదైనదిగా పరిగణించి దోషులకు ఉరిశిక్ష విధించాలన్న సీబీఐ తరఫు వాదనలను కోర్టు తోసిపుచ్చింది. పద్నాలుగేళ్ల తమ కుమార్తె ఆరుషి, ఇంటి పనిమనిషి హేమరాజ్ హత్య కేసులో వైద్య దంపతులు రాజేశ్(49), నూపుర్(48)లను కోర్టు సోమవారం దోషులుగా తేల్చిన సంగతి తెలిసిందే. శిక్ష ఖరారుపై మంగళవారం కేవలం ఐదు నిమిషాల పాటు వాదనలు సాగాయి. అనంతరం అదనపు సెషన్స్ జడ్జి శ్యామ్‌లాల్.. సాయంత్రం 4.30 గంటల సమయంలో తల్వార్ దంపతులకు జీవిత ఖైదు శిక్షను ఖరారు చేస్తూ తీర్పును వెలువరించారు. సాక్ష్యాలను ధ్వంసం చేసినందుకు దంపతులిద్దరికీ మరో ఐదేళ్ల కారాగార శిక్ష, ఎఫ్ఐఆర్ నమోదు సందర్భంగా పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు రాజేశ్‌కు అదనంగా మరో ఏడాది జైలు శిక్ష విధించారు. ఈ కేసులో పక్కా సాక్ష్యాలు లేకపోవడంతో జడ్జి ప్రాసంగిక సాక్ష్యం (సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్)పై ఆధారపడ్డారు. నేరం జరిగిన చోట పరిస్థితులను ఆధారంగా చేసుకొని పోలీసులు చెప్పిన 26 కారణాలను పరిగణనలోకి తీసుకున్నారు. అంతకుముందు సీబీఐ తరఫున ఆర్కే సైనీ వాదిస్తూ.. అత్యంత కిరాతకంగా ఇద్దరిని హతమార్చిన తల్వార్ దంపతులకు మరణశిక్షే సరైనదని అన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును అత్యంత అరుదైనదిగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. తల్వార్ దంపతుల తరఫున తన్వీర్ మిర్ వాదిస్తూ.. నిందితులకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాలు లేవని, అందువల్ల వారిపై దయ చూపాలని కోరారు. ఏయే సెక్షన్ల కింద శిక్షలు.. ఐపీసీ సెక్షన్ 302(హత్య), 201(సాక్ష్యాల ధ్వంసం), 34(ఉమ్మడి నేర లక్ష్యం) కింద రాజేశ్, నూపుర్ దంపతులకు శిక్ష ఖరారు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. వీటితోపాటు పనిమనిషి హేమ్‌రాజే తన కూతురు ఆరుషిని హత్య చేశాడని పోలీసులకు చెప్పినందుకు రాజేశ్‌ను సెక్షన్ 203 కింద దోషిగా తేల్చినట్లు స్పష్టంచేసింది. సెక్షన్ 302 ప్రకారం దంపతులకు జీవితఖైదుతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తున్నట్లు కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. జరిమానా కట్టని పక్షంలో ఆరు నెలలపాటు అదనంగా జైలు శిక్ష అనుభవించాలని తెలిపింది. అలాగే సెక్షన్ 201 ప్రకారం ఐదేళ్ల కఠిన కారాగారం, రూ.5 వేల జరిమానా విధించింది. రాజేశ్ ఒక్కడికి సెక్షన్ 203 కింద ఏడాది జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా ఖరారు చేసింది. వివిధ సెక్షన్ల కింద ఖరారు చేసిన ఈ శిక్షలన్నింటినీ ఏకకాలంలో అమలు చేయాలని జడ్జి తన ఉత్వర్వుల్లో స్పష్టంచేశారు. హైకోర్టులో సవాలు చేస్తాం.. సీబీఐ కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను అలహాబాద్ హైకోర్టులో సవాలు చేస్తామని తల్వార్ దంపతుల తరఫు న్యాయవాదులు తెలిపారు. ‘‘ఇది సరైన తీర్పు కాదు. దీన్ని కచ్చితంగా పైకోర్టులో సవాలు చేస్తాం. రాజేశ్ దంపతులను కావాలని ఇందులో ఇరికించారు’’ అని వారి తరఫు న్యాయవాది రెబెక్కా జాన్ తెలిపారు. ఈ కేసు విచారణలో సీబీఐ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, కావాలనే తల్వార్ దంపతులను వేధించిందని ఆమె చెప్పారు. ఈ కేసులో సీబీఐ మీడియాకు ఒక వాదననే వినిపిస్తూ లీకులు ఇచ్చిందని తల్వార్ దంపతుల తరఫు మరో న్యాయవాది సత్యకేతు శర్మ ఆరోపించారు. మీడియా ముందు లాయర్ల తన్నులాట తీర్పు వెలువడ్డ వెంటనే కోర్టు ఆవరణలో మీడియాకు వివరాలు వెల్లడించేందుకు లాయర్లు పోటీపడ్డారు. టీవీ కెమెరాల ముందే తన్నులాటకు దిగారు. ఒకరినొకరు తోసుకుంటూ దూషించుకున్నారు. ఇంతకూ వీరు అటు తల్వార్ దంపతుల తరఫు న్యాయవాదులు కాదు.. ఇటు సీబీఐ తరఫు న్యాయవాదులు కాదు! తీర్పు అనంతరం నరేష్ యాదవ్ అనే లాయర్ ముందుగా వచ్చి చానెళ్లతో మాట్లాడడం మొదలుపెట్టారు. ఈయన గతంలో సీబీఐకి సహాయ లాయర్‌గా పనిచేశారు. నరేష్ మాట్లాడుతున్న సమయంలో ఆయన వెనకాలే నిలబడ్డ సంజయ్ త్యాగి... మరో లాయర్ కూడా మాట్లాడేందుకు యత్నించారు. దీంతో నరేష్ వ్యక్తిగత భద్రత సిబ్బంది ఒకరు సంజయ్ నుదుటిపై తుపాకీ ఎక్కుపెట్టాడు. మా లాయర్ మాట్లాడుతుంటే ఎందుకు అడ్డుకుంటున్నావంటూ బూతు పురాణం ఎత్తుకున్నాడు. చివరికి ఇరు వర్గాలు ఒకరినొకరు నెట్టుకుంటూ పిడిగుద్దులు కురిపించుకున్నారు. కాసేపటికి వేరేవారు వచ్చి సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. -
'ఆరుషి హత్యకు సంబంధించిన ఆధారాలు సీబీఐ వద్ద లేవు'
సంచలనం రేపిన ఆరుషి జంట హత్యకేసులో కోర్టు వెల్లడించిన తీర్పుకు విరుద్దంగా, సీబీఐ విచారణకు వ్యతిరేకంగా ఆరుషి స్నేహితురాలు ఫిజా ఝా వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ హత్యకేసులో నిజమైన దోషులను శిక్షించినపుడే ఆరుషికి తగిన న్యాయం జరుగుతుంది అని అన్నారు. అంతేకాకుండా ఆరుషి తల్లితండ్రులకు శాంతి చేకూరుతుంది అని ఫిజా అభిప్రాయపడింది. జంట హత్యల కేసులో ఆరుషి తల్లితండ్రులు రాజేశ్, నుపూర్ తల్వార్ దంపతులకు ఘజియాబాద్ కోర్టు యావజ్జీవ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆరుషి హత్యకు సంబంధించి సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, పరిస్థితుల డిమాండ్ మేరకే సీబీఐ వ్యవహరించిందని ఫిజా వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో అనుమానితులను అరెస్ట్ చేయాలనే ఓకే కారణంతో తల్వార్ దంపతులను అరెస్ట్ చేశారని, ఆరుషి కేసులో న్యాయం చేయడానికి ఎవరూ ప్రయత్నించలేదని ఫిజా ఆవేదన వ్యక్తం చేసింది. -
ఆరుషి హత్యకేసులో రాజేశ్ తల్వార్ దంపతులకు యావజ్జీవ శిక్ష
-
ఆరుషి తల్లిదండ్రులకు యావజ్జీవ శిక్ష
ఆరుషి జంట హత్యల కేసులో దోషులుగా తేలిన ఆమె తల్లిదండ్రులకు యావజ్జీవ శిక్ష పడింది. న్యాయస్థానం మంగళవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు వారికి శిక్ష ఖరారు చేసింది. అయిదున్నరేళ్లుగా సాగిన ఈ కేసు విచారణపై సోమవారం తుది తీర్పు వెల్లడించిన ఘజియాబాద్ సీబీఐ కోర్టు... ఆరుషి తల్లిదండ్రులు నూపూర్ తల్వార్, రాజేష్ తల్వార్లను దోషులుగా తేల్చింది. రాజేష్ దంపతులే ఆరుషితో పాటు పనిమనిషి హేమరాజ్‌ను దారుణంగా హత్య చేశారని పేర్కొంది. దోషులుగా తేలిన రాజేష్ దంపతులకు మరణశిక్ష విధించాలని సీబీఐ వాదించింది. ఇది అత్యంత అరుదైన కేసుగా పేర్కొన్న సీబీఐ... దోషులకు మరణశిక్షే సరైందని వాదనలు వినిపించింది. అయితే శిక్ష తగ్గించాలని తల్వార్ దంపతుల తరుపు న్యాయవాది అభ్యర్థించారు. ఇరు పక్షాల వాదనలు విన్న సీబీఐ కోర్టు దోషులకు యావజ్జీవ శిక్ష విధించింది. కోర్టు తీర్పు విన్న ఆరుషి తల్లిదండ్రులు నిశ్చేష్టులయ్యారు. కాగా తీర్పును హైకోర్టులో సవాల్ చేసేందుకు నూపూర్ తల్వార్ దంపతులు సిద్ధం అవుతున్నారు. కాగా పద్నాలుగేళ్ల తమ కుమార్తె ఆరుషి, పనిమనిషి హేమరాజ్‌ల హత్య కేసులో దంతవైద్య నిపుణులు రాజేశ్, నూపుర్ తల్వార్ దంపతులను స్థానిక సీబీఐ ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో శిక్షల ఖరారుపై నేడు కూడా వాదనలు జరిగాయి. నోయిడాలోని వారి ఇంట్లో 2008 మే 15 రాత్రి జరిగిన ఈ జంట హత్యలకు సంబంధించిన సాక్ష్యాలను నాశనం చేయడానికి సంబంధించి కూడా అదనపు సెషన్స్ జడ్జి శ్యామ్‌లాల్ వారిని దోషులుగా పేర్కొన్నారు. దర్యాప్తు సందర్భంగా ఎన్నో ఆసక్తికరమైన మలుపులు తిరిగిన ఈ కేసులో ఐదేళ్లకు పైగా సుదీర్ఘ విచారణ అనంతరం ఎట్టకేలకు సోమవారం తీర్పు వెలువడింది. హత్యలపై నోయిడా పోలీస్‌స్టేషన్‌లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఐపీసీ సెక్షన్ 203 కింద ఆరుషి తండ్రి రాజేశ్ తల్వార్‌ను కోర్టు దోషిగా తేల్చింది. సంచలనం కలిగించిన ఆరుషి, హేమరాజ్‌ల హత్య కేసులో తీర్పు వెలువడనున్నందున పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఆరుషిని.. కన్నవారే కడతేర్చారు
ఆరుషి, హేమరాజ్‌ల హత్య కేసులో ప్రత్యేక కోర్టు తీర్పు రాజేశ్, నూపుర్లు సాక్ష్యాలను కూడా నాశనం చేసినట్లు నిర్ధారణ నేడు వాదనల అనంతరం శిక్షల ఖరారు హైకోర్టులో అప్పీల్ చేస్తామన్న నిందితులు ఘజియాబాద్: పద్నాలుగేళ్ల తమ కుమార్తె ఆరుషి, పనిమనిషి హేమరాజ్‌ల హత్య కేసులో దంతవైద్య నిపుణులు రాజేశ్, నూపుర్ తల్వార్ దంపతులను స్థానిక సీబీఐ ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో శిక్షల ఖరారుపై మంగళవారం వాదనలు జరగనున్నాయి. నోయిడాలోని వారి ఇంట్లో 2008 మే 15 రాత్రి జరిగిన ఈ జంట హత్యలకు సంబంధించిన సాక్ష్యాలను నాశనం చేయడానికి సంబంధించి కూడా అదనపు సెషన్స్ జడ్జి శ్యామ్‌లాల్ వారిని దోషులుగా పేర్కొన్నారు. దర్యాప్తు సందర్భంగా ఎన్నో ఆసక్తికరమైన మలుపులు తిరిగిన ఈ కేసులో ఐదేళ్లకు పైగా సుదీర్ఘ విచారణ అనంతరం ఎట్టకేలకు సోమవారం తీర్పు వెలువడింది. హత్యలపై నోయిడా పోలీస్‌స్టేషన్‌లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఐపీసీ సెక్షన్ 203 కింద ఆరుషి తండ్రి రాజేశ్ తల్వార్‌ను కోర్టు దోషిగా తేల్చింది. ఉదయం కోర్టు రెండుసార్లు వాయిదా పడిన తర్వాత.. ఈ నెలాఖరులో పదవీవిరమణ చేయనున్న జడ్జి శ్యామ్‌లాల్ మధ్యాహ్నం 3.25 ప్రాంతంలో కోర్టు హాలులోకి ప్రవేశించారు. సంచలనం కలిగించిన ఆరుషి, హేమరాజ్‌ల హత్య కేసులో తీర్పు వెలువడనున్నందున పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితులను కోర్టు హాలులోకి పిలిపించిన న్యాయమూర్తి తీర్పును చదివి వినిపించారు. నిందితులిద్దరూ ఒకే లక్ష్యంతో హత్యలకు పాల్పడ్డారని జడ్జి తెలిపారు. ఐపీసీ సెక్షన్ 302 రెడ్ విత్ 34, 201 రెడ్ విత్ 34 కింద వారిని దోషులుగా నిర్ధారిస్తున్నట్టు వెల్లడించారు. మంగళవారం వాదనలు ముగిసిన తర్వాత జడ్జి శిక్షలు ఖరారు చేస్తారు. నోయిడాలో ప్రముఖులైన ఈ డాక్టర్ దంపతులు సోమవారం జడ్జి తీర్పు వెలువరించగానే కన్నీటితో కుప్పకూలిపోయారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. తీర్పు ప్రకటించిన వెంటనే తల్వార్ దంపతుల తరఫున ఓ ప్రకటన వెలువడింది. తామెంతో నిరాశకు గురయ్యామని, చేయని నేరానికి దోషులుగా నిర్ధారించబడినందుకు తమ హృదయం గాయపడిందని వారు పేర్కొన్నారు. ఓడిపోయినట్టుగా భావించేం దుకు నిరాకరిస్తున్నామని, న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. చట్ట ప్రకారం ఈ తీర్పు తప్పని, దీనిపై హైకోర్టులో అప్పీల్ దాఖలు చేస్తామని వారి తరఫు న్యాయవాది సత్యకేతు సింగ్ చెప్పారు. పనిమనుషులపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని ఈ తీర్పుతో స్పష్టమై పోయిందని వారిలో ఒకరి తరఫు న్యాయవాది చెప్పారు. తొలుత క్లీన్చిట్ ఇచ్చిన సీబీఐ ఇవి పరువు హత్యలనే వార్తల నేపథ్యంలో ఈ కేసుకు ప్రాధాన్యత ఏర్పడింది. తొమ్మిదో తరగతి విద్యార్థి అయిన తమ కుమార్తె నేపాల్‌కు చెందిన 45 ఏళ్ల హేమరాజ్తో సంబంధం పెట్టుకుందనే ఆగ్రహంతో ఆమె తల్లిదండ్రులే ఈ హత్యలకు పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆరుషిని ఆమె తండ్రే హత్య చేశాడని అప్పటి ఇన్స్పెక్టర్ జనరల్ గురుదర్శన్ సింగ్ ఆరోపించడంతో నోయిడా పోలీసులు రాజేశ్ తల్వార్‌ను అరెస్టు చేశారు. కేసును సీబీఐకి అప్పగించిన కొంత కాలానికి ఆయన బెయిల్‌పై విడుదల అయ్యారు. విచిత్రంగా సీబీఐ తొలుత తల్వార్ దంపతులకు క్లీన్చిట్ ఇచ్చింది. ముగ్గురు పనిమనుషులు కృష్ణ, రాజ్‌కుమార్, విజయ్‌లపై నింద మోపింది. పోలీసులు వారిని అరెస్టు చేశారు. అయితే మూడు నెలల గడువులోగా చార్జిషీటు దాఖలు చేయడంలో సీబీఐ విఫలమైంది. దాంతో వారు బెయిల్‌పై విడుదలయ్యారు. తర్వాత అప్పటి సీబీఐ డెరైక్టర్ కేసును తాజాగా దర్యాప్తు చేసేందుకు కొత్త బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆరుషి హత్య కేసులో తల్లిదండ్రుల పాత్రపై అనుమానాలు ఉన్నప్పటికీ వాటిని నిరూపించే ప్రత్యక్ష ఆధారాలేవీ లేవని పేర్కొంటూ సీబీఐ కేసు ముగింపు నివేదికను దాఖలు చేసింది. దీన్ని పరిశీలించిన సీబీఐ జడ్జి తల్వార్ దంపతులపై హత్యాభియోగాలు మోపాల్సిందిగా ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే నూపుర్ తల్వార్ కూడా అరెస్టు అయ్యారు. ఆ తర్వాత సుప్రీం ఆదేశాలతో ఆమె బెయిల్‌పై విడుదలయ్యా రు. 15 నెలల విచారణ అనంతరం ఎట్టకేలకు సోమవారం 204 పేజీలతో తీర్పు వెలువడింది. ఈ కేసులో సీబీఐ వైఖరిపై అడిగిన ప్రశ్నకు ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది ఆర్.కె.సైని సమాధానమిస్తూ.. దర్యాప్తు అనేది నిరంతర ప్రక్రియ అని, చివరకు కోర్టులో దాఖలు చేసిన నివేదికనే తుది నిర్ణయంగా భావించాలని చెప్పారు. ఈ కేసులో గరిష్టంగా జీవిత ఖైదు విధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. చాలా అరుదైన కేసుల్లో మాత్రమే హత్యానేరానికి మరణశిక్ష విధించడం జరుగుతుంది. తీర్పుపై అలహాబాద్ హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు రాజేశ్ తల్వార్ సోదరుడు దినేశ్ విలేకరులకు చెప్పారు. కోర్టు తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. చట్టానికి ఎవరూ అతీతులు కారనే ందుకు ఇది నిదర్శనమని మహిళా కాంగ్రెస్ నేత శోభా ఓఝా వ్యాఖ్యానించారు. ‘‘తమ పిల్లలకు ఉత్తమ సంరక్షకులు వారి తల్లిదండ్రులే. మానవ నైజ క్రమం ఇదే. కానీ మానవాళి చరిత్రలో తల్లీ, తండ్రే తమ పిల్లల హంతకులైనటువంటి అసహజ, విచిత్ర సంఘటనలు కూడా ఉన్నాయి. జీవితంలో కేవలం 14 వసంతాలు మాత్రమే చూసిన తమ కుమార్తెను వారు నాశనం చేశారు’’ అని జడ్జి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బైబిల్లోని 10 ఆజ్ఞల్లో ఒక దానిని (‘నరహత్య చేయరాదు’ (దొ షల్ నాట్ కిల్), ఖురాన్‌లోని ఓ నిషేధాజ్ఞ (‘దేవుడు పవిత్రంగా చేసినవాటి ప్రాణాలు తీయరాదు’ (టేక్ నాట్ లైఫ్ విచ్ గాడ్ హాజ్ మేడ్ సేక్రెడ్)ను గుర్తు చేశారు. ఎప్పుడేం జరిగింది... 2008 మే 16: గొంతు కోయడంతో ఆరుషి తన పడకగదిలో ప్రాణాలు కోల్పోయి కన్పించింది. మే 17: తల్వార్ ఇంటి టైపై హేమరాజ్ మృతదేహం కన్పించింది. మే 23: జంట హత్యల ఆరోపణలతో రాజేశ్ తల్వార్ అరెస్టు మే 31: సీబీఐ కేసు దర్యాప్తు చేపట్టింది. జూలై 12: రాజేశ్ తల్వార్‌కు బెయిలు. 2010 డిసెంబర్ 29: సీబీఐ క్లోజర్ రిపోర్ట్ దాఖలు 2011 ఫిబ్రవరి 9: సీబీఐ క్లోజర్ రిపోర్టును తిరస్కరించిన ప్రత్యేక కోర్టు. రాజేశ్, నూపుర్ తల్వార్ల విచారణకు ఆదేశం. రాజేశ్, నూపుర్ తల్వార్లకు బెయిలబుల్ వారంట్ల జారీ 2012 ఏప్రిల్ 30: నూపుర్ తల్వార్ అరెస్టు సెప్టెంబర్ 25: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బెయిల్‌పై నూపుర్ విడుదల 2013 ఏప్రిల్: తల్వార్ దంపతులు ఆరుషి, హేమరాజ్‌లను చంపినట్టుగా కోర్టుకు సీబీఐ నివేదన. నవంబర్ 12: కోర్టు తీర్పు రిజర్వ్ నవంబర్ 25: రాజేశ్, నూపుర్ తల్వార్లు దోషులుగా నిర్ధారణ -
సంచలనాల కేసు
న్యూఢిల్లీ:తరచూ వివాదాస్పదంగా మారడం, దర్యాప్తులో వైఫల్యం, మీడియా జోక్యం తదితర అంశాల కారణంగా ఆరుషి, హేమ్రాజ్ హత్యోదంతం దేశవిదేశాల్లో చర్చనీయాంశంగా మారడం తెలిసిందే. ఇంతగా సంచలనం సృష్టించిన ఈ కేసుపై సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శ్యాంలాల్ సోమవారం ప్రకటించిన తీర్పులో తల్లిదండ్రులే దోషులని ప్రకటించారు. వీరికి మంగళవారం శిక్ష ఖరారు చేస్తామని పేర్కొనడంతో పోలీసులు తల్వార్లను ఘజియాబాద్‌లోని దస్నా జైలుకు తరలించారు. తమ 14 ఏళ్ల కూతురు ఆరుషి, నౌకరు హేమ్‌రాజ్‌ను (45) ఆమె తల్లిదండ్రులు రాజేశ్, నూపుర్ గొంతుకోసి హతమార్చారని సీబీఐ బలంగా వాదించింది. 2008, మే 16న ఈ హత్యలు జరగడం తెలిసిందే. కేసు దర్యాప్తు పోలీసుల నుంచి సీబీఐకి చేతికి వెళ్లడం, నౌకర్ల ప్రమేయంపై వార్తలు రావడం, తరచూ కీలక మలుపులు సంభవించడంతో దీనిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఆరుషి హేమ్రాజ్ ‘అభ్యంతరకర’ స్థితిలో కనిపించడాన్ని సహించలేక తల్లిదండ్రులే హతమార్చారని దర్యాప్తు అధికారులు వాదించారు. దర్యాప్తులో లోపాలు, మీడియా జోక్యం కారణంగా తాము ఈ కేసులో ఇరుక్కుపోయామని తల్వార్ దంపతులు మొదటి నుంచి పేర్కొన్నారు. అయితే వీళ్లు నేరం చేసినట్టు నిరూపించగల ఫోరెన్సిక్, భౌతిక సాక్ష్యాలేవీ తమ వద్ద లేవని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది. ఆరుషి, హేమరాజ్ మరణానికి ముందు తల్వార్ దంపతులతో కనిపించారు కాబట్టే ఈ నిర్ణయానికి వచ్చామన్న సీబీఐ వాదనతో ప్రత్యేక కోర్టు ఏకీభవించింది. ఐదేళ్ల క్రితం.. 2008 మే 16 తెల్లవారుజామున ఆరుషి మృతదేహం వారి పడక గదిలోనే కనిపించింది. ఇంటి నౌకరు హేమ్రాజ్ కనిపించకపోవడంతో అతడే హంతకుడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మరునాడు హేమ్రాజ్ మృతదేహం డాబాపై కనిపించడం కేసు కీలక మలుపు తిరిగింది. అతని గొంతుపై కత్తిగాట్లు, తలపై బలమైన గాయం ఉంది. దీంతో పోలీసులు రాజేశ్ తల్వార్‌ను అరెస్టు చేశారు. ఇది పరువుహత్యగా భావిస్తున్నట్టు ప్రకటించారు. అయితే పోలీసులపై దర్యాప్తుపై తీవ్ర విమర్శలు రావడంతో, అప్పటి ముఖ్యమంత్రి మాయావతి ఈ కేసును సీబీఐకి అప్పగించారు. రంగంలోకి దిగిన సీబీఐ మొదట రాజేశ్‌ను అరెస్టు చేసింది. తదనంతరం అతని ఉద్యోగితోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేసింది. దర్యాప్తులో ఎటువంటి బలమైన సాక్ష్యాలూ లభించకపోవడంతో అందరూ బెయిల్‌పై విడుదలయ్యారు. పేలవమైన దర్యాప్తు, పలువురు జర్నలిస్టులను ఆ ఇంట్లోకి అనుమతించడంతో ఘటనాస్థలంలోని ఆధారాలు మాయమయ్యాయి. దీంతో అప్పటి సీబీఐ డెరైక్టర్ అశ్వనీకుమార్ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని నియమించారు. తల్వార్ దంపతులే హత్యలకు కారకులని ఈ బృందం స్పష్టం చేసింది. హత్య జరిగిన 19 నెలల తరువాత అంటే ఈ నెల 12న కోర్టు విచారణ ముగిసింది. ఆరుషి తల్లిదండ్రులే దోషులని నిరూపించడానికి సీబీఐ 90 మంది సాక్షులను ప్రవేశపెట్టింది. ఊహాజనిత కారణాలతోనే సీబీఐ ఈ నిర్ధారణకు వచ్చిందని తల్వార్ దంపతులు మొదటి నుంచి వాదించారు. కోర్టు వద్ద భారీ భద్రత సంచలనం సృష్టించిన కేసు కావడంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఘజియాబాద్ కోర్టు వద్ద సోమవారం భారీ భద్రతను ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా మీడియాను కూడా కోర్టు గదిలోకి అనుమతించలేదు. పోరాటం కొనసాగిస్తాం: సీబీఐ కోర్టు తీర్పు వినగానే తల్వార్ దంపతులు కోర్టు గదిలోనే విలపించారు. తాము అమాయకులమని, న్యాయపోరాటం కొనసాగిస్తామని కాసేపటికి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. నూపుర్ తల్వార్ సోదరి వందన కూడా ఇదే మాట చెప్పారు. సీబీఐ దర్యాప్తు లోపభూయిష్టమని కోర్టు బయట విలేకరులకు స్పష్టం చేశారు. అబద్ధాలన్నింటినీ అల్లి సీబీఐ వాదనలను వినిపించిందని ఆరోపించారు. సీబీఐ న్యాయవాది ఆర్కే సైనీ స్పందిస్తూ ప్రాసంగిక సాక్ష్యాల ఆధారంగానే కోర్టు తల్వార్లను దోషులగా తేల్చిందన్నారు. తల్వార్ల న్యాయవాది రెబెక్కా మాట్లాడుతూ పైకోర్టులో తమకు తప్పక న్యాయం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎప్పడేం జరిగింది 2008, మే 16: ఆరుషి ఇంట్లోనే ఆమె మృతదేహం కనిపించింది. గొంతు కోసి ఆమెను చంపినట్టు తేలింది. నౌకరు హేమ్‌రాజే హంతకుడని భావించారు. మే 17: తల్వార్ భవంతి డాబాపై హేమ్రాజ్ మృతదేహం కూడా కనిపించింది. మే 18: శస్త్రచికిత్సలకు వినియోగించే కత్తులతో హత్యలు చేశారని పోలీసుల ప్రకటన. ఇంట్లోని వారిపైనే అనుమానాలున్నాయని వెల్లడి. మే 23: ఆరుషి తండ్రి రాజేశ్ తల్వార్ అరెస్టు మే 31: కేసు దర్యాప్తు సీబీఐ చేతికి జూన్ 13: తల్వార్ల కాంపౌడర్లు కృష్ణ, రాజేశ్‌ను సీబీఐ అరెస్టు చేసింది. తల్వార్ల పొరుగింట్లో పనిచేసే విజయ్ మండల్‌ను కూడా మరో పది రోజుల తరువాత అరెస్టు చేశారు. జూలై 12: సాక్ష్యాల లేమి కారణంగా ఘజియాబాద్ కోర్టు రాజేశ్‌కు బెయిల్ ఇచ్చింది. జనవరి 5: తల్వార్ దంపతులకు నార్కో పరీక్షలు నిర్వహించాలని కోర్టును సీబీఐ కోరింది. డిసెంబర్ 29: కోర్టుకు కేసు ముగింపు నివేదిక సమర్పణ. తగిన సాక్ష్యాధారాలు లేనప్పటికీ రాజేశే ప్రధాన నిందితుడని ప్రకటన 2011, జనవరి 25: ఘజియాబాద్ కోర్టు పరిసరాల్లో రాజేశ్‌పై దాడి జరిగింది. ఫిబ్రవరి 9: సీబీఐ ముగింపు నివేదికను తిరస్కరించిన ప్రత్యేక కోర్టు తల్వార్ దంపతులపై దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది. సాక్ష్యాలను ధ్వంసం చేసినట్టు కూడా తల్వార్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2012, మార్చి 14: రాజేశ్ బెయిల్ రద్దు కోరుతూ సీబీఐ వాదనలు వినిపించింది. ఏప్రిల్ 30: నూపుర్ తల్వార్ అరెస్టు మే 3: నూపుర్ బెయిల్‌ను సెషన్స్‌కోర్టు తిరస్కరించింది మే 25: నిందితులపై ఘజియాబాద్ కోర్టు హత్య, సాక్ష్యాల విధ్వంసం, కుట్ర అభియోగాలు నమోదు చేసింది. సెప్టెంబర్ 25: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నూపుర్‌కు బెయిల్ 2013, ఏప్రిల్: తల్వార్లే ఆరుషి, హేమ్‌రాజ్‌ను చంపారని సీబీఐ వాదించింది. హత్యకు ముందు ఆరుషి, హేమ్రాజ్ ‘అభ్యంతరకర స్థితి’ కనిపించారని కోర్టుకు తెలిపింది. మే 3: సీబీఐ మాజీ జేడీ అరుణ్‌కుమార్ సహా 14 సాక్షుల హాజరు కోసం సమన్లు జారీ చేయాలన్న డిఫెన్స్ న్యాయవాది విజ్ఞప్తిని సీబీఐ వ్యతిరేకించింది. మే 6: డిఫెన్స్ న్యాయవాది అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. తల్వార్ దంపతుల వాంగ్మూలాల నమోదుకు ఆదేశించింది. అక్టోబర్ 18: సీబీఐ తన వాదనలను ముగించింది. తల్వార్లు తమను తప్పుదోవ పట్టించారని కూడా తెలిపింది. నవంబర్ 12: న్యాయమూర్తి తన నిర్ణయాన్ని ఈ నెల 25కు వాయిదా వేశారు. నవంబర్ 25: రాజేశ్, నూపుర్ తల్వార్ దోషులేనని న్యాయమూర్తి ప్రకటన. శిక్షను మంగళవారం ఖరారు చేస్తామని వెల్లడి. -
తల్లితండ్రులే ఆరుషిని చంపేశారు
న్యూఢిల్లీ: ఆరుషి, పని మనిషి హేమ్రాజ్ హత్య కేసులో ఆరుషి తల్లిదండ్రులు తల్వార్ దంపతులే దోషులని ఘజియాబాద్ కోర్టు తీర్పు చెప్పింది. అయితే దోషులకు శిక్షలను కోర్టు రేపు ఖరారు చేస్తుంది. అయిదున్నరేళ్లుగా అనేక మలుపులు తిరుగుతూ సాగిన ఆరుషి హత్య కేసులో ఎట్టకేలకు ఈ రోజు కోర్టు తీర్పు చెప్పింది. వీరిని పోలీసులు కస్టడిలోకి తీసుకున్నాను. -
హత్య చేయలేదు, న్యాయం పోరాటం చేస్తాం: రాజేశ్ తల్వార్
నోయిడాలో సంచలనం రేపిన జంట హత్య కేసులో కోర్టు దోషులుగా నిర్ధారించడంపై రాజేశ్ తల్వార్ దంపతులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తీర్పు వెలువడిన వెంటనే తల్వార్ దంపతులు దుఃఖంలో మునిగిపోయారు. ఐదు సంవత్సరాల క్రితం కూతురు ఆరుషి, పనిమనిషి హెమ్ రాజ్ లను హత్య చేశారని రాజేశ్ తల్వార్ దంపతులను కోర్టు దోషులుగా నిర్ఱారించింది. కోర్టు తీర్పు పట్ల తల్వార్ తీవ్ర నిరాశకు గురయ్యారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. అయితే వారు న్యాయం కోసం పోరాటం చేస్తారని ఓ ప్రకటనలో వెల్లడించారు. కోర్టు తీర్పు వెలువడిన తర్వాత తల్వార్ దంపతులను ఘజియాబాద్ లోని దాస్నా జైలుకు పోలీసులు తీసుకువెళ్లారు. మేము చేయని నేరానికి తమకు శిక్ష వేయడంపై రాజేశ్ అసంతృప్తిని వెల్లగక్కారు. నోయిడాలోని డాక్టర్ రాజేశ్ తల్వార్ నివాసంలో 2008 మే 16 తేదిన ఆరుషి మృతదేహం లభించగా, ఆతర్వాత రోజున పనిమనిషి హేమ్ రాజ్ మృత దేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఆరుషీ హత్య కేసులో మధ్యాహ్నం తుది తీర్పు
న్యూఢిల్లీ : అయిదేళ్ల పాటు అనేక మలుపులు తిరుగుతూ సాగిన ఆరుషి జంట హత్యల కేసు విచారణ ఎట్టకేలకు తుదిదశకు చేరింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నేడు కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో ఘజియాబాద్ కోర్టు వద్ద ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. ప్రధాన న్యాయమూర్తి శ్యామ్ లాల్ మధ్యాహ్నం 2 గంటలకు తీర్పును వెల్లడించనున్నారు. ఈకేసుకు సంబంధించి 15 నెలల్లో 84 మంది సాక్షులను సీబీఐ విచారించింది. తల్లిదండ్రులు డాక్టర్ రాజేశ్ తల్వార్, ఆయన భార్య నుపుర్ తల్వార్ లే కూతురు ఆరుషి, తమవద్ద సర్వెంట్‌గా ఉన్న హేమరాజ్‌ను హత్య చేశారని ఛార్జీషీట్ లో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ నోయిడాలోని జలవాయు విహార్‌లోని తన నివాసంలో మే15, 2008న 14 ఏళ్ల బాలిక ఆరుషి హత్యకు గురైంది. నిందితుడిగా అనుమానించిన ఆ ఇంటి పనిమనిషి హేమ్రాజ్ కూడా ఆ తరువాత అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఆరుషి తల్లిదండ్రులు నూపుర్ తల్వార్, రాజేష్ తల్వార్ ఉన్నారు. ఈ హత్య మిస్టరీగా మారడంతో ఢిల్లీ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. ప్రారంభం నుంచి ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. జాతీయ స్థాయిలో ప్రజలు ఈ కేసు తీర్పు పట్ల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.