'ఆరుషి హత్యకు సంబంధించిన ఆధారాలు సీబీఐ వద్ద లేవు'
'ఆరుషి హత్యకు సంబంధించిన ఆధారాలు సీబీఐ వద్ద లేవు'
Published Tue, Nov 26 2013 5:34 PM | Last Updated on Sat, Sep 2 2017 1:00 AM
సంచలనం రేపిన ఆరుషి జంట హత్యకేసులో కోర్టు వెల్లడించిన తీర్పుకు విరుద్దంగా, సీబీఐ విచారణకు వ్యతిరేకంగా ఆరుషి స్నేహితురాలు ఫిజా ఝా వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ హత్యకేసులో నిజమైన దోషులను శిక్షించినపుడే ఆరుషికి తగిన న్యాయం జరుగుతుంది అని అన్నారు. అంతేకాకుండా ఆరుషి తల్లితండ్రులకు శాంతి చేకూరుతుంది అని ఫిజా అభిప్రాయపడింది. జంట హత్యల కేసులో ఆరుషి తల్లితండ్రులు రాజేశ్, నుపూర్ తల్వార్ దంపతులకు ఘజియాబాద్ కోర్టు యావజ్జీవ శిక్ష విధించిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో ఆరుషి హత్యకు సంబంధించి సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, పరిస్థితుల డిమాండ్ మేరకే సీబీఐ వ్యవహరించిందని ఫిజా వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో అనుమానితులను అరెస్ట్ చేయాలనే ఓకే కారణంతో తల్వార్ దంపతులను అరెస్ట్ చేశారని, ఆరుషి కేసులో న్యాయం చేయడానికి ఎవరూ ప్రయత్నించలేదని ఫిజా ఆవేదన వ్యక్తం చేసింది.
Advertisement