హత్య చేయలేదు, న్యాయం పోరాటం చేస్తాం: రాజేశ్ తల్వార్
నోయిడాలో సంచలనం రేపిన జంట హత్య కేసులో కోర్టు దోషులుగా నిర్ధారించడంపై రాజేశ్ తల్వార్ దంపతులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తీర్పు వెలువడిన వెంటనే తల్వార్ దంపతులు దుఃఖంలో మునిగిపోయారు. ఐదు సంవత్సరాల క్రితం కూతురు ఆరుషి, పనిమనిషి హెమ్ రాజ్ లను హత్య చేశారని రాజేశ్ తల్వార్ దంపతులను కోర్టు దోషులుగా నిర్ఱారించింది.
కోర్టు తీర్పు పట్ల తల్వార్ తీవ్ర నిరాశకు గురయ్యారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. అయితే వారు న్యాయం కోసం పోరాటం చేస్తారని ఓ ప్రకటనలో వెల్లడించారు. కోర్టు తీర్పు వెలువడిన తర్వాత తల్వార్ దంపతులను ఘజియాబాద్ లోని దాస్నా జైలుకు పోలీసులు తీసుకువెళ్లారు.
మేము చేయని నేరానికి తమకు శిక్ష వేయడంపై రాజేశ్ అసంతృప్తిని వెల్లగక్కారు. నోయిడాలోని డాక్టర్ రాజేశ్ తల్వార్ నివాసంలో 2008 మే 16 తేదిన ఆరుషి మృతదేహం లభించగా, ఆతర్వాత రోజున పనిమనిషి హేమ్ రాజ్ మృత దేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.