ఆరుషి, హేమ్‌రాజ్‌ల హత్య కేసులో గడిచిన నాలుగేళ్లుగా శిక్ష అనుభవించిన రాజేశ్ తల్వార్, ఆయన భార్య నుపుర్ తల్వార్‌లు సోమవారం సాయంత్రం ఘజియాబాద్ దస్నా జైలు నుంచి విడుదలయ్యారు. జంటహత్య కేసులో వీరికి సీబీఐ కోర్డు విధించిన జీవితఖైదును అలహాబాద్ హైకోర్టు గత వారం రద్దుచేసిన సంగతి తెలిసిందే. వరుస సెలవుల కారణంగా వారి విడుదల మూడు రోజులు ఆలస్యమైంది.