సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు కాలె విజయ్ సాయి(40) ఆత్మహత్య చేసుకోవడానికి రెండు రోజుల ముందు తన భార్య కాలె వనిత(32)పై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. శనివారం రాత్రి యూసఫ్‌గూడ చెక్‌పోస్ట్ వద్ద ఉన్న తన ఇంట్లోకి చొరబడి కారును ఎత్తుకుపోయారని అదేరోజు జూబ్లీహిల్స్ పోలీసులకు విజయ్ సాయి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. వాచ్‌మన్‌ను బెదిరించి, దూషించి తన కారు దొంగిలించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
తమ విడాకుల వివాదం 2015 నుంచి కోర్టులో ఉందని వెల్లడించాడు. కారు వనిత పేరు మీద ఉన్నప్పటికీ దానికి సంబంధించిన ఈఎంఐలు అన్ని తానే కట్టానని, రుజువులు కూడా ఉన్నాయని తెలిపాడు. తన భార్య నుంచి ప్రాణహాని ఉందని, నలుగురు దుండగులు తనపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన కారు తిరిగి ఇప్పించాలని, న్యాయం చేయాలని అభ్యర్థించాడు. సీసీ టీవీ ఫుటేజీ, కారుకు సంబంధించిన పత్రాలు జతపరిచినట్టు ఫిర్యాదులో రాశాడు.
Comments
Please login to add a commentAdd a comment