
ముంబై : సినిమాల్లో నటించే అవకాశాలు రాకపోవడంతో మనస్తాపం చెందిన ఓ వర్థమాన నటి అపార్టమెంట్ టెర్రస్ పై నుంచి దూకేసి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన గతరాత్రి ముంబైలోని ఒషివార ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతురాలు పంజాబ్‌కు చెందిన నటిగా పోలీసులు గుర్తించారు. కాగా సినిమాల్లో ఛాన్స్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆమె ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ గార్డ్ బిపిన్ కుమార్ ఠాకూర్ మాట్లాడుతూ..‘ ఈ సంఘటన అర్థరాత్రి 12.15 నుంచి 12.30 మధ్యలో జరిగింది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం వచ్చింది. అయితే ఎవరైనా రోడ్డుమీద గొడవ పడుతున్నారని అనుకున్నాం. ఏమైందా అని చూసేందుకు వెళ్లాను. ఇంతలో మూడో అంతస్తులో శబ్దం రావడంతో అక్కడకు వెళ్లి చూడగా యువతి కింద పడిపోయింది’ అని తెలిపాడు. కాగా మానసికంగా కుంగుబాటుకు గురైన నటి తరచూ తల్లితో గొడవ పడుతూ ఉండేదని పోలీసులు వెల్లడించారు. గతంలో కూడా ఆమె రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment