
నటుడు అజిత్ అభిమానిపై నటుడు విజయ్ అభిమాని కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో విజయ్ అభిమానిని పుళల్ పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. పుళల్ సమీపంలోని కావంగరైలో శ్రీలంక శరణార్థుల శిబిరంలో నివశిస్తున్న ఉమాశంకర్(32) నటుడు అజిత్‌కు వీరాభిమని. అక్కడే నివసిస్తున్న రోషన్(34)అనే వ్యక్తి నటుడు విజయ్ అభిమాని.
కాగా వీరిద్దరు సోమవారం రాత్రి కలిసి మాట్లాడుకుంటుండా నటులు విజయ్,అజిత్‌ల గురించి చర్చ వచ్చింది. ఈ చర్చలో ఇద్దరి మధ్య భేదాప్రాయాలు చోటు చేసుకోవడంతో గొడవకు దారి తీసింది. ఆగ్రహించిన విజయ్ అభిమాని రోషన్ ఉమాశంకర్‌ను తీవ్రంగా గాయపరిచి పారిపోయాడు. గాయపడిన అతన్ని స్థానికులు పాడియ నట్లూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్చారు.
పరిస్థితి చాలా విషమంగా ఉండటంతో పుళల్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న రోషన్‌ను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలానికి దారి తీసింది. ఇటీవల విజయ్, అజిత్ అభిమానులు సోషల్ మీడియా వేదిక రచ్చచేస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment